అన్వేషించండి

Tirumala Alert: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. దివ్యదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లు తాత్కాలికంగా మార్పు , ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే!

Divya Darshan (DD) tokens at Srivari Mettu to Bhudevi Complex : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు అలర్ట్... శ్రీవారి మెట్టు వద్ద ఇచ్చే దివ్యదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లను తాత్కాలికంగా మార్చారు

Tirumala Alert:  తిరుమల: శ్రీవారి దర్శనార్థం శ్రీవారి మెట్టువద్ద నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులకు దివ్యదర్శనం టోకెన్ల జారీ చేస్తారు. అయితే ఈ కౌంటర్లను తాత్కాలికంగా శ్రీవారి మెట్టు వద్ద నుంచి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ కి మార్చాలని TTD నిర్ణయించింది. ఈ మేరకు ఈ నూతన కౌంటర్లు జూన్ 06 శుక్రవారం సాయంత్రం నుంచి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో అందుబాటులోకి రానున్నాయి.

ఈ అంశానికి సంబంధించి TTD  ఈవో జె. శ్యామలరావు జూన్ 03 మంగళవారం సాయంత్రం వర్చువల్ సమావేశం ద్వారా TTD అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో ముఖ్యమైన అంశాలు ఇవే..
 
శ్రీవారి మెట్టు నుంచి కాలినడకన వెళ్లే భక్తులకు దివ్య దర్శనం టోకెన్ల జారీ కోసం భూదేవి కాంప్లెక్స్ లో తాత్కాలికంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు

జూన్ 6 శుక్రవారం సాయంత్రం నుంచి భూదేవి కాంప్లెక్స్ లో టోకెన్లుజరీ ప్రక్రియ ప్రారంభం

ఆధార్ కార్డ్ చూపించి దివ్యదర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులు శ్రీవారి మెట్టు మార్గంలో 1200వ మెట్టు దగ్గర స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది
 
ప్రతి శనివారం స్వామివారి దర్శనంకోసం దివ్యదర్శనం టోకెన్లు  శుక్రవారం సాయంత్రం  మంజూరు చేయనున్నారు, SSD  టోకెన్లను కూడా అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో ఆయా కేంద్రాల్లో ఇస్తారు. 

భక్తుల రద్దీ వల్ల ఎలాంటి ట్రాపిక్ సమస్యలు తలెత్తకుండా టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ, జిల్లా పోలీసుల సమన్వయంతో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఈవో శ్యామలరావు ఆదేశించారు
 
అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌ వద్ద టోకెన్ల జారీ ప్రక్రియ సజావుగా సాగేలా నిరంతరం పర్యవేక్షించేందుకు అధికారుల బృందాన్ని నియమించి, టోకెన్ కౌంటర్ల దగ్గర ఇబ్బంది లేని వాతావరణం ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు.

శ్రీవారి మెట్టు నుంచి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్దకు టోకెన్ కౌంటర్ల తాత్కాలిక మార్పు అంశంపై విస్తృత ప్రచారం అవసరం అని ఆదేశించారు
 
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుడా, తోపులాట జరగకుండా పటిష్టమైన క్యూలైన్లను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు .

భక్తులకు అందించే అన్నప్రసాదాలు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయా విబాగాల అధికారులకు సూచించారు

శ్రీ వేంకటేశ మంగళాశాసనం

శ్రియః కాంతాయ కల్యాణనిధయే నిధయేఽర్థినామ్ ।
శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ॥ 1 ॥

లక్ష్మీ సవిభ్రమాలోక సుభ్రూ విభ్రమ చక్షుషే ।
చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళమ్ ॥ 2 ॥

శ్రీవేంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంఘ్రయే ।
మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ॥ 3 ॥

సర్వావయవ సౌందర్య సంపదా సర్వచేతసామ్ ।
సదా సమ్మోహనాయాస్తు వేంకటేశాయ మంగళమ్ ॥ 4 ॥

నిత్యాయ నిరవద్యాయ సత్యానంద చిదాత్మనే ।
సర్వాంతరాత్మనే శ్రీమద్-వేంకటేశాయ మంగళమ్ ॥ 5 ॥

స్వత స్సర్వవిదే సర్వ శక్తయే సర్వశేషిణే ।
సులభాయ సుశీలాయ వేంకటేశాయ మంగళమ్ ॥ 6 ॥

పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే ।
ప్రయుంజే పరతత్త్వాయ వేంకటేశాయ మంగళమ్ ॥ 7 ॥

ఆకాలతత్త్వ మశ్రాంత మాత్మనా మనుపశ్యతామ్ ।
అతృప్త్యమృత రూపాయ వేంకటేశాయ మంగళమ్ ॥ 8 ॥

ప్రాయః స్వచరణౌ పుంసాం శరణ్యత్వేన పాణినా ।
కృపయాఽఽదిశతే శ్రీమద్-వేంకటేశాయ మంగళమ్ ॥ 9 ॥

దయాఽమృత తరంగిణ్యా స్తరంగైరివ శీతలైః ।
అపాంగై స్సించతే విశ్వం వేంకటేశాయ మంగళమ్ ॥ 10 ॥

స్రగ్-భూషాంబర హేతీనాం సుషమాఽఽవహమూర్తయే ।
సర్వార్తి శమనాయాస్తు వేంకటేశాయ మంగళమ్ ॥ 11 ॥

శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే ।
రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్ ॥ 12 ॥

శ్రీమత్-సుందరజా మాతృముని మానసవాసినే ।
సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ॥ 13 ॥

మంగళా శాసనపరైర్-మదాచార్య పురోగమైః ।
సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళమ్ ॥ 14 ॥

శ్రీ పద్మావతీ సమేత శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP government employees: ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు - చెల్డ్ కేర్ లీవ్స్ విషయంలో కీలక ఉత్తర్వులు
ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు - చెల్డ్ కేర్ లీవ్స్ విషయంలో కీలక ఉత్తర్వులు
Australia terror attack: ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి పాల్పడిన తండ్రీ కొడుకులు హైదరాబాద్ వాళ్లే - పాకిస్తాన్ వాళ్లు కాదు !
ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి పాల్పడిన తండ్రీ కొడుకులు హైదరాబాద్ వాళ్లే - పాకిస్తాన్ వాళ్లు కాదు !
BRS Party Key Meeting: ఈ 19న జరగాల్సిన బీఆర్‌ఎస్ కీలక సమావేశం వాయిదా వేసిన కేసీఆర్
ఈ 19న జరగాల్సిన బీఆర్‌ఎస్ కీలక సమావేశం వాయిదా వేసిన కేసీఆర్
YSRCP Kukatpalli: కూకట్‌పల్లిలో ధర్నాలు, రాజకీయ ప్రదర్శనలు - వైఎస్ఆర్‌సీపీ నేతలు హద్దులు చెరిపేస్తున్నారా?
కూకట్‌పల్లిలో ధర్నాలు, రాజకీయ ప్రదర్శనలు - వైఎస్ఆర్‌సీపీ నేతలు హద్దులు చెరిపేస్తున్నారా?

వీడియోలు

Prashant Veer Kartik Sharma CSK IPL 2026 Auction | ఎవరీ ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ | ABP Desam
Auqib Nabi IPL 2026 Auction | ఐపీఎల్ 2026 వేలంలో భారీ ధర పలికిన అనామక ప్లేయర్ | ABP Desam
Matheesha Pathirana IPL 2026 Auction | భారీ ధరకు వేలంలో అమ్ముడుపోయిన పతిరానా | ABP Desam
Quinton de Kock IPL 2026 Auction Surprise | సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ కు అంత తక్కువ రేటా.? | ABP Desam
Cameron Green IPL Auction 2026 | ఆసీస్ ఆల్ రౌండర్ కు ఐపీఎల్ వేలంలో ఊహించని జాక్ పాట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP government employees: ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు - చెల్డ్ కేర్ లీవ్స్ విషయంలో కీలక ఉత్తర్వులు
ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు - చెల్డ్ కేర్ లీవ్స్ విషయంలో కీలక ఉత్తర్వులు
Australia terror attack: ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి పాల్పడిన తండ్రీ కొడుకులు హైదరాబాద్ వాళ్లే - పాకిస్తాన్ వాళ్లు కాదు !
ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి పాల్పడిన తండ్రీ కొడుకులు హైదరాబాద్ వాళ్లే - పాకిస్తాన్ వాళ్లు కాదు !
BRS Party Key Meeting: ఈ 19న జరగాల్సిన బీఆర్‌ఎస్ కీలక సమావేశం వాయిదా వేసిన కేసీఆర్
ఈ 19న జరగాల్సిన బీఆర్‌ఎస్ కీలక సమావేశం వాయిదా వేసిన కేసీఆర్
YSRCP Kukatpalli: కూకట్‌పల్లిలో ధర్నాలు, రాజకీయ ప్రదర్శనలు - వైఎస్ఆర్‌సీపీ నేతలు హద్దులు చెరిపేస్తున్నారా?
కూకట్‌పల్లిలో ధర్నాలు, రాజకీయ ప్రదర్శనలు - వైఎస్ఆర్‌సీపీ నేతలు హద్దులు చెరిపేస్తున్నారా?
Jai Akhanda: 'జై అఖండ'కు కొత్త నిర్మాతలు... 14 రీల్స్ ప్లస్ నుంచి మరొకరికి!
'జై అఖండ'కు కొత్త నిర్మాతలు... 14 రీల్స్ ప్లస్ నుంచి మరొకరికి!
Bride Viral video: రెండు గంటల్లో పెళ్లీ -ఎక్స్‌తో పెళ్లికూతురు కిస్సింగ్ - జెన్‌జీ ఇంతేనా? వైరల్ వీడియో
రెండు గంటల్లో పెళ్లీ -ఎక్స్‌తో పెళ్లికూతురు కిస్సింగ్ - జెన్‌జీ ఇంతేనా? వైరల్ వీడియో
Pawan Kalyan Gift To Sujeeth: 'ఓజీ' దర్శకుడికి పవన్ కళ్యాణ్ ఖరీదైన గిఫ్ట్... ఆ కారు రేటు ఎంతో తెలుసా?
'ఓజీ' దర్శకుడికి పవన్ కళ్యాణ్ ఖరీదైన గిఫ్ట్... ఆ కారు రేటు ఎంతో తెలుసా?
Lionel Messi: మరోసారి భారత్‌కు లియోనెల్ మెస్సీ! టీ20 ప్రపంచ కప్‌లో భారత్-అమెరికా మ్యాచ్‌కు వచ్చే అవకాశం!
మరోసారి భారత్‌కు లియోనెల్ మెస్సీ! టీ20 ప్రపంచ కప్‌లో భారత్-అమెరికా మ్యాచ్‌కు వచ్చే అవకాశం!
Embed widget