Nirjala Ekadashi 2025: నిర్జల ఏకాదశి జూన్ 06 or 07 , విశిష్టత ఏంటి , ఈ రోజు ఏం చేయాలి - ఏం చేయకూడదు!
Nirjala Ekadashi 2025 Date: ఏటా జ్యేష్ఠమాసంలో శుక్లపక్షానికి ముందు వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. ఈ రోజుకి ఎంత విశిష్టత ఉంది? ఈ రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదో తెలుసుకోండి.

Nirjala Ekadashi 2025 : 2025 నిర్జల ఏకాదశి కేవలం ఒక ఆధ్యాత్మిక ఆచారం మాత్రమే కాదు, భక్తులు దైవిక శక్తితో తిరిగి ఐక్యం కావడానికి, వారి కర్మలను శుద్ధి చేసుకోవడానికి vవారి జీవితాల్లోకి సామరస్యాన్ని మరియు సమృద్ధిని ఆహ్వానించడానికి ఒక ప్రత్యేక అవకాశం.
నిర్జల ఏకాదశికి హిందూ మతంలో అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. 24 ఏకాదశులలో ఇది అత్యంత శక్తివంతమైనది, సవాలుతో కూడుకున్నదిగా పరిగణిస్తారు. ఈ రోజున ఆచరించే ఉపవాసం అన్ని ఏకాదశి ఉపవాసాల్లో అత్యంత ఫలవంతమైనద, కష్టతరమైనదిగా చెబుతారు. 2025లో అరుదైన మరియు శుభకరమైన యోగాలు ఏర్పడటం వలన నిర్జల ఏకాదశి మరింత ప్రత్యేకమైనది.
విశ్వాసం, క్రమశిక్షణ, సరైన భక్తి విశ్వాసాలతో పాటిస్తే ఈ ఏకాదశి పాపాలను నాశనం చేస్తుందని భక్తుల విశ్వాసం
నిర్జల ఏకాదశి ఎప్పుడు?
నిర్జల ఏకాదశి తిథి ప్రారంభం జూన్ 06 శుక్రవారం సూర్యోదయానికే ఉంది..తెల్లవారుజామున 4 గంటల 50 నిముషాల వరకూ తెల్లవారితే శనివారం. సూర్యోదయం, సాయంత్రానికి ఏకాదశి తిథి ఉన్నది శుక్రవారమే..అందుకే నిర్జల ఏకాదశి జూన్ 06నే పాటించాలి. జూన్ 07 శనివారం రోజంతా ద్వాదశి ఘడియలున్నాయి. ఈ రోజు భగవంతుడిని పూజించి నివేందించి ఉపవాసం విరమించాలి.
నిర్జల ఏకాదశి రోజు అరుదైన శుభయోగాలు
ఈ ఏడాది నిర్జల ఏకాదశి ఉపవాసం ఆధ్యాత్మిక శక్తిని పెంచే అరుదైన ఖగోళ సంఘటనలతో సమానంగా ఉంటుంది.
వ్యతిపత యోగం: అత్యంత పవిత్రమైనదిగా పరిగణించే ఈ యోగం ఆధ్యాత్మిక యోగ్యతను పెంచుతుంది.
కన్యారాశిలో చంద్ర సంచారం: చంద్రుడు కన్యారాశిలో ఉంటాడు, మానసిక స్పష్టత, శాంతి , విశ్లేషణాత్మక సామర్థ్యాలను పెంచుతాడు.
హస్త నక్షత్రం (ఉదయం 7:40 వరకు): ఈ నక్షత్రంలో పూజలు చేయడం వల్ల ప్రత్యేక పుణ్యం లభిస్తుంది.
చిత్త నక్షత్రం (ఉదయం 7:41 కి మొదలు): ఈ నక్షత్రంలో విష్ణువును పూజించడం వల్ల అందం , శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు.
నిర్జల ఏకాదశి రోజు ఏం చేయాలి
బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి గంగా జలం లేదా స్వచ్ఛమైన నీటితో పవిత్ర స్నానం చేసి, శుభ్రమైన పసుపు రంగు దుస్తులు ధరించండి.
"ఓం నమో భగవతే వాసుదేవాయ" అని జపిస్తూ నీరు కూడా తీసుకోకుండా కఠినమైన ఉపవాసం ఉండటానికి సంకల్పించండి.
విష్ణువు పూజను ఆచరించండి.
పంచామృతం (ఐదు పవిత్ర వస్తువుల మిశ్రమం) స్నానం సమర్పించండి.
పూజలో పసుపు పువ్వులు, తులసి ఆకులు, గంధం ఉపయోగించండి
విష్ణు సహస్రనామం (విష్ణువు 1000 పేర్లు) పఠించండి.
(ఆరోగ్యం అనుమతిస్తే) ఆహారం, నీరు లేదా పండ్లు తీసుకోకుండా పూర్తి ఉపవాసం ఉండండి.
రాత్రిపూట మేల్కొని ఉండండి, భజనలు, కీర్తనలు, ధ్యానంలో పాల్గొనండి.
మరుసటి రోజు నిర్ణీత సమయంలో నీరు, పండ్లు లేదా సాధారణ శాఖాహార ఆహారంతో ఉపవాసం విరమించండి.
నిర్జల ఏకాదశి నాడు చేయకూడని తప్పులు ఇవే
నీటిని వృధా చేయవద్దు
ఈ ఉపవాసం యొక్క సారాంశం నీటి వృధాని అరికట్టడం,నీరు ఎంత విలువైనదో చెప్పడం. అందుకే నీటిని గౌరవించాలి . దుర్వినియోగం చేయకూడదు.
ఆహారం లేదా పండ్లు తినవద్దు
పండ్లు కూడా తినకూడదు; ఇది కఠినమైన నీరు లేని ఉపవాసం.
కోపం, అబద్ధాలు , ప్రతికూలత నివారించండి
శారీరక క్రమశిక్షణ ఎంత ముఖ్యమో మానసిక స్వచ్ఛత కూడా అంతే ముఖ్యం అని గుర్తించండి
ఉపవాస విరమణ చాలా ముఖ్యం
ఏకాదశి ఉపవాసం చేసేవారు ద్వాదశి ఘడియలు ముగియకముందే ఉపవాసం విరమించడం చాలా ప్రధానం.
నిర్జల ఏకాదశి వ్రతం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలు
ఒకే ఉపవాసంలో 24 ఏకాదశుల పుణ్యాన్ని పొందండి
పాపాల నుంచి విముక్తి చెంది పునర్జన్మ చక్రంనుంచి తప్పించుకుంటారు
మానసిక , శారీరక శుద్ధి జరుగుతుంది
శ్రీ మహావిష్ణువు ప్రత్యేక ఆశీస్సులు మీపై ఉంటాయి
కుటుంబంలో శాంతి శ్రేయస్సు ఉంటుంది
గమనిక: ఆధ్యాత్మికవేత్తలు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన వివరాల ఆధారంగా రాసిన కథనం ఇది. ఇది కేవలం ప్రాధమిక సమాచారం మాత్రమే. దీనిని పరిగణలోకి తీసుకునే ముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు.






















