By: ABP Desam | Updated at : 04 Jan 2023 11:56 AM (IST)
Edited By: Bhavani
Representational image/ pixels
ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని నానుడి. అంటే ఈ రెండింటిలో ఎంత చేసినా ఏదో ఒకటి మిగిలిపోతూ ఉంటుందని. ఎక్కడో ఒక చోట లోపం మిగిలి పోతూ ఉంటుంది. పెళ్లి విషయంలో జరిగిన లోపాలను జనం త్వరలోనే మరచిపోతారు కానీ ఇంటి విషయం అలా కాదు. అది కలకాలం నిలిచి ఉండే కట్టడం. ఇల్లు కడుతున్నపుడు ఇలా ఏదైనా వాస్తు లోపం మిగిలిపోతే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు ఏర్పడి ప్రేమానురాగాలు దూరం కావచ్చు. ఇంటిలో అలాంటి అశాంతికి కారణమయ్యే వాస్తు దోషాల గురించి వాస్తు పండితులు చెప్పే విషయాలు తెలుసుకుందాం.
స్వప్న సౌధ నిర్మాణం అంత సులభం కాదు. జీవితకాలంలో సంపాదించిందంతా వెచ్చించి ఇంటి నిర్మాణం చేస్తుంటారు. చిన్నచిన్న దోషాలు కూడా జీవితంలో ఆనందాన్ని దూరం చేస్తాయి. వాస్తు నియమాలను అనుసరించి ఇల్లు కట్టుకోవడం అన్నిటా శ్రేయోదాయకం.
Also Read: భోగి మంటలకు అన్నీ రెడీ చేసుకుంటున్నారా, ఇవి మాత్రం వేయకండి!
గోడలను రంగులతో మాత్రమే కాదు చాలామంది ఇంటి గోడలను వివిధ చిత్రాలు, పెయింటింగ్స్ అలంకరిస్తారు. అంతేకాదు, కొందరు గోడలకు విగ్రహాలను కూడా అలంకరిస్తుంటారు. వాస్తు నియమాల ప్రకారం.. గోడలకు విగ్రహాలను వేలాడదీయకూడదు. గోడలకు దేవుడి చిత్రాలను అలంకరించవచ్చు. అలాగే, ఇంట్లో పెట్టుకునే విగ్రహాలు పెద్దవిగా ఉండకూడదు. వాస్తు ప్రకారం అవి 1 నుంచి 11 అంగుళాలను మించి పెద్దవిగా ఉండకూడదు.
ఇంటి ఈశాన్య భాగంలో ఎప్పుడూ కూడా టాయిలెట్ నిర్మాణం చెయ్యకూడదు. దీని వల్ల తీవ్రమైన ఆర్థిక సంక్షోభాలు కలుగవచ్చు. అది కుటుంబంలో అశాంతికి కూడా కారణమవుతుంది. ఈశాన్య భాగం ఎత్తులో ఉండకూడదు. ఇంటిలోని ఈశాన్యన పూజా స్థానం ఉండాలి. ఈ భాగాన్ని ఎట్టిపరిస్థితుల్లో అద్దెకు ఇవ్వకూడదు.
ఇంటి తలుపులు ఎప్పుడూ లోపలికి తెరచుకోవాలి. అంతేకాదు, తలుపుల కదలికల్లో శబ్ధం రావడం కూడా అంత మంచి సంకేతం కాదు. ఇదే నియమం కిటికీలకు కూడా వర్తిస్తుంది. ఇలా లేనట్టయితే ఇంటి యజమాని జీవితాంతం దుఃఖిస్తుంటారు. భయం, మానసిక వ్యథ ఎప్పుడూ వేధిస్తుంది.
Also Read: నిత్యం తినే ఆహారంలో 5 రకాలైన దోషాలు, మీరు ఎలాంటి భోజనం చేస్తున్నారో తెలుసా!
ఇంట్లోకి గబ్బిలాలు ప్రవేశిస్తే దోషం పదిహేను రోజులు ఉంటుంది. ఇంటిని తప్పనిసరిగా శుద్ధి చేసుకోవాలి. కాకులు, రాబందులు ఇంట్లోకి రావడం అంత మంచిది కాదు. అంతే కాదు ఇంట్లో తేనెటీగలు తుట్టెను పెట్టకూడదు. దీని వల్ల దోషం ఆరు నెలల పాటు ఉంటుంది. ఈ అన్ని దోషాల పరిహారానికి తప్పనిసరిగా ఇంటిని శుద్ధి చేసుకోవాలి.
Bhishma Pratigya Mahabharat: భీష్మ ప్రతిజ్ఞ అంటే ఏంటి - ఇంతకీ భీష్ముడు ఏం సందర్భంలో ఏమని ప్రతిజ్ఞ చేశాడు!
Bhishma Ashtami 2023:అందరూ కృష్ణుడిని తలుచుకుంటే కృష్ణుడు ఎవర్ని స్మరించాడో తెలుసా!
Srimad Bhagavatam:పెళ్లి ఆలస్యం అయ్యే అమ్మాయిలు రుక్మిణీ కళ్యాణం - మరి పెళ్లికాని అబ్బాయిలు ఏం చదవాలంటే!
Weekly Horoscope 30 January to 5 February 2023: ఈ వారం ఈ రాశులవారికి అనుకూలం, ఆ రాశులవారికి ప్రతికూలం- జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5 రాశి ఫలాలు
Horoscope Today 29th January 2023: ఈ రాశులవారు ఈరోజు ఏం చేసినా మంచి ఫలితమే వస్తుంది, జనవరి 29 రాశిఫలాలు
Australian Open 2023: 2023ను రికార్డుతో మొదలెట్టిన ‘జోకర్’ - పదో ఆస్ట్రేలియన్ ఓపెన్ సొంతం!
Nellore Rural MLA: నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు ! వైసీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?
Gujarat Junior Clerk Exam Cancel: హైదరాబాద్‌లో పేపర్ లీకేజీ కలకలం, జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ రద్దు చేసిన గుజరాత్