అన్వేషించండి

Thursday Dos And Donts: గురువారం ఈ పండు తింటే శ్రీహరి ఆగ్రహానికి గురవుతారు జాగ్రత్త!

Thursday Dos And Donts: గురువారం కొన్ని పనులు చేయకూడదని శాస్త్రం చెబుతోంది. గురువారం ఈ 5 పనులు చేస్తే గురు దోషానికి గుర‌వ‌డ‌మే కాకుండా, సుఖం-ఐశ్వర్యం లోపిస్తుంది. గురువారం మనం ఏ ప‌నులు చేయ‌కూడ‌దు?

Thursday Dos And Donts: 2023 అధిక శ్రావణ‌ మాసం నెలలో చివరి గురువారం పూజ ఆగస్టు 10వ తేదీన జరుగుతుంది. శ్రీమహావిష్ణువు, బృహస్పతికి ప్రీతిక‌ర‌మైన‌ గురువారం నాడు శ్రీహరిని పూజించి, ఉపవాసం ఉండటం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. జాతకంలో బృహస్పతి బలంగా మార‌తాడు. గురువారం వ్రతం ఆచరించడం వల్ల జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. అయితే కొన్ని పనులు గురువారం చేయకూడదని చెబుతున్నారు. గురువారం రోజు ఈ పనులు చేయడం వల్ల గురు దోషాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. గురువారం రోజు మనం చేయకూడని పనులు ఏంటో తెలుసా?

ఈ పండు తినకండి
మీరు గురువారం ఉపవాసం లేదా పూజ చేస్తుంటే, అరటిపండ్లు తినకూడదని గుర్తుంచుకోండి. ఎందుకంటే విష్ణువు అరటిపండును ఇష్టపడతాడు. దీనితో పాటు గురువారం అరటి చెట్టును పూజించే సంప్రదాయం ఉంది. ఈ కారణంగా మీరు గురువారం అరటిపండ్లను తినకూడదు. అందుకు బదులుగా, ఈ రోజు మీరు పేదలకు అరటిపండ్లను దానం చేయవచ్చు.

Also Read : గురువారం ఉపవాసం ఉంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా? ఆ దోషం కూడా తొలగిపోతుందట!

తల స్నానం చేయవద్దు
గురువారం, విష్ణువుకు ప్రీతిక‌ర‌మైన‌ రోజు. ఈ మీరు సబ్బు లేదా షాంపూతో త‌ల స్నానం చేయ‌వ‌ద్దు. ఈ రోజు జుట్టు మాత్రమే కాకుండా శరీరాన్ని కూడా సబ్బు లేదా షాంపూతో తోమ‌కూడదు. ముఖ్యంగా మహిళలు ఈ రోజు త‌ల‌స్నానం చేయ‌కూడ‌దు. గురువారం రోజు తలస్నానం చేయడం వల్ల సుఖసంతోషాలు, ఐశ్వర్యం లోపిస్తాయని పెద్ద‌లు చెబుతారు.

జుట్టు కత్తిరించుకోవద్దు
బృహస్పతి బలం పొందాలంటే మీరు గురువారం జుట్టు కత్తిరించకూడదు. ఈ రోజు పురుషులు లేదా మహిళలు తమ జుట్టు, గోళ్లను కత్తిరించకూడదు. పురుషులు ఈ రోజున గ‌డ్డం కూడా గీయ‌కూడదు. మీరు గురువారం ఈ తప్పులు చేస్తే మీరు గురు దోషాన్ని, జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవచ్చు.

ఇంటిని క‌డ‌గ‌వ‌ద్దు
గురువారం నాడు ఇంటిని నీటితో క‌డిగి శుభ్రం చేయకూడదు. ఈ రోజు మీరు ఇంటిని శుభ్రం చేయాల‌నుకుంటే, చెత్త మొత్తం తొలగించి ఇంటిని శుభ్రం చేయండి. రోజున మీరు ఇంటి నుంచి పాత ఇనుప వ‌స్తువుల‌ను తొలగించకూడదు. ఈ రోజున మీరు మీ ఇంట్లోని పాత‌ వస్తువులను కూడా అమ్మకూడదు. ఈ తప్పులు చేయడం వల్ల మీ ఇంటిలోని సుఖ సంతోషాలు పోయి అరిష్టాలు కలుగుతాయి.

Also Read : గురువారం పసుపు ఇలా వాడితే జీవితంలో మీకు లోటు ఉండదు..!

అప్పు తీసుకోవద్దు
గురువారం నాడు మీరు ఎవరికీ రుణం ఇవ్వకూడదు, ఎవ‌రి ద‌గ్గ‌రా రుణం తీసుకోకూడదు. అంతే కాదు ఈ రోజు డబ్బుకు సంబంధించిన ఎలాంటి వ్యాపారాలు చేయకూడదు. ఈ రోజు రుణం తీసుకోవడం వల్ల వడ్డీ ఎక్కువ‌కాలం క‌ట్ట‌వ‌ల‌సి రావ‌చ్చు. అప్పుగా ఇచ్చిన డబ్బు మీకు తిరిగి రాకపోవచ్చు.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

09-10-2026 శుక్రవారం రాశిఫలాలు: మకర, కుంభ, మీన రాశుల వారికి ఈ రోజు కలిసొస్తుందా?
09-10-2026 శుక్రవారం రాశిఫలాలు: మకర, కుంభ, మీన రాశుల వారికి ఈ రోజు కలిసొస్తుందా?
09-10-2026 శుక్రవారం రాశిఫలాలు: తులా, వృశ్చిక, ధనుస్సు రాశుల వారికి శుభమా? అశుభమా?
09-10-2026 శుక్రవారం రాశిఫలాలు: తులా, వృశ్చిక, ధనుస్సు రాశుల వారికి శుభమా? అశుభమా?
09-10-2026 శుక్రవారం రాశిఫలాలు: కర్కాటకం, సింహం, కన్య రాశుల వారికి ముఖ్యమైన సూచనలు!
09-10-2026 శుక్రవారం రాశిఫలాలు: కర్కాటకం, సింహం, కన్య రాశుల వారికి ముఖ్యమైన సూచనలు!
09-10-2026 శుక్రవారం మేషం, వృషభం, మిథున రాశులకు ఎలాంటి ఫలితాలున్నాయంటే!
09-10-2026 శుక్రవారం మేషం, వృషభం, మిథున రాశులకు ఎలాంటి ఫలితాలున్నాయంటే!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget