జూన్ 2025 లో ఎన్ని పండుగలున్నాయో తెలుసా..అన్ని ముఖ్యమైన తిథులు, పర్వదినాలు
June Month Festivals 2025: జూన్ 2025 లో పండుగలు, ముఖ్యమైన రోజులు ఎప్పుడెప్పుడు ఏం వచ్చాయి...తేదీ, తిథి, వాటి విశిష్టత ఏంటి ఇక్కడ పూర్తి వివరాలు

June 2025 Important Days And Dates: జూన్ 2025 పండుగల జాబితా..
జూన్ 02 సోమవారం తెలంగాణ అవతరణ దినోత్సవం
జూన్ 05 గురువారం గంగా దశమి, దశపాపహర దశమి, ప్రపంచ పర్యావరణ దినోత్సవం
జూన్ 06 శుక్రవారం నిర్జల ఏకాదశి
జూన్ 07 శనివారం రామలక్ష్మణ ద్వాదశి - బక్రీద్
జూన్ 08 ఆదివారం మృగశిర కార్తె ప్రారంభం
జూన్ 11 బుధవారం జ్యేష్ఠమాస పౌర్ణమి, ఏరువాక పూర్ణిమ
జూన్ 14 శనివారం- సంకష్టహర చతుర్థి
జూన్ 15 ఆదివారం మిథున సంక్రాంతి
జూన్ 21 శనివారం ప్రపంచ యోగా దినోత్సవం,యోగిని ఏకాదశి
జూన్ 22 ఆదివారం కూర్మ దయంతి, ఆరుద్ర కార్తె
జూన్ 23 సోమవారం మాస శివరాత్రి
జూన్ 25 బుధవారం వటసావిత్రి వ్రతం
జూన్ 26 గురువారం ఆషాఢ మాసం ప్రారంభం - ఆషాఢ గుప్త నవరాత్రులు మొదలు
జూన్ 27 శుక్రవారం జగన్నాథ రథాయాత్ర
జూన్ 29 ఆదివారం బోనాలు / మొదటి ఆదివారం
గంగా దశమి, దశపాపహర దశమి
ఏటా జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి రోజుని దశపాపహర దశమిగా జరుపుకుంటారు. ఈ రోజునే గంగాదశమి అని గంగమ్మను పూజిస్తారు. ఇదే రోజు రామేశ్వర ప్రతిష్ట కూడా.
నిర్జల ఏకాదశి
నిర్జల ఏకాదశి...ఈ పేరులోనే ఉంది..నిర్జల అంటే చుక్క నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉంటారు. ఈ ఏడాది నిర్జల ఏకాదశి జూన్ 06 న వచ్చంది. అన్న ఏకాదశిలకు పాటించిన నిమమాలే పాటించాలి, ఉపవాసం ఉండాలి, నేలపై నిద్రించాలి, ద్వాదశి రోజు దాన ధర్మాలు చేసి ఉపవాసం విరమించాలి. అష్టాక్షరి మంత్రం జపించాలి.
వట సావిత్రి వ్రతం
వట సావిత్రి వ్రతం అత్యంత విశిష్టమైంది. జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి రోజు ఆచరిస్తారు...మరికొందరు జ్యేష్ఠమాసంలో వచ్చే అమావాస్య అంటే ఆషాఢమాసం ప్రారంభానికి ముందు రోజు ఆచరిస్తారు. వివాహిత స్త్రీలు రోజంతా ఉపవాసం ఆచరించి రావిచెట్టుని పూజిస్తారు. రావిచెట్టు వద్ద దీపం వెలిగింది ప్రదక్షిణలు చేస్తే దీర్ఘసుమంగళిగా ఉంటారని విశ్వాసం. లక్ష్మీ నారాయణులు, శివపార్వతులుగా భావించి ఐదు పోగుల దారానికి పసుపు రాసి చెట్టు చుట్టూ కడతారు.
మాస శివరాత్రి
జూన్ నెలలో మాస శివరాత్రి సోమవారం వచ్చింది. ప్రతి నెలలో అమావాస్య ముందు వచ్చే చతుర్థశిని మాస శివరాత్రిగా జరుపుకుంటారు. ఈ ఏడాది జూన్ 23న మాస శివరాత్రి వచ్చింది.
జగన్నాథ రథాయాత్ర 2025
జూన్ 27 శుక్రవారం నుంచి పూరీ జగన్నాథుడి రథాయాత్ర ప్రారంభమవుతుంది. జగాన్ని ఏలే జగన్నాథుడి రథాయాత్ర అంటే భక్తులందరకీ ఇంతకు మించిన పండుగ ఇంకేముంటుంది. ఏటా జగన్నాథుడి రథాయాత్ర ఆషాఢ మాసం ప్రారంభమైన రెండో రోజు విదియ రోజు మొదలవుతుంది.
బోనాలు 2025
ఏటా ఆషాఢమాసంలో వచ్చే తొలి గురువారం లేదా తొలి ఆదివారం బోనాలు ప్రారంభమవుతాయి. 2025లో జూన్ 26 గురువారం నుంచి జూలై 24 గురువారం వరకూ తెలంగాణలో బోనాలు జరగనున్నాయి. తొలిబోనం గోల్గొండ జగదాంబికకు సమర్పిస్తారు.
తిరుమల హుండీలో సొమ్ము 3 భాగాలు - మీరు ఏ భాగంలో వేస్తున్నారు , ఎలాంటి ముడుపులు చెల్లిస్తున్నారు- పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
తిరుమల అలిపిరి మెట్లదారిలో ఈ అద్భుతాలను గమనించారా..మీరెన్ని చూశారు
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి






















