అన్వేషించండి

Molathadu: మొలతాడు పురుషులకు ఎందుకంత ముఖ్యం? దీనివెనకున్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలేంటి?

Secret Behind Waist Thread Molathadu : హిందూ సంప్రదాయంలో అనుసరించే ప్రతి పద్ధతిలోనూ శాస్త్రీయ కారణాలుంటాయి. మొలతాడు కట్టుకోవడం కూడా ఇందులో భాగమే.. ఇంతకీ మగాళ్లకు మొలతాడు ఎందుకంత ముఖ్యం?

మనిషి శరీరానికి మధ్యలో కట్టే తాడు మొలతాడు

చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ
బంగరు మొలతాడు పట్టుదట్టి
సందె తాయతులును సరిమువ్వ గజ్జెలు
చిన్నికృష్ణ నిన్ను చేరికొలుతు

ఇది చదవగానే... పట్టువస్త్రం, నడుముకి బంగారు మొలతాడుతో చిన్ని కృష్ణుడి రూపం కళ్లముందు కనిపిస్తుంది. మొలతాడు గురించి అంత ప్రత్యేకంగా ప్రస్తావన ఉంటుంది. 

ధర్మ సింధువు ప్రకారం

మౌంజీం యజ్ఞోపవీతంచ నవదండంచ ధారయేత్‌
అజినం కటిసూత్రంచ నవ వస్త్రం తదైవచ ॥ 

'దర్భ  తాడును, జంధ్యాన్ని, ఊతగా వినియోగించే మోదుగ కర్ర, జింక చర్మం, మొలత్రాడు, వస్త్రం...ఇవన్నీ ప్రతి సంవత్సరం కొత్తగా ధరించాలని అర్థం. 

పైన శ్లోకంలో ఉన్న కటిసూత్రం అంటే మొలతాడు. ఇది ఆరోగ్య భద్రతకోసం పెట్టిన పురుష ఆభరణం. 

మనిషి శరీరం రెండు భాగాలుగా ఉంటుంది
1. నడుము పైభాగం దేవభాగం
2. నడుము కిందభాగం రాక్షసభాగం

దేవభాగాన్ని ఉత్తమమైన బంగారంతో కానీ అంతకన్నా శ్రేష్ఠమైన నవరత్నాలతో కానీ అలంకరించాలని చెబుతోంది సనాతన ధర్మం
మిగిలిన రాక్షస భాగంలో వెండిని వినియోగించవచ్చు కానీ బంగారం వాడరాదు. మొలతాడు కట్టిన పై భాగం అలంకారం... పూజా పునస్కారాలకు సంబంధించింది అని చెప్పడమే అంతరార్ధం

శరీరాన్ని మధ్యగా బాహ్యరూపంలో విభజించి చూపిస్తుంది మొలతాడు. శరీరానికి సంగమ స్థానం నడుము... అందుకే ఈ భాగంలో బంగారం, వెండి, దారం..ఇలా ఎవరిస్థాయి ఆధారంగా వారు మొలతాడు కట్టుకోవచ్చు. 

మొలతాడు కట్టుకునేందుకు సాధారణంగా ఎరుపు, నలుపు దారాన్ని వినియోగిస్తారు

మొలతాడు మార్చుకోవాల్సి వచ్చినప్పుడు కొత్తది కట్టిన తర్వాతే పాతది తొలగిస్తారు..ఒక్క క్షణం కూడా మొండి మొల ఉండకూడదు అని చెబుతారు పెద్దలు

మొలతాడు ఎందుకు? 

దీనివెనుకున్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలేంటి?
 
మొలతాడు అలంకారానికి సంబంధించిన వస్తువు కానేకాదు..ఇది కట్టుకుంటే దుష్టశక్తుల నుంచి ప్రభావం ఉండదు
 
చిన్నారులకు దిష్టి తగలకుండా మొలతాడు కడతారు..నల్లటి మొలతాడుతో పాటూ నలుపు, ఎరుపు పూసలు కట్టడం వెనుక కారణం ఇదే

శరీరాన్ని మధ్యగా దిష్టి తగలకూడదని మొలతాడు కడతారు. చిన్నారులకు మొలతాడుకి  రంగురంగుల పూసలు కట్టడం వెనుక కారణం  ఇదే.

జాత‌క రీత్యా ఉండే దోషం తగ్గేందుకు , దుష్టశక్తుల నుంచి రక్షణకోసం కట్టే తాయెత్తులు మొలకు కట్టేది కూడా ఇందుకే

నల్లటి తాడుని మొలకి కట్టడం వల్ల శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది
 
చిన్నారులకు మొలతాడు కడితే వాళ్ళు పెరుగుతున్న సమయంలో ఎముకలు ,కండరాలు సరైన పద్ధతిలో వృద్ధి చెందుతాయి, రక్తప్రసరణ మెరుగుపడుతుంది. 

మగవారికి జననాంగం ఆరోగ్యంగా పెరుగుతుంది
 
చిన్నారులుగా ఉన్నప్పుడు ఆడపిల్లలకు కూడా మొలతాడు కడతారు.. రజస్వల అయ్యేవరకూ ఉంచి ఆ తర్వాత తీసేస్తారు.
 
వివాహిత స్త్రీకి మెడలో మంగళసూత్రం ఎంత ముఖ్యమో..పురుషులకు మొలతాడు అంతే ముఖ్యం. మొలతాడు లేని పురుషులను భార్య చనిపోయిందా అని ప్రశ్నించేవారట. 
 
ఇప్పుడంటే వైద్య పరిజ్ఞానం పెరిగింది కానీ అప్పట్లో చుట్టుపక్కల లభించే ఆకులు, వేర్లనే వైద్యానికి వినియోగించేవారు. ఏవైనా విష పురుగులు కుట్టినప్పుడు వెంటనే మొలతాడు బిగించి ఆ విషయం శరీరం పైకి పాకకుండా చేసి బయటకు తీసేవారు. 

మొలతాడు ధరించడం వల్ల తీసుకునే ఆహారం విషయంలో నియంత్రణ ఉంటుంది. బిగుసుకుపోతున్న మొలతాడు పొట్ట పెరుగుతోందని చెప్పేందుకు ఓ సంకేతం..అంటే ఆహరపు అలవాట్లలో మార్పులు చేసుకోవాల్సిందే అనే హెచ్చరిక ఇది. ఫలితంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది, బానపొట్టని నివారిస్తుంది
 
మొలతాడు ధరించేవారికి హెర్నియా , వెన్నుకు సంబంధించిన సమస్యలు రావని చెబుతారు పెద్దలు. 

భవిష్యత్ లో వచ్చే ఎన్నో వ్యాధులకు బొడ్డు మూలకణాలు పరిష్కారం..ఇప్పుడు స్టెమ్ సెల్స్ థెర‌పీ ఇదే... అందుకే అప్పట్లో బొడ్డుని తాయెత్తుగా చేసి మొలతాడుకి కట్టేవారు. 

ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయ్.. హిందూ సంప్రదాయంలో భాగంగా అనుసరించే ప్రతి ఆచారం వెనుక ఎన్నో శాస్త్రీయ కారణాలున్నాయని చెప్పేందుకు ఇదే నిదర్శనం అంటారు పండితులు.

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది మీ నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Keralam: కేరళలో కమ్యూనిస్టులకు మద్దతుగా బీజేపీ - రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే - ఏం జరిగిందంటే?
కేరళలో కమ్యూనిస్టులకు మద్దతుగా బీజేపీ - రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే - ఏం జరిగిందంటే?
Sankranti 2026 : మకర సంక్రాంతి స్పెషల్.. నువ్వులతో చేసే రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాలు ఇవే
మకర సంక్రాంతి స్పెషల్.. నువ్వులతో చేసే రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాలు ఇవే
Mana Shankara Varaprasad Garu : సంక్రాంతికి 'మన శంకరవరప్రసాద్ గారు' హిట్ కొట్టారు - మూవీకి మెగాస్టార్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
సంక్రాంతికి 'మన శంకరవరప్రసాద్ గారు' హిట్ కొట్టారు - మూవీకి మెగాస్టార్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Andhra Pradesh Latest News: సంక్రాంతి వేళ రాజకీయ గోల- భోగి మంటల్లో జీవోలు దహనం చేసిన వైసీపీ- జగన్ బొమ్మ పాస్ బుక్స్‌ తగలబెట్టిన టీడీపీ 
సంక్రాంతి వేళ రాజకీయ గోల- భోగి మంటల్లో జీవోలు దహనం చేసిన వైసీపీ- జగన్ బొమ్మ పాస్ బుక్స్‌ తగలబెట్టిన టీడీపీ 

వీడియోలు

Anil Ravipudi on Social Media Trolls | మీమర్స్ ట్రోల్స్ వేసుకుంటే వేసుకోండి..నేను ఎంజాయ్ చేస్తా |ABP
Rohit Sharma Records Ind vs NZ ODI | క్రిస్ గేల్ రికార్డును అధిగమించిన హిట్‌మ్యాన్
RCB vs UP WPL 2026 | ఆర్సీబీ సూపర్ విక్టరీ
Washington Sundar Ruled Out | గాయంతో బాధ‌ప‌డుతున్న వాషింగ్ట‌న్ సుంద‌ర్
Devdutt Padikkal record in Vijay Hazare Trophy | దేవదత్ పడిక్కల్ అరుదైన రికార్డు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Keralam: కేరళలో కమ్యూనిస్టులకు మద్దతుగా బీజేపీ - రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే - ఏం జరిగిందంటే?
కేరళలో కమ్యూనిస్టులకు మద్దతుగా బీజేపీ - రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే - ఏం జరిగిందంటే?
Sankranti 2026 : మకర సంక్రాంతి స్పెషల్.. నువ్వులతో చేసే రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాలు ఇవే
మకర సంక్రాంతి స్పెషల్.. నువ్వులతో చేసే రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాలు ఇవే
Mana Shankara Varaprasad Garu : సంక్రాంతికి 'మన శంకరవరప్రసాద్ గారు' హిట్ కొట్టారు - మూవీకి మెగాస్టార్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
సంక్రాంతికి 'మన శంకరవరప్రసాద్ గారు' హిట్ కొట్టారు - మూవీకి మెగాస్టార్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Andhra Pradesh Latest News: సంక్రాంతి వేళ రాజకీయ గోల- భోగి మంటల్లో జీవోలు దహనం చేసిన వైసీపీ- జగన్ బొమ్మ పాస్ బుక్స్‌ తగలబెట్టిన టీడీపీ 
సంక్రాంతి వేళ రాజకీయ గోల- భోగి మంటల్లో జీవోలు దహనం చేసిన వైసీపీ- జగన్ బొమ్మ పాస్ బుక్స్‌ తగలబెట్టిన టీడీపీ 
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్రాంతి షాక్! వాహనాల కొనుగోలుదారులపై 10 శాతం రోడ్‌ సెస్‌
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్రాంతి షాక్! వాహనాల కొనుగోలుదారులపై 10 శాతం రోడ్‌ సెస్‌
Hyderabad Crime News: భర్త కోసం దొంగగా మారిన సాఫ్ట్‌వేర్ భార్య! రీజన్ తెలిస్తే షాక్ అవుతారు!
భర్త కోసం దొంగగా మారిన సాఫ్ట్‌వేర్ భార్య! రీజన్ తెలిస్తే షాక్ అవుతారు!
Anaganaga Oka Raju Review : 'మన శంకరవరప్రసాద్ గారు' రూటులో 'అనగనగా ఒక రాజు' - రివ్యూస్, రేటింగ్స్‌కు చెక్... వాళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్
'మన శంకరవరప్రసాద్ గారు' రూటులో 'అనగనగా ఒక రాజు' - రివ్యూస్, రేటింగ్స్‌కు చెక్... వాళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్
Anaganaga Oka Raju OTT : ఆ ఓటీటీలోకి 'అనగనగా ఒక రాజు' - నవీన్ పోలిశెట్టి కామెడీ ఎంటర్టైనర్ ఎప్పటి నుంచి రావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి 'అనగనగా ఒక రాజు' - నవీన్ పోలిశెట్టి కామెడీ ఎంటర్టైనర్ ఎప్పటి నుంచి రావొచ్చంటే?
Embed widget