అన్వేషించండి

TTD News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఈ తేదీలు గుర్తుంచుకోండి

Tirupati Darshan Tickets: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి ఆగస్ట్ టికెట్ల కోటా షెడ్యూల్ ను అధికారులు వెల్లడించారు. భక్తులు ఆన్ లైన్ లో టికెట్లు ఆయా తేదీల్లో బుక్ చేసుకోవాలని తెలిపారు.

TTD Srivari Arjitha Seva Tickets Schedule: తిరుమల (Tiruamala) శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. శ్రీవారి దర్శనానికి సంబంధించి ఆగస్ట్ నెల టికెట్ల కోటా షెడ్యూల్ ను టీటీడీ (TTD) విడుదల చేసింది. ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకూ ఆర్జిత సేవా టికెట్ల (Arjitha Seva Tickets) లక్కీ డిప్ రిజిస్ట్రేషన్లు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. టికెట్లు పొందిన వారు మే 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు నగదు చెల్లించాలని.. వారికి లక్కీ డిప్ లో టికెట్లు జారీ అవుతాయని పేర్కొన్నారు. అలాగే, శ్రీవారి ఆర్జిత, కల్యాణం, ఊంజల్, బ్రహ్మోత్సవం, స్వచ్చంద సేవలతో పాటు వార్షిక పవిత్రోత్సవం టికెట్లు ఈ నెల 21న ఉదయం 10 గంటలకు, వర్చువల్ సేవా టికెట్లు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంచనున్నారు. కాగా, శ్రీవారి ఆలయంలో ఆగస్ట్ 15 నుంచి 17 వరకూ వార్షిక పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. 

మిగిలిన టికెట్ల విడుదల ఎప్పుడంటే.?

  • ఈ నెల 23వ తేదీన ఆగస్ట్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేస్తారు.
  • అలాగే, శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించి ఆగస్ట్ నెల ఆన్ లైన్ కోటాను ఈ నెల 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.
  • అటు, ఆగస్ట్ నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు.
  • వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారుశ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఆగస్ట్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను ఈ నెల 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు.
  • అలాగే, తిరుమల, తిరుపతిల్లో ఆగస్ట్ నెల గదుల కోటాను ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.
  • అటు, తిరుమల - తిరుపతి శ్రీవారి సేవా కోటాను ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తారు. పరకామణి సేవ మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. https://ttdevasthanams.ap.gov.in సైట్ ద్వారా శ్రీవారి ఆర్దిత సేవా టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. 

తిరుమలలో భక్తుల రద్దీ

మరోవైపు, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 10 కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఉచిత సర్వ దర్శనానికి 8 గంటలు, రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. అలాగే, టైమ్ స్లాట్ ఎస్ఎస్ డీ దర్శనం కోసం 4 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. గురువారం 65,508 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా.. 25,996 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారి హుండీ ఆదాయం రూ.2.97 కోట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

Also Read: Andhra Pradesh News: ఏపీలోనే హాటెస్ట్ నియోజకవర్గంలో కుమారీ అంటీ ఎన్నికల ప్రచారం- ఫైర్‌ బ్రాండ్‌పైనే విమర్శలు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srinivas Reddy: తడిచిన ధాన్యం మద్ధతు ధరకే కొనుగోలు, పంట బోనస్ రూ.500: తెలంగాణ కేబినెట్ నిర్ణయం
తడిచిన ధాన్యం మద్ధతు ధరకే కొనుగోలు, పంట బోనస్ రూ.500: తెలంగాణ కేబినెట్ నిర్ణయం
AP 10th Supplementary Exams: మే 24 నుంచి ఏపీలో పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, టైమ్ టేబుల్ వివరాలు
మే 24 నుంచి ఏపీలో పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, టైమ్ టేబుల్ వివరాలు
Bengaluru Rave Party: జనసేనాని పవన్‌పైనా నోటికొచ్చింది రాశారు... రేవ్ పార్టీ పుకార్లకు జానీ మాస్టర్ స్ట్రాంగ్ రిప్లై
జనసేనాని పవన్‌పైనా నోటికొచ్చింది రాశారు... రేవ్ పార్టీ పుకార్లకు జానీ మాస్టర్ స్ట్రాంగ్ రిప్లై
Cheetah In Tirumala: తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం, మెట్ల మార్గంలో సంచారంతో టెన్షన్ టెన్షన్!
తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం, మెట్ల మార్గంలో సంచారంతో టెన్షన్ టెన్షన్!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Chudidar Gang in Hyderabad | హైదరాబాద్ లో వణికిస్తున్న చుడీదార్ దొంగలు | ABP DesamHema Bangalore Rave Party Issue | చిల్ అవుతున్న హేమ.. మరో కేసులో చిక్కుకుందా..! | ABP DesamSIT Report to AP DGP | ఏపీ ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు పూర్తి | ABP DesamTeam Kannappa at Cannes Film Festival 2024 | కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో మంచు ఫ్యామిలీ క్లాస్ షో | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srinivas Reddy: తడిచిన ధాన్యం మద్ధతు ధరకే కొనుగోలు, పంట బోనస్ రూ.500: తెలంగాణ కేబినెట్ నిర్ణయం
తడిచిన ధాన్యం మద్ధతు ధరకే కొనుగోలు, పంట బోనస్ రూ.500: తెలంగాణ కేబినెట్ నిర్ణయం
AP 10th Supplementary Exams: మే 24 నుంచి ఏపీలో పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, టైమ్ టేబుల్ వివరాలు
మే 24 నుంచి ఏపీలో పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, టైమ్ టేబుల్ వివరాలు
Bengaluru Rave Party: జనసేనాని పవన్‌పైనా నోటికొచ్చింది రాశారు... రేవ్ పార్టీ పుకార్లకు జానీ మాస్టర్ స్ట్రాంగ్ రిప్లై
జనసేనాని పవన్‌పైనా నోటికొచ్చింది రాశారు... రేవ్ పార్టీ పుకార్లకు జానీ మాస్టర్ స్ట్రాంగ్ రిప్లై
Cheetah In Tirumala: తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం, మెట్ల మార్గంలో సంచారంతో టెన్షన్ టెన్షన్!
తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం, మెట్ల మార్గంలో సంచారంతో టెన్షన్ టెన్షన్!
Vivo X Fold 3 Pro: ఇండియాలో ఫస్ట్ వివో ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ ఎప్పుడంటే?
ఇండియాలో ఫస్ట్ వివో ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ ఎప్పుడంటే?
AP Election Violence: ఏపీలో పోలింగ్ అల్లర్లపై డీజీపీకి సిట్ 150 పేజీల నివేదిక- పల్నాడు జిల్లాలోనే ఎక్కువ హింస, కేసులు
ఏపీలో పోలింగ్ అల్లర్లపై డీజీపీకి సిట్ 150 పేజీల నివేదిక- పల్నాడు జిల్లాలోనే ఎక్కువ హింస, కేసులు
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ రిమాండ్ పొడిగింపు
ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ రిమాండ్ పొడిగింపు
Ap Elections: 'కౌంటింగ్ టైంలో హింసాత్మక ఘటనలు జరగొచ్చు' - ఎన్నికల సంఘానికి ఇంటెలిజెన్స్ నివేదిక
'కౌంటింగ్ టైంలో హింసాత్మక ఘటనలు జరగొచ్చు' - ఎన్నికల సంఘానికి ఇంటెలిజెన్స్ నివేదిక
Embed widget