అన్వేషించండి

Thursday Fasting Rules: గురువారం ఉపవాసం ఉంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా? ఆ దోషం కూడా తొలగిపోతుందట!

Thursday Fasting Rules: గురువారం నాడు శ్రీ‌మ‌హావిష్ణువును, గురుడిని స్మరించుకోవడం ఆనవాయితీ. అయితే గురువారం నాడు ఉపవాసం చేయడం వల్ల ఎంత‌ లాభమో తెలుసా?

Thursday Fasting Rules:  స‌నాత‌న ధ‌ర్మంలో బృహస్పతికి ప్ర‌త్యేక స్థానం ఉంది. జ్యోతిషశాస్త్రంలో బృహస్పతిని గురు గ్రహం అని పిలుస్తారు. హిందూ ధ‌ర్మం, జ్యోతిషశాస్త్రంలో.. బృహస్పతిని జ్ఞానం, శక్తి, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. మరోవైపు, హిందూ ధ‌ర్మంలో గురువారం శ్రీహరికి ప్రియ‌మైన‌ రోజుగా పరిగణిస్తారు. ఈ రోజు ఉపవాసం ఉంచి పూజలు చేయడం వలన గురువు, నారాయణుని అనుగ్రహం లభిస్తుంది. గురు గ్ర‌హం, నారాయణుని ప్రసన్నం చేసుకోవడానికి గురువారం ఏమి చేయాలి? గురువారం పూజ ఆచారాలు - పద్ధతులు చూడండి..

1. గురువారం ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలు

జ్ఞాన స‌ముపార్జ‌న‌
మనం గురువారాల్లో ఉపవాసం ఉండడం వల్ల విద్యా, జ్ఞాన అధిష్ఠాన‌ దేవతలు గురువు అనుగ్రహంతో సంతోషిస్తారు. ఫ‌లితంగా ఉపవాసం పాటించే వ్యక్తి వారి అనుగ్రహాన్ని పొందుతాడు.

Also Read : గురువారం ఇలా చేస్తే గురు దోషం పోయి పురోగతి కనిపిస్తుంది

సత్కార్యాల సాధన
గురువారం చేసే ఉపవాసం ఆ వ్యక్తి చేపట్టే అన్ని శుభ కార్యాలలో విజయం సాధించేలా చేస్తుంది. గురువు అనుగ్రహం వల్ల అత‌ని జీవితంలో శ్రేయస్సు, విజయం లభిస్తుంది.

ఆర్ధిక స్థిరత్వం
గురువారం ఉపవాసం ఉండడం వల్ల ఆర్థిక స్థిరత్వంతో పాటు ఆ వ్య‌క్తి జీవితం అభివృద్ధి చెందుతుంది. బృహస్పతి అనుగ్రహం వల్ల ధనలాభ అవకాశాలు పెరుగుతాయి.

ఆధ్యాత్మిక పురోగతి
గురువారం ఉపవాసం వ్యక్తి ఆధ్యాత్మిక పురోగతికి సహాయపడుతుంది. ఈ ఉపవాసం ద్వారా, ఒక వ్యక్తి తన అంతర్గత జీవితాన్ని మెరుగుపరుచుకోవ‌డం ద్వారా ఆధ్యాత్మిక వృద్ధిని పొందుతాడు.

2. గురువారం ఉపవాసం ఎలా ఉండాలి
- గురువారం ఉపవాసం ఉండాలంటే తెల్లవారుజామున లేచి స్నానం చేసి గురు మంత్రాలను పఠించాలి.
- తర్వాత రావి చెట్టు కింద పూజ చేసి బృహస్పతిని పూజించాలి.
- ఉపవాస సమయంలో సాత్విక ఆహారం మాత్ర‌మే తీసుకోవాలి, రోజంతా ధ్యానం చేస్తూ గ‌డ‌పాలి.
- గురువారం ఉపవాసం శ్రద్ధ, భక్తితో పూర్తి చేయాలి.

3. గురువారం రోజు ఏ పనులు చేస్తే మంచిది
- ఈ రోజు గురు మంత్రాలను పఠించడం అత్యంత ప్రయోజనకరం 
- ప‌ఠించ‌వ‌ల‌సిన అత్యంత ముఖ్య‌మైన మంత్రం “ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ బృహ‌స్ప‌త‌యే నమః”
- గురువారం ఉపవాసం చేయాలి
- రావి చెట్టును భక్తితో పూజించండి
- ఈ రోజు బెల్లం, శెనగపిండి, పసుపు, పెరుగు, బెల్లంతో చేసిన ఆహారాన్ని తింటే, జాత‌కంలో గురు బలం పెరుగుతుంది.

Also Read : గురువారం అర‌టి చెట్టును పూజిస్తే ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా?

మీరు గురువారం నాడు శ్రీమహావిష్ణువు విశేష అనుగ్రహం పొందాలంటే, ఈ రోజు ఉపవాసం ఉండటంతో పాటు, పైన పేర్కొన్న నియ‌మాల‌ను కూడా పాటించాలి. గురువారం గురు ఆరాధనకు ప్రత్యేకంగా అంకితం చేయబడిన రోజు కాబ‌ట్టి, వారి గురువును పూజించే వారికి జీవితంలో సరైన మార్గదర్శకత్వం లభిస్తుంది.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

విద్యార్థుల ధర్మయుద్ధం: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక పురాణాల సందేశం!
విద్యార్థుల ధర్మయుద్ధం: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక పురాణాల సందేశం!
మీ చిన్నారులకు విష్ణుమూర్తి పేరు పెట్టండి! అందమైన అర్థవంతమైన పేర్లు ఇక్కడున్నాయి!
మీ చిన్నారులకు విష్ణుమూర్తి పేరు పెట్టండి! అందమైన అర్థవంతమైన పేర్లు ఇక్కడున్నాయి!
పాములు పాలు తాగవు కదా, మరి ఈ సామెత ఎందుకు పుట్టింది? శాస్త్రీయ వాస్తవాలు తెలుసుకోండి!
పాములు పాలు తాగవు కదా, మరి ఈ సామెత ఎందుకు పుట్టింది? శాస్త్రీయ వాస్తవాలు తెలుసుకోండి!
కన్వర్ యాత్రలో నిజమైన ప్రేమ: దివ్యాంగుడైన భర్తను 180 కి.మీ మోసిన భార్య!
కన్వర్ యాత్రలో నిజమైన ప్రేమ: దివ్యాంగుడైన భర్తను 180 కి.మీ మోసిన భార్య!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: YS Jagan సూటి ప్రశ్న
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: వైఎస్ జగన్ ప్రశ్న
Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
IND VS ZIM 2nd T20 Result Update: శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్, య‌శ్, ప్రిన్స్
శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్ శర్మకు 3 వికెట్లు
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
Pawan Kalyan Seed Balls: డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
Dharmendra Pradhan Resignation News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
Azadi 501 Series Trailer : ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ స్కామ్ సిరీస్ - ఇంట్రెస్టింగ్‌గా ఆజాదీ 501 ట్రైలర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ స్కామ్ సిరీస్ - ఇంట్రెస్టింగ్‌గా ఆజాదీ 501 ట్రైలర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Team India Equals Own World Record :  వ‌ర‌ల్డ్ రికార్డును స‌మం చేసిన టీమిండియా.. అత్య‌ధిక సార్లు ఆ ఘ‌న‌తను సాధించిన జ‌ట్టుగా శ్రేయ‌స్ సేన‌.. పొట్టి ఫార్మాట్లో అత్య‌ధికంగా..
వ‌ర‌ల్డ్ రికార్డును స‌మం చేసిన టీమిండియా.. అత్య‌ధిక సార్లు ఆ ఘ‌న‌తను సాధించిన జ‌ట్టుగా శ్రేయ‌స్ సేన‌.. పొట్టి ఫార్మాట్లో అత్య‌ధికంగా..
Embed widget