అన్వేషించండి

గురువారం కృష్ణాష్టకం: చదువు, ఉద్యోగంలో వెలగాలంటే ఈ ఒక్కటీ పాటించండి!

Krishna Ashtakam: మీ పిల్లలకు చదువుపై శ్రద్ధ తగ్గుతోందా, మీకు ఉద్యోగంలో అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయా? అయితే ప్రతి గురువారం ఈ అష్టకం పఠిస్తే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు ఆధ్యాత్మికవేత్తలు

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • జాతక దోషాలు తొలగించి, గురువు అనుగ్రహం జీవిత విజయానికి మార్గం.
  • గురువారం కృష్ణాష్టకం పఠించి, తులసి సమర్పిస్తే గురువు అనుగ్రహం.
  • జాతకంలో బలమైన గురువు విద్య, ఉద్యోగం, ధనలాభం కల్పిస్తుంది.
  • గురువు అనుగ్రహం లోపించినచో విద్య, ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి.

గురువారం కృష్ణాష్టకం: జాతకంలో ఉండే ఎలాంటి దోషం అయినా గురువు అనుగ్రహం ఉంటే తొలగిపోతుందని చెబుతారు ఆధ్యాత్మివేత్తలు. అందుకే జగద్గురువు అయిన కృష్ణుడిని స్మరించాలని సూచిస్తారు. గురువారం బృహస్పతికి అంకితం చేసిన రోజు.. ఈరోజు కృష్ణాష్టకం పఠించి...ఆయనకు ప్రీతిపాత్రమైన తులసి ఆకులను సమర్పిస్తే గురుగ్రహం అనుగ్రహం లభిస్తుందంటారు. జాతకంలో ఎన్ని బలహీనమైన గ్రహాలున్నా..గురువు బలంగా ఉంటే చదువు, ఉద్యోగంలో తిరుగుండదని చెబుతారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. 

29-07-2026 గురు పౌర్ణమి బుధవారం మీ రాశిఫలాలు!

కృష్ణాష్టకం

దేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్ |
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ‖
 
అతసీ పుష్ప సంకాశం హార నూపుర శోభితమ్ |
రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుమ్ ‖

కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననమ్ |
విలసత్ కుండలధరం కృష్ణం వందే జగద్గురమ్ ‖

మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజమ్ |
బర్హి పింఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్ ‖

ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీల జీమూత సన్నిభమ్ |
యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్ ‖

రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితమ్ |
అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుమ్ ‖

గోపికానాం కుచద్వంద కుంకుమాంకిత వక్షసమ్ |
శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్ ‖

శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితమ్ |
శంఖచక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్ ‖

కృష్ణాష్టక మిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ‖

Guru Purnima Wishes 2026: మహామహుల సందేశాలు, శ్లోకాలతో గురు పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పేయండి!

జాతకంలో గురుగ్రహం శుభ స్థానంలో ఉంటే... (5,7,9 స్థానాల్లో ఉంటే)

ఉన్నత విద్య, తెలివితేటలు, ఉద్యోగంలో వృద్ధి, ఆధ్యాత్మిక పురోగతి ఉంటుంది

ఆర్థిక స్థిరత్వం, సంపద వృద్ధి, ధనలాభం

సుఖవంతమైన జీవితం బాధ్యతగల సంతానం కలుగుతారు

సమాజంలో గౌరవం, నాయకత్వ లక్షణాలు ఉంటాయి

ఆరోగ్యం, మానసిక స్థిరత్వం లభిస్తుంది 

గురు పౌర్ణమి పూజా విధానం! ఈరోజు ఈ 7పనులు చేస్తే సంపద, విజయం, అదృష్టం మీ సొంతం!

గురుగ్రహం అనుగ్రహం లేకుంటే..

విద్య, కెరీర్ లో అడ్డంకులు...ఉన్నత విద్యలో ఆలస్యం, ఉద్యోగంలో ప్రమోషన్లు లేకపోవడం

ఆదాయం ఉన్నా చేతిలో డబ్బులు నిలవకపోవడం, సేవింగ్స్ లేకపోవడం, ఆర్థిక నష్టాలు

వివాహం ఆలల్యం, కుటుంబంలో సమస్యలు

అనారోగ్యం, జీర్ణ సంబంధిత సమస్యలు, జుట్టు రాలడం

నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం లేకపోవడం, సమాజంలో గౌరవం తగ్గడం 

ఈ సూచనలు మీ జీవితంలో కనిపించాయంటే మీ జాతకంలో గురుగ్రహం శుభస్థానంలో లేనట్టే...అప్పుడు ఈ పరిహారం పాటిస్తే బృహస్పతి అనుగ్రహం మీపై ఉంటుందని సూచిస్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు

ఏం చేసినా కలసిరావడం లేదా? గురు పౌర్ణమి రోజు సులభమైన ఈ పరిహారం చేయండి!

చాతుర్మాస్యం ప్రారంభం.. నాలుగు నెలలు దీక్ష ఎవరైనా చేయొచ్చా , నియమాలేంటి, దీని వెనుకున్న ఆరోగ్యం రహస్యం తెలుసా?

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు

Frequently Asked Questions

గురు అనుగ్రహం పొందడానికి ఏమి చేయాలి?

గురువారం నాడు కృష్ణాష్టకం పఠించి, తులసి ఆకులను సమర్పించడం ద్వారా గురుగ్రహం అనుగ్రహం లభిస్తుంది. జగద్గురువైన కృష్ణుడిని స్మరించాలి.

జాతకంలో గురు బలం ఉంటే కలిగే లాభాలు ఏమిటి?

ఉన్నత విద్య, ఉద్యోగంలో వృద్ధి, ఆర్థిక స్థిరత్వం, మంచి సంతానం, సమాజంలో గౌరవం లభిస్తాయి. ఆరోగ్యం, మానసిక స్థిరత్వం కూడా ఉంటాయి.

గురుగ్రహం అనుగ్రహం లేకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి?

విద్య, కెరీర్ లో అడ్డంకులు, ఆర్థిక నష్టాలు, వివాహం ఆలస్యం, కుటుంబ సమస్యలు వస్తాయి. అనారోగ్యం, నిర్ణయాలు తీసుకోలేకపోవడం వంటివి కూడా ఉంటాయి.

కృష్ణాష్టకం పఠించడం వల్ల కలిగే పుణ్యం ఏమిటి?

ప్రాతరుత్థాయ కృష్ణాష్టకమిదం పఠించిన వారికి కోటిజన్మల పాపాలు స్మరణ మాత్రాన నశిస్తాయి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటకం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటకం!
India Post Rakhi Offer 2026: రాఖీ పంపాలా? తపాలా శాఖ కొత్త ఆఫర్లు: వాటర్‌ప్రూఫ్ కవర్లు, స్పీడ్ పోస్ట్ తగ్గింపు!
రాఖీ పంపాలా? తపాలా శాఖ కొత్త ఆఫర్లు: వాటర్‌ప్రూఫ్ కవర్లు, స్పీడ్ పోస్ట్ తగ్గింపు!
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget