News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Vastu Tips In Telugu: మీ ఇంటి వాలు మీ ఆదాయ-వ్యయాలను నిర్ణయిస్తుందని మీకు తెలుసా!

ఇంటిలోపల, ద్వారం బయట వాటర్ పోస్తే ఏ వైపు చేరుతున్నాయి. ఇది చాలా చిన్న విషయం అనుకుంటే పొరపాటే..

FOLLOW US: 
Share:

Vastu Tips In Telugu:  ఇల్లంతా వాస్తు ప్రకారమే నిర్మించాం అనుకుంటారు కానీ ఇంటి లోపల చిన్న చిన్న విషయాలను పరిగణలోకి తీసుకోరు. ఫలితంగా కొన్ని సమస్యలు వెంటాడుతుంటాయి. ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవదు..ఖర్చులు తగ్గవు , ఆర్థిక ఇబ్బందులు వెంటాడతాయి. ఇంట్లో చీటికి మాటికీ గొడవలు జరుగుతుంటాయి. ప్రశాంతత ఉండదు...నిత్యం అనారోగ్య సమస్యలతో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుదుంటారు. ఇంట్లో వాస్తు సమస్యలు ఉన్నా ఇలా జరుగుతుందంటారు వాస్తు శాస్త్ర పండితులు.  ఇంటిలోపల కూడా కొన్ని వాస్తు జాగ్రత్తలు పాటించకపోవడమే అంటారు. అవేంటో చూద్దాం.

Also Read: ఇంటి ద్వారానికి ఎదురుగా ఇలాంటి ఫొటోలు పెడుతున్నారా, అయితే ఈ మార్పులు చేయాల్సిందే

  • ఇంట్లో ట్యాపులు, పంపులు లీకవుతూ ఉంటే సంపాదించినదంతా హరించుకుపోతుందని చెబుతారు వాస్తుశాస్త్ర నిపుణులు. ట్యాపులు లీకవుతున్నప్పుడు వెంటనే మార్చుకోవడం మంచిది
  • ఇంట్లో నీటికి సంబంధించిన పాత్రలు ఎప్పుడూ ఉత్తర దిశలో ఉంచాలి. ఎందుకంటే ఉత్తర దిశలో కుబేరుడు ఉంటాడు. కుబేరుడు సంపదకు సూచిక కావడంతో అక్కడ పెట్టిన నీటిపాత్రలు లీకయ్యేలా ఉండకూడదు.
  • నీటి పాత్రను దక్షిణం లేదా పడమర దిశలో ఎప్పుడూ ఉంచకూడదు. ఇలా ఉంచితే మానసిక ఒత్తిడి రోజురోజుకు పెరుగుతుంది.
  • వాస్తుశాస్త్రం ప్రకారం భూమి పల్లంగా ఉండి తూర్పు వైపున నీటిపారుదల ఉంటే ఆ ఇంట్లోనే లక్ష్మీదేవి నివసిస్తుందని అంటారు. అంతేకాకుండా ఇంటి సభ్యులు చాలా అభివృద్ధి చెందుతారు. అంతేకాకుండా ఈ దిశలో నీటి పారుదల పెరుగుదల, విస్తరణకు మంచిది. జీవితంలో వచ్చే సమస్యలను, అవరోధాలను సులభంగా పరిష్కరించుకుంటారు.
  • వాస్తుశాస్త్రం ప్రకారం ఉత్తరదిశలో నీరు ప్రవాహం ఉంటే ఆ ఇల్లు శుభప్రదంగా ఉంటుంది. అదృష్టం కలిసొస్తుంది. ఆర్థిక సమస్య అస్సలుండదు.
    పశ్చిమ దిశలో పల్లం ఉంటే వాస్తుశాస్త్రం ప్రకారం అది అశుభంగా పరిగణిస్తారు. అది ఇంటి సభ్యులపై కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.ఆర్థికంగా చాలా నష్టపోతారు, ఇంట్లో చీటికి మాటికి తగాదాలు జరుగుతాయి.
  • నీరు దక్షిణ దిశవైపు ప్రవహిస్తే ఈ ఇంట్లో ఉండేవారికి అనారోగ్య సమస్యలు వెంటాడతాయి. అంతేకాకుండా కొన్ని అవాంఛనీయం సంఘటనలు జరిగే అవకాశముంది. ఇంటి సభ్యులందరూ ఎంత కష్టపడి పనిచేసినా సమస్యల చుట్టుముడతాయి.
  • వాస్తు ప్రకారం నీరు ఈశాన్యంవైపు పల్లం ఉంటే కుటుంబ సభ్యులకు అదృష్టం కలిసొస్తుంది.గౌరవ, ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ ఇంట్లో ఉండేవారంతా ప్రశాంతంగా ఉంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.
  • ఇంటి వాలు నైరుతి దిశలో ఉంటే ఇంట్లో నివసించే ప్రజలు చెడు అలవాట్లు, వ్యాధులకు గురవుతారు. శత్రువుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

Also Read: మీ బెడ్ రూమ్ లో అద్దం ఎటువైపు ఉంది, మంచం ఏ దిక్కున గోడకు వేశారు!

వాస్తు కొందరికి సెంటిమెంట్ మరికొందరికి ట్రాష్. అస్సలు పట్టించుకోనివారికి సమస్యే లేదు కానీ వాస్తుని విశ్వశించేవారు మాత్రం ప్రతి విషయాన్ని చాలా సునిశితంగా పరిశీలిస్తారు. వాస్తు ప్రకారం ఇది సరికాదని తెలిస్తే చాలు ఎలాంటి మార్పులు చేర్పులైనా చేసేస్తారు. ఇంటి నిర్మాణం సమయంలో మొదలైన వాస్తు..ఇంట్లో వస్తువులు సర్దుకునే వరకూ ఉంటుందని గమనించాలంటారు వాస్తు శాస్త్ర నిపుణులు...

నోట్: వాస్తు నిపుణులు చెప్పిన వివరాలు, వాస్తు పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలి అన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం..

Published at : 26 Sep 2023 08:21 AM (IST) Tags: vastu shastra vastu tips for home Vastu tips for water The science of Vastu Shastra Vastu tips for positive energy

ఇవి కూడా చూడండి

Margashira Masam 2023: డిసెంబరు 13 నుంచి మార్గశిర మాసం, ఈ నెలలో గురువారాలు చాలా ప్రత్యేకం!

Margashira Masam 2023: డిసెంబరు 13 నుంచి మార్గశిర మాసం, ఈ నెలలో గురువారాలు చాలా ప్రత్యేకం!

Christmas Santa Claus: అసలు మీకు క్రిస్మస్ తాత కథ తెలుసా!

Christmas Santa Claus: అసలు మీకు క్రిస్మస్ తాత కథ తెలుసా!

Vastu Tips In Telugu: ఇంటికి పేరు పెట్టేటప్పుడు ఈ సూచ‌న‌లు పాటించండి, మీ జీవితం సంతోషంగా ఉంటుంది

Vastu Tips In Telugu: ఇంటికి పేరు పెట్టేటప్పుడు ఈ సూచ‌న‌లు పాటించండి, మీ జీవితం సంతోషంగా ఉంటుంది

Astrology: ఈ రాశులవారు అయస్కాంతం టైప్ - ఇట్టే ఆకర్షించేస్తారు!

Astrology: ఈ రాశులవారు అయస్కాంతం టైప్ - ఇట్టే ఆకర్షించేస్తారు!

Daily Horoscope Today Dec 8, 2023 : ఈ రాశివారు ఈ రోజు పరధ్యానంలో ఉంటారు, కుటుంబంలో వివాదాలు

Daily Horoscope Today Dec 8, 2023 : ఈ రాశివారు ఈ రోజు పరధ్యానంలో ఉంటారు, కుటుంబంలో వివాదాలు

టాప్ స్టోరీస్

Revanth Reddy Resigns: రేవంత్‌ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్‌ లెటర్ అందజేత

Revanth Reddy Resigns: రేవంత్‌ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్‌ లెటర్ అందజేత

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే