అన్వేషించండి

బాత్రూమ్ ఇంట్లో ఈ దిక్కున కడితే కష్టాలు తప్పవు

వాస్తు నియమాల్లో ఏది తప్పినా ఇంట్లోకి నెగెటివిటి వచ్చి చేరుతుంది. ఫలితంగా కుటుంబ సభ్యులు రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. వాస్తు నియమాల్లో ప్రతి చిన్న విషయానికి ఉండే ప్రాధాన్యతను విస్మరించకూడదు.

వాస్తు సనాతన నిర్మాణ శాస్త్రం. నిర్మాణాలకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని గురించి కూడా వాస్తు చర్చిస్తుంది. వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణంలోని ప్రతి భాగం చాలా ముఖ్యమైనదే. ఎక్కడ చిన్న లోపం జరిగినా అది ఇంట్లో నివసించే అందరి మీదా ప్రభావం చూపుతుంది. ఇంట్లో బాత్రూం ఎక్కడ ఉండాలనేదానికి వాస్తులో ప్రత్యేకంగా కొన్ని నిమయాలు ఉన్నాయి. ఈ నియమాలు పాటించక పోతే వాస్తు దోషాలు ఏర్పడుతాయి. ఈ దోషాల వల్ల బాధలు తప్పవు.

ఇంటి నిర్మాణ సమయంలో బాత్రూమ్ ఎక్కడుండాలి అనే విషయానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. తప్పకుండా బాత్రూమ్ గురించి వాస్తు లో చెప్పిన ప్రత్యేక నిమయాలను పాటించాలి.

  • వాస్తు ప్రకారం బాత్రూమ్ ఎప్పుడూ ఆగ్నేయం లేదా నైరుతి దిక్కున ఉండకూడదు. ఇలా ఉంటే ఇంట్లో వారి ఆరోగ్యం మీద చెడు ప్రభావం పడుతుంది. తరచుగా ఇంట్లో ఎవరో ఒకరు అనారోగ్యం బారిన పడుతుంటారు.
  • వాస్తు దక్షిణాన్ని అగ్ని దిశగా పరిగణిస్తారు. అందుకే ఈ దిక్కున నీళ్ల బకెట్ కానీ, నీటి కుళాయి కానీ, షవర్ కానీ ఉండకూడదు. ఉత్తరంలో ట్యాప్ లేదా షవర్ పెట్టుకోవచ్చు. ఉత్తరం నీటికి మేలైన దిశ.
  • వాస్తును అనుసరించి బాత్రూమ్ లో కలర్స్ చాలా లైట్ గా ఉండాలి. లేత పసుపు లేదా లేత ఆకుపచ్చ వంటి రంగులు మాత్రమే వాడాలి. తెలుపు కూడా మంచిదే.
  • బాత్రూమ్ లో నీలం రంగు బకెట్, మగ్ పెట్టుకోవడం మంచిది. ఇలా చెయ్యడం వల్ల ఇంట్లోకి సంపద వస్తుందట. బాత్రూమ్ లో ఎరుపు లేదా నలుపు రంగు బకెట్లు అసలు వాడకూడదు.
  • బాత్రూమ్ లో అద్దం పెట్టుకోకూడదని వాస్తు చెబుతోంది. అద్దం శక్తిని ప్రతిబింబిస్తుంది. బాత్రూమ్ లో ఎక్కువగా ప్రతికూల శక్తి ఉంటుంది. కనుక ఇక్కడ అద్దం అమర్చడం వల్ల ఆ శక్తి ప్రతిబింబించి రెట్టింపు అయ్యే ప్రమాదం ఉంటుంది కనుక బాత్రూమ్ లో అద్దం ఉంచకూడదు. కానీ అటాచ్డ్ బాత్రూమ్ లలో ఇప్పుడు అందరూ అద్దాలు పెట్టుకోవాలని అనుకుంటున్నారు. అలాంటపుడు ఉత్తరం లేదా తూర్పు గోడకు అద్దం పెట్టుకోవడం బెటర్.
  • వాస్తు ప్రకారం బాత్రూమ్ మెయిన్ గేట్ కు ఎదురుగా లేదా వంట గది ముదు నిర్మించకూడదు. దీని వల్ల ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడుతాయి. అలాగే బాత్రూమ్ టాయిలెట్ సీట్ పశ్చిమ లేదా వాయవ్య దిక్కున ఉండాలి.
  • అటాచ్డ్ బాత్రూమ్ ఎల్లప్పుడు తలుపు మూసి ఉంచాలి.
  • ఈశాన్యం లేదా తూర్పువైపు బాత్రూమ్ ఎప్పుడూ ఉండకూడదు.
  • గీజర్, స్విచ్ బోర్డ్, హీటర్ వంటివి బాత్రూమ్ ఆగ్నేయ భాగంలో పెట్టుకోవడం మంచిది.
  • బాత్రూమ్ లో తూర్పులేదా ఈశాన్యంలో బాత్ టబ్ పెట్టుకోవచ్చు
  • బాత్రూమ్ అవుట్ లెట్ లు తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండాలి.
  • మెట్లకింద టాయిలెట్ అసలు నిర్మించకూడదు.

Also read : ఆఫీసు డెస్క్ మీద ఇవి పెట్టుకుంటే మీ కెరీర్ పీక్స్‌లో ఉంటుంది

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Anakapally News: రైలు కదులుతుండగా ఎక్కబోయాడు - ట్రైన్‌కు ప్లాట్ ఫాంకు మధ్య చిక్కుకుపోయాడు, చివరకు!
రైలు కదులుతుండగా ఎక్కబోయాడు - ట్రైన్‌కు ప్లాట్ ఫాంకు మధ్య చిక్కుకుపోయాడు, చివరకు!
Embed widget