అన్వేషించండి

TTD News : ఇక ఆన్‌లైన్‌లో శ్రీవారి అంగప్రదిక్షణ టిక్కెట్లు - ఇదిగో ఇలా పొందండి !

శ్రీవారి అంగప్రదిక్షణ టిక్కెట్లు ఆన్‌లైన్‌లో ఉంచాలని టీటీడీ నిర్ణయించింది. ధర రూ. 750గా నిర్ణయించారు.

 

TTD News :    పదమొక్కుల వాడు, భక్త వత్సలుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి  వారిని భక్తులు సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వి‌ఐపి బ్రేక్, ఆర్జితసేవ, అంగప్రదక్షణ వంటి రూపాల్లో భక్తులకు లభిస్తోంది.  కోవిడ్ కారణంగా తాత్కాలికంగా తిరుమలలో అంగప్రదక్షణ టోకెన్ల జారీ ప్రక్రియను నిలిపి వేశారు.  దాపు రెండున్నర ఏళ్ళ తరువాత తిరిగి ఈ ఏడాది ఏప్రిల్ 1వ తారీఖు నుండి తిరిగి ఆఫ్ లైన్ లో అంగప్రదక్షణ టోకెన్లను టిటిడి తిరుమలలోని సిఆర్వో కార్యాలయం వద్ద భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.  ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో అధిక సంఖ్యలో భక్తుల రద్దీ నేపధ్యంలో రోజు వారి తిరుమలలో జారీ చేసే అంగప్రదక్షణ టోకెన్ల ప్రక్రియను భక్తుల సౌఖర్యార్ధం ఆన్లైన్ లో తీసుకొచ్చేందుకు టిటిడి నిర్ణయం తీసుకుంది. 

అంగప్రదిక్షణ సేవకు భక్తులకు అవకాశం

శేషాద్రి వాసుడికి అంగప్రదిక్షణ అంటే ఎంతో ప్రీతికరం. అందుకే భక్తి భావంతో భక్తులు పొర్లు దండాలు చేసి స్వామి వారు కటాక్షాలను పొందుతుంటారు భక్తులు.  భక్తుల సౌఖర్యార్ధం ప్రతి రోజు వేకువజామున రెండు గంటలకు అంగప్రదక్షణ టోకెన్లు కలిగిన వారు ముందుగా శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానం ఆచరించి తడి బట్టలతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా భక్తులు ఆలయం ప్రవేశం చేయిస్తుంది టిటిడి.. ఇలా ఆలయ ప్రవేశం చేసిన భక్తులు ముందుగా వెండి వాకిలి దాటి బంగారు వాకిలి చేరుకోవాల్సి ఉంటుంది.. వెండి వాకిలి లోపల ఆనంద నిలయం చుట్టూ చేసే ప్రదక్షిణాన్నే అంగప్రదక్షణ అని కూడా అంటారు.. సుప్రభాత సేవ జరిగే సమయంలో వెలుపల భక్తులను అంగప్రదక్షణ చేయిస్తుంటారు. వెండి వాకిలి లోపలికి ప్రవేశించగానే‌ ఎదురుగా ఆదిశేషునిపై శ్రీరంగనాధుడు కనిపిస్తాడు.. ఈయనకు పైన వరదరాజ స్వామి, క్రింద శ్రీ వేంకటేశ్వర స్వామి మూర్తులు చిన్న బంగారు ఫలకాలపై ఉంటారు.. ఇక్కడి నుండి అంగప్రదక్షణ మొదలు అవుతుంది. 

ఆన్‌లైన్‌లోనే టోకెన్లు జారీ చేయాలని నిర్ణయం

ఇలా‌ ఆనంద నిలయం చుట్టూ ఓ పదక్షణ చేసిన తరువాత వారికి స్వామి దర్శన భాగ్యం కల్పిస్తుంది టిటిడి.. ఇలా స్వామి వారి అంగప్రదక్షణ చేసి మొక్కులు తీర్చుకోవడం ద్వారా దీర్ఘకాలిక భాధల నుండి విముక్తి లభించడమే కాకుండా,ఎన్నో జన్మ పుణ్యఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం.. ఈ క్రమంలోనే  ప్రతి రోజు మధ్యాహ్నం తిరుమల సిఆర్వో కార్యాలయం వద్ద జారీ చేసే అంగప్రదక్షణ టోకెన్లకు భారీ డిమాండ్ ఉంటుంది.. ఉదయం నుండి భక్తులు క్యూలైన్స్ లో టోకెన్ల కోసం వేచి ఉండి టోకెన్లను పొందతూ ఉంటారు భక్తులు.. ఈ సమయంలో అధిక రద్దీ నేపధ్యంలో భక్తుల మధ్య కొంత తోపులాట జరిగే అవకాశం ఉంటుంది.. అయితే భక్తులు ఇబ్బందులను దృష్టిలో తీసుకున్న టిటిడి.. ఇకపై భక్తుల సౌఖర్యార్ధం ఆన్లైన్ లో అంగప్రదక్షణ టోకెన్ల జారీ చేయాలని నిర్ణయించింది.

జూన్‌ 15వ తేదీ ఉదయం పది గంటల నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి !

ఈ నెల 15వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో భ‌క్తుల‌కు అందుబాటులో అంగ‌ప్ర‌ద‌క్ష‌ణ‌ టోకెన్లను అందుబాటులోకి తీసుకుని రానుంది టిటిడి.. అంగ‌ప్ర‌ద‌క్ష‌ణ టోకెన్ల‌ను జూన్ 15వ తేదీ నుండి కరెంటు బుకింగ్ స్థానంలో ఆన్‌లైన్‌లో భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచేందుకు టిటిడి సిద్దం చేస్తుంది.. ఈ టికెట్లు పొందేందుకు ఎక్కువ సేపు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా భక్తులు సౌక‌ర్యార్థం ఇక‌పై టీటీడీ ఆన్‌లైన్‌లోనే విడుద‌ల చేయ‌నుంది.. ఇందులో భాగంగా జూన్ 15వ తేదీ ఉద‌యం 10 గంట‌ల‌కు జూన్ 16వ తేదీ నుండి జూలై 31వ తేదీ వ‌ర‌కు రోజుకు 750 టోకెన్ల చొప్పున ఆన్‌లైన్‌లో జారీ చేస్తారు.. ఇందుకు సంబంధించిన టిటిడి వెబ్ సైట్  https://tirupatibalaji.ap.gov.in ద్వారా అంగ‌ప్ర‌ద‌క్ష‌ణ టికెట్లు బుక్ పొందే అవకాశం కల్పించింది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget