అన్వేషించండి

TTD Board Meeting : మే 5 నుంచి శ్రీవారి మెట్టు నడకమార్గంలో భక్తులకు అనుమతి, టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు

TTD Board Meeting : టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని బోర్డు తెలిపింది.

TTD Board Meeting : సామాన్య భక్తులకు దర్శనాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. శనివారం తిరుమల అన్నమయ్య భవన్ లో జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. స్లాట్ బుకింగ్ విధానం, నడక దారి భక్తులకు టోకెన్ల జారీ త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. టీటీడీకి మహారాష్ట్ర ప్రభుత్వం శ్రీవారి ఆలయ నిర్మాణానికి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల విలువ గల 10 ఎకరాల స్థలాన్ని ముంబయిలో కేటాయించిందని ఆయన వివరించారు. త్వరలోనే ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి, ఆలయ నిర్మాణం చేపడుతామని అన్నారు. 

మే 5న గరుడ వారధి ప్రారంభం 

ఆలయ నిర్మాణానికి రైమెండ్స్ అధినేత గౌతమ్ సింఘానియా ముందుకు వచ్చారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మే 5వ తేదీ నుంచి శ్రీవారి మెట్టు నడకమార్గంలో భక్తులను అనుమతిస్తామని, శ్రీవారి ఆలయంలో 3.61 కోట్ల రూపాయలతో బంగారు సింహాసనాలు తయారు చేయనున్నట్లు చెప్పారు. పద్మావతి మెడికల్ కాలేజిలో 21 కోట్ల రూపాయల వ్యయంతో నూతన నిర్మాణాలకు పాలక మండలి ఆమోదించిందన్నారు. శ్రీనివాస సేతు మొదటి దశ పనులు పూర్తి అయ్యాయని, మే 5వ తేదీన సీఎం జగన్ చేతులు మీదుగా గరుడ వారధిని ప్రారంభిస్తామని తెలిపారు. గరుడ వారధి రెండో దశ పనులకు 100 కోట్లు కేటాయించామన్నారు. మార్చి 2023కి పనులు పూర్తి చేస్తామన్నారు. ఐఐటి నిపుణలు సూచన మేరకు ఘాట్ రోడ్డులో పటిష్ట చర్యలు తీసుకోవడానికి రెండు దశలలో 36 కోట్లు కేటాయింపుకు పాలక మండలి ఆమోదం తెలిపిందన్నారు. 

టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు 

తిరుమలలో వసతి గదులు మరమత్తులకు రూ.19 కోట్లు కేటాయించగా, బాలాజీ నగర్ లో 2.86 ఎకరాల స్థలంలో ఎలక్ట్రిక్ బస్టాండ్ నిర్మాణం చేపడుతున్నట్లు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. 437 మంది ఉద్యోగుల క్వార్టర్స్ మరమ్మతులకు నిర్ణయం తీసుకున్నామని, వస్తు రూపంలో విరాళాలు అందించే భక్తులకు ప్రివిలేజస్ అందజేస్తామన్నారు. టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయింపు త్వరలోనే జరుగుతుందన్నారు. స్విమ్స్ లో 300 పడకల క్యాన్సర్ విభాగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. జమ్ములో శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మే 5 వ తేదీన సీఎం జగన్ ఐదు కార్యక్రమాలలో పాల్గొంటారన్నారు. అన్నమయ్య నడకమార్గం అభివృద్ధి పనులకు ఇంకా అనుమతులు రాలేదన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget