Dharma Sandehalu: పూజ మధ్యలో తుమ్ము, ఆవులింత వస్తే ఆ పూజ ఫలించదా - పరిష్కారం ఏంటి!
Spirituality: పూజ చేస్తుండగా మధ్యలో నిద్రఊపేసే సందర్భాలుంటాయి ఈ సమయంలో ఆవులింతలు వస్తూనే ఉంటాయి. అనుకోకుండా ఒక్కోసారి తుమ్ములు వస్తాయి. అలాంటప్పుడు పూజా ఫలం దక్కదా?

Dharma Sandehalu: భక్తి శ్రద్ధలతో పూజ అంచరించేటప్పుడు తుమ్ము, దగ్గు, అపాన వాయువు, ఆవులింతలు వస్తుంటాయి ఒక్కోసారి. అలాంటప్పుడు పవిత్ర వాతావరణం అపవిత్రం అయినట్టేనా? చేస్తున్న పూజకు తగిన ఫలితం దక్కనట్టేనా?
దీనికి పరిష్కారంగా వెంటనే కుడి చెవిని తాకండి అని చెబుతారు ఆధ్యాత్మిక వేత్తలు
తుమ్ములు, ఆవులింతలు వస్తే కుడిచెవిని ఎందుకు తాకాలి? అప్పుడు దోషం తొలగిపోతుందా?
ఈ సందేహాలకు సమాధానం కావాలంటే ముందుగా మీకు భగీరధుడి కథ తెలియాలి...
ఓ మహర్షి శాపంతో బూడిద కుప్పలుగా మారిపోయిన తన పూర్వీకుకోసం భగీరదుడు గంగను ప్రార్థిస్తాడు. గంగానది నది భూలోకానికి వచ్చి అక్కడి నుంచి తన పూర్వీకుల బూడిద కుప్పలపై ప్రవహిస్తే వారికి ముక్తి, మోక్షం లభిస్తుందని ఘోర తపస్సు చేస్తాడు భగీరదుడు. అలా ఆకాశం నుంచి శంబుని శిరస్సుపైకి చేరిన గంగమ్మ అక్కడి నుంచి భారీ ప్రవాహంతో భూలోకానికి తరలివస్తుంటుంది. భగీరదుడు ముందు నడుస్తుంటే గంగమ్మ వెనుకే అనుసరించి వస్తుంది. అలా వెళుతున్న సమయంలోనే పాయలుగా విడిపోయి నాలుగు దిక్కులవైపూ ప్రవహించింది గంగ. ఓ పాయ భగీరదుడి వెనుక వస్తుంటుంది. ఆ మార్గంలో జహ్ను మహర్షి ఆశ్రమం వచ్చింది. అత్యంత శక్తిమంతుడైన ఆ మహర్షి గంగానది వేగానికి తన ఆశ్రమం కొట్టుకుపోతుందని భావించి నదిని ఉద్ధరిణితో తీసుకుని స్వాహా అని తాగేశాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత గమనించిన భగీరధుడు తన వెనుకే గంగమ్మ రావడం లేదని గుర్తించి వెను తిరిగి వెళ్లాడు. జహు మహర్షి తాగేశాడని గుర్తించి ఆయనను ప్రార్థించాడు.
అయ్యా..సహజంగా ఉండే ప్రవాహవేగం వల్ల మీ ఆశ్రమాన్ని ముంచెత్తబోయింది కానీ మీ జోలికి వచ్చేది కాదని వేడుకున్నాడు. దయచేసి గంగను విడిచిపెట్టని లేదంటే తన పూర్వీకులు బూడిదకుప్పలుగా మోక్షం కోసం ఎదురుచూస్తూ మిగిలిపోతారని తన వృత్తాంతం చెప్పాడు భగీరధుడు. అప్పుడు సానుకూలంగా స్పందించిన మహర్షి.. గంగానదిని తాగేశాను...వదిలి పెట్టాలంటే మూత్ర విసర్జన రూపంలో వదలాలి. కానీ అలా చేస్తే గంగ అపవిత్రం అయిపోతుంది. అందుకే నా కుడిచెవి నుంచి విడిచిపెడతాను అని చెప్పాడు. అలా జుహు మహర్షి చెవి నుంచి ఉద్భవించిన గంగకు జాహ్నవి అనే పేరొచ్చింది. కుడి చెవి నుంచి వచ్చిన గంగను తీసుకెళ్లి తన పూర్వీకులకు మోక్షం కలిగించాడు భగీరధుడు.
కుడి చెవిలోంచి గంగ ఉద్భవించింది కాబట్టి..పూజలో ఉన్న సమయంలో తుమ్ము, దగ్గు, ఆవులింత వచ్చినా, అశుభం మాటలు విన్నా కుడి చెవిపై చేయిని ఉంచి గంగ గంగ గంగ అని తలుచుకోమని చెబుతారు. ఇలా చేస్తే శుద్ధి జరుగుతుందని చెబుతారు ఆధ్యాత్మికవేత్తలు
గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన విషయాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా రాసిన కథనం ఇది. ఇదే కేవలం ప్రాధమిక సమాచారం మాత్రమే. దీన్ని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.వీటిని అనుసరించే ముందు మీరు విశ్వశించే పండితుల నుంచి సలహాలు స్వీకరించండి.
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
పాకిస్థాన్ ఆలయంలో మన ఘంటసాల పాట.. ఓ వ్యక్తి భక్తితో ఆలపిస్తున్న అద్భుత దృశ్యం... వీడియో చూసేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి!






















