అన్వేషించండి

Tirumala news: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - తిరుమలలో 10 రోజులపాటు వైకుంఠ ఏకాదశి దర్శనం

TTD news: తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు.

Tirumala News: తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10 నుండి 19 వరకు తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శనం కల్పించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. 40 రోజులు మాత్రమే సమయం ఉండడం తో ఆయా శాఖల అధికారులందరు చేయాల్సిన అంశైల పై చర్చించారు. అనంతరం పలు సూచనలు చేశారు. 

పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. సాధారణ భక్తులకు ఎక్కువ దర్శన సమయం కల్పించేలా జారీ చేయాల్సిన టికెట్ల కోటా, ఇతర అంశాలపై మరో రెండు వారాల్లో మరో సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. వైకుంఠ ఏకాదశికి సరిపోయే పూల అలంకరణలు, వసతి, శ్రీవారి సేవకులు, స్కౌట్‌లను నియమించడం, ట్రాఫిక్ నిర్వహణ, పారిశుద్ధ్యం, ఇతర అంశాలపై కూడా ఆయన చర్చించారు.

సమావేశంలోని ముఖ్యాంశాలు

- ఈ పది రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు (ప్రోటోకాల్ వీఐపీలు మినహా) రద్దు.

- జనవరి 10 నుండి 19వ తేది వరకు వరకు 10 రోజుల పాటు చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, ఆర్మీ, ఎన్ఆర్ఐ దర్శనాలు రద్దు.

- జనవరి 09 నుండి 19 వరకు ఆర్జిత సేవలు రద్దు

- జనవరి 10న స్వర్ణ రధం ఊరేగింపు, 11న  చక్ర స్నానం ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

- మాతృశ్రీ  తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో 10 రోజుల పాటు ఉదయం 6 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు అన్న ప్రసాదం పంపిణీ చేయబడుతుంది. 

పాత నిర్ణయంలో ఏమైనా మార్పులు

గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో వైకుంఠ ఏకాదశి 10 రోజులు పాటు దర్శనం కల్పించాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. 5 సంవత్సరాల టీటీడీ బోర్డు తీసుకున్న అనేక నిర్ణయాలను ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు రద్దు చేయడం, కొన్ని మార్పులు చేయడం జరుగుతుంది. అయితే గత ప్రభుత్వం తీసుకున్న వైకుంఠ ఏకాదశి 10 రోజులు దర్శనం మాత్రం మార్పు చేయకపోవడం గమనార్హం. 

టీటీడీ ఉద్యోగుల విన్నపాలు

టీటీడీ లో పని చేసే ఉద్యోగులకు గతంలో కొన్ని వెసులుబాటు ఉండేది. ఏడాది పొడవునా స్వామి వారి దర్శనం కోసం ఉద్యోగుల బంధువులు, స్నేహితులకు సిఫార్సు పై దర్శనం కల్పించే వారు. సాధారణ భక్తుల పేరుతో ఆ విధానం పూర్తిగా మారిపోయింది. వైకుంఠ ఏకాదశి 10 రోజులు పెట్టిన తరువాత ఆ విధానం లో తొలి రెండు రోజులు.. అంటే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజులు మినహా మిగిలిన 8 రోజుల పాటు టీటీడీ ఉద్యోగి సిఫార్సు పై దర్శనం కల్పించే వెసులుబాటు ఇచ్చారు. అది కూడా టీటీడీ ఉద్యోగ సంఘాలు విన్నపాలు మేరకు ఉత్తర్వులు ఇచ్చే వారు. అయితే నూతన బోర్డు అయిన లేదా కూటమి ప్రభుత్వం నియమించిన అధికారులు అయిన టీటీడీ ఉద్యోగుల విన్నపాలు లేకుండా వారికి సిఫార్సు లు అనుమతిస్తారా లేదా వేచి చూడాల్సిందే. 

టాప్ హెడ్ లైన్స్

10-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
10-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
మీన రాశి వారఫలాలు ఆగస్టు 9-15: మీ సంబంధాలలో మూడవ వ్యక్తి జోక్యం ఉద్రిక్తతను పెంచుతుంది జాగ్రత్త!
మీన రాశి వారఫలాలు ఆగస్టు 9-15: మీ సంబంధాలలో మూడవ వ్యక్తి జోక్యం ఉద్రిక్తతను పెంచుతుంది జాగ్రత్త!
కుంభ రాశి వారఫలాలు ఆగస్టు 9-15: భావోద్వేగాలకు లోనవకండి , ఈ వారం ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి!
కుంభ రాశి వారఫలాలు ఆగస్టు 9-15: భావోద్వేగాలకు లోనవకండి , ఈ వారం ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి!
మకర రాశి వారఫలాలు ఆగస్టు 9-15: చిన్న నిర్లక్ష్యం తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు, ఈ వారం అప్రమత్తంగా ఉండండి!
మకర రాశి వారఫలాలు ఆగస్టు 9-15: చిన్న నిర్లక్ష్యం తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు, ఈ వారం అప్రమత్తంగా ఉండండి!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
Embed widget