అన్వేషించండి

Tirumala: తిరుమలలో ఇక ప్రసాదాల నాణ్యతపై నో కాంప్రమైజ్! TTD సంచలన నిర్ణయాలు, భక్తులకు గుడ్ న్యూస్!

Tirumala News: తిరుమలలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆహార నాణ్యత పరీక్ష పరిశోధనశాల ప్రారంభించారు TTD చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో  జె. శ్యామలరావు.

Tirumala Latest News: గతంలో స్వామివారి ప్రసాదాలు, నెయ్యి లాంటి వస్తువుల నాణ్యతను పరీక్షించేందుకు ఇతర రాష్ట్రాలకు నమూనాలు పంపాల్సి వచ్చేది కానీ ఇప్పుడు తిరుమలలోనే అత్యాధునిక పరికరాలతో నేరుగా పరీక్షలు నిర్వహించగలిగే విధంగా ల్యాబ్‌ను తీర్చిదిద్దినట్లు తెలిపారు TTD చైర్మన్ బీ.ఆర్.నాయుడు. 

ఇప్పటివరకు తిరుమలలో నెయ్యి నాణ్యతను పరీక్షించే వసతి లేదు ఫస్ట్ టైమ్.. నెయ్యిలో కల్తీ శాతం, నాణ్యత శాతాన్ని తక్షణమే విశ్లేషించే సామర్థ్యంతో కూడిన పరికరాలు ఏర్పాటు చేశామన్నారు టీటీడీ ఈవో  శ్యామలరావు. 75 లక్షలు విలువైన ఈ పరికరాలను గుజరాత్ లోని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (NDDB) విరాళంగా ఇచ్చిందన్నారు. ల్యాబ్‌ సిబ్బంది, పోటు కార్మికులు మైసూర్‌లోని CFTRIలో ప్రత్యేక శిక్షణ పొందారని, ఇకపై స్వామివారి ప్రసాదాల నాణ్యతను ఇదే ల్యాబ్‌లో పరిశీలించి వెంటనే ఫలితాలు అందించేలా ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు.  

ఇంకా... తిరుమ‌ల‌లో వైకుంఠం క్యూ  కాంప్లెక్స్ -3 నిర్మాణానికి క‌మిటీ వేశామని తెలిపారు టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ బీఆర్ నాయుడు. ఒంటిమిట్ట  కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో నిరంత‌రాయంగా అన్న‌ప్ర‌సాదం అందించనున్నారు. వెనుకబడిన ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణ వ్య‌యం రూ.10 లక్షల నుంచి 20 ల‌క్ష‌ల‌కు పెంచామమన్నారు. TTDలో 142 కాంట్రాక్ట్ డ్రైవర్ల‌ను క్రమబద్ధీకరించేందుకు ప్ర‌భుత్వానికి సిఫార్సు చేశామని చెప్పారు.   ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయానికి వచ్చే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందించేందుకు రూ.4.35 కోట్లు కేటాయించిన‌ట్లు టీటీడీ ఛైర్మ‌న్‌ బీఆర్ నాయుడు చెప్పారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో మంగ‌ళ‌వారం టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
తిరుమలలో  శ్రీవారి భక్తుల రద్దీకి అనుగుణంగా వైకుంఠం క్యూ  కాంప్లెక్స్ -3 నిర్మించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు..ఈ మేరకు నిపుణుల కమిటీ వేయాలని నిర్ణయించారు. భక్తుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాల్లో విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అవకాశాలపై అధ్యయనం చేయాలని నిర్ణయించారు. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాల్లో మౌలిక వసతులు పెంచేందుకు, ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.  శిలాతోరణం, చక్రతీర్థం ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసేందుకు డీపీఆర్ రూపొందించనున్నామని తెలిపారు. ఇతర దేశాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి నిపుణుల కమిటీ సమర్పించింది నివేదికపై TTD సబ్ కమిటీ ఏర్పాటు చేయనుంది. భక్తులకు స్వచ్ఛంద సేవను పటిష్టంగా అమలు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. శ్రీవారి భక్తులు సైబర్ మోసాలకు గురికాకుండా చూసుకునేలా సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నారు. తిరుమల కళ్యాణకట్టలో  మెరుగైన సౌకర్యాలు, పారిశుద్ధ్యం, భద్రతను పెంపొందించేందుకు నిపుణులను సంప్రదించి ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు.

తిరుమలలో పరిపాలన సౌలభ్యం కోసం అన్ని విభాగాలు ఒకేచోట కేంద్రీకృతమయ్యేలా నూతన పరిపాలనా భవనం నిర్మించాలని నిర్ణయించారు. పాత బడిన హెచ్వీడీసీలోని 6 బ్లాకులు, బాలాజీ విశ్రాంతి గృహం, ఆంప్రో గెస్ట్ హౌస్,  అన్నపూర్ణ క్యాంటీన్, కళ్యాణి సత్రాలను ఐఐటీ నిపుణుల సూచన మేరకు తొలగించాలనుకున్నారు. తాళ్లపాకలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. వేద పారాయణదారులకు  దేవదాయశాఖ ద్వారా  నిరుద్యోగ భృతి చెల్లించేందుకు నిధులు మంజూరు చేసేందుకు ఆమోదించారు. వెనుకబడిన ప్రాంతాల్లో నిర్మించే స్వామివారి ఆలయాలకు నిధులు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేటగిరీల్లో మార్పులు చేశారు. మరోవైపు AP హైకోర్టు తీర్పు మేరకు TTDలో కాంట్రాక్ట్ డ్రైవర్లుగా పని చేస్తున్న 142 మందిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వానికి ఆమోదానికి పంపించాలని నిర్ణయించారు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

17-10-2026 శనివారం సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల్లో ఎవరికి అదృష్టం, ఎవరికి జాగ్రత్త అవసరం?
17-10-2026 శనివారం సింహం, కన్యా,తులా, వృశ్చిక రాశుల్లో ఎవరికి అదృష్టం, ఎవరికి జాగ్రత్త అవసరం?
17-10-2026 శనివారం రాశిఫలాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల భవిష్యత్తుకు గ్రహాల సూచనలు
17-10-2026 శనివారం రాశిఫలాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల భవిష్యత్తుకు గ్రహాల సూచనలు
ఇంద్రకీలాద్రి నవరాత్రి 7వ రోజు: మహాలక్ష్మి అలంకారం - ఐశ్వర్యం, విజయం మీ సొంతం!
ఇంద్రకీలాద్రి నవరాత్రి 7వ రోజు: మహాలక్ష్మి అలంకారం - ఐశ్వర్యం, విజయం మీ సొంతం!
Saddula Bathukamma Wishes 2026: సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు! ఈ పాటలతో మీ ఆత్మీయులకు పంపండి!
సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు! ఈ పాటలతో మీ ఆత్మీయులకు పంపండి!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Vinukonda Guntur Highway Expansion: వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?
Embed widget