Vastu Tips: ఈ మొక్క ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది!
వంటల్లో, పూజలూ పునస్కారాల్లో పసుపు వాడకం గురించి మాత్రమే తెలిసి ఉంటుంది అందరికీ కానీ దీనికి వాస్తులో కూడా ప్రత్యేక స్థానం ఉంది. పసుపు మొక్క నాటడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం.
Vastu Tips: పసుపు హిందూ సంప్రదాయంలో చాలా పవిత్రమైంది. పసుపు లేకుండా ఏ శుభకార్యమూ జరగదు, ఏ పూజా మొదలవదు. పసుపు ఐదవతనానికి ప్రతీకగా భావిస్తారు . అందుకే పసుపు కుంకుమలు అని కలిపి వాడుతుంటారు. వీటిని అత్యంత పవిత్రమైనవిగా, పూజనీయమైనవిగా భావిస్తారు. కేవలం పూజలు, పుణ్య కార్యాల్లో మాత్రమే కాదు, దాదాపు అన్ని వంటల్లోనూ మంచి రంగు, రుచి కోసం చిటికెడు పసుపు వాడుతూనే ఉంటారు. పసుపు కలరింగ్ ఏజెంట్ మాత్రమే కాదు. అనేకానేక ఔషధ గుణాలు కూడా కలిగిన దుంప. ఇప్పటి వరకు వంటల్లో, పూజలూ పునస్కారాల్లో పసుపు వాడకం గురించి మాత్రమే తెలిసి ఉంటుంది అందరికీ కానీ దీనికి వాస్తులో కూడా ప్రత్యేక స్థానం ఉందని మీకు తెలుసా? పసుపు మొక్క నాటడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి ఇవ్వాళ తెలుసుకుందాం.
పసుపు అదృష్టాన్ని ఇస్తుందని నమ్మకం. ప్రతి పూజలోనూ పసుపుతో చేసిన గణపతి పూజ మొదట తప్పకుండా చేస్తారు. ఇలా చెయ్యడం వల్ల తలపెట్టిన పని విఘ్నం లేకుండా పూర్తవుతుందని పురాణాలు చెబుతున్నాయి. పూజకు వినియోగించే అక్షతలను బియ్యానికి కాస్త పసుపు, ఆవు నెయ్యి కలిపి తయారు చేస్తారు. బియ్యంతో పసుపు చేరడం వల్ల ఈ బియ్యం అత్యంత పవిత్రమైన, శక్తికలిగినవి గా మారతాయని నమ్మకం. పూజా సమయంలో పూవ్వులు లేదా పండ్లు లేదా మరే పూజా ద్రవ్యం అందుబాటులో లేకపోయినా పసుపు కలిపిన అక్షతలను ప్రత్యామ్నాయంగా భగవంతుడికి సమర్పించడం పరిపాటి. అటువంటి పసుపు పొడి పసుపు కొమ్మును దంచి తయారు చేస్తారు. పసుపు మొక్క కూడా అంతే పవిత్రమైందని పురాణాలు చెబుతున్నాయి.
Also Read: బంగారం కొనేందుకు కూడా మంచి రోజులు చూస్తారా!
ఐశ్వర్యానికి పసుపు మొక్క
ఇంట్లో పసుపు మొక్క నాటితే చాలా శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ఇంట్లో పసుపు మొక్క ఉంటే ఇంట్లో సంపద పెరుగుతుందట. ఆర్థిక సమస్యలు తొలగి పోతాయి. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు బలపడతాయి. అయితే దీన్ని సరైన దిక్కున నాటుకోవాలని శాస్త్రం చెబుతోంది.
పసుపు మొక్క నాటే దిశ
వాస్తు ప్రకారం పసుపు మొక్కను దక్షిణం, తూర్పుదిక్కుల మధ్య నాటాలి. ఇలా పసుపు మొక్క నాటుకుంటే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లో సంతోషం, శాంతి కావాలనుకునే వారు పశ్చిమం, ఉత్తర దిక్కుల నడుమ నాటుకోవాలి.
గ్రహ శాంతికి పసుపు మొక్క
పసుపు వినియోగం వల్ల బృహస్పతి బలోపేతమవుతాడు. కుటుంబ సంబంధాలు బలపడతాయి. ఇంట్లో పాజిటివిటి పెరుగుతుంది. ఇంట్లో డబ్బు దాచుకునే చోట పూజలో పెట్టిన పసుపు కొమ్ము పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని శాస్త్రం చెబుతోంది.
అమ్మవారి పూజలోనూ, విష్ణు ఆరాధనలోనూ పసుపు తప్పనిసరి. పసుపు లేకుండా చేసే పూజ అర్థరహితమైందిగా భావిస్తారు. అయితే శ్మాశాన వాసి అయిన ఆ మహా దేవుడి ఆరాధనకు మాత్రం పసుపును వినియోగించరు.
Also read : తులసి పూజలో ఈ నియమాలు పాటించండి లక్ష్మి కటాక్షిస్తుంది
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial