Thursday Tips: గురువారం ఇలా చేస్తే గురు దోషం పోయి పురోగతి కనిపిస్తుంది
Thursday Tips: విష్ణువును పూజించేందుకు గురువారం అత్యంత ముఖ్యమైన రోజు. ఈ రోజు ఉపవాసంతో పాటు విష్ణుపూజ చేయడం వల్ల ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక విషయాల్లో మంచి ఫలితాలు పొందవచ్చు.
![Thursday Tips: గురువారం ఇలా చేస్తే గురు దోషం పోయి పురోగతి కనిపిస్తుంది if you want to get progress in your life and want to come out from guru dosha then do these works on thursday Thursday Tips: గురువారం ఇలా చేస్తే గురు దోషం పోయి పురోగతి కనిపిస్తుంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/28/2985dabbaa9f1425128143917a2b97d21687963279351691_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Thursday Tips: హిందూ ధర్మంలో వారంలోని అన్ని రోజులలో బృహస్పతి వారం లేదా గురువారం అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. గురువారం ఆనందం, అదృష్టం, శ్రేయస్సుతో ముడిపడి ఉన్న రోజుగా పేర్కొన్నారు. అంతే కాదు, గురువారం విష్ణువుతో పాటు బృహస్పతికి కూడా ప్రీతికరమైన రోజు.
గురువారాల్లో వ్రతాన్ని ఆచరించడం, సంప్రదాయాల ప్రకారం పూజ చేయడం వల్ల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయి. బృహస్పతి నుంచి మంచి ఫలితాలు కూడా లభిస్తాయి. బృహస్పతిని ఆనందం, అదృష్టం, సంపద మొదలైన వాటికి సంబంధించి అధిదేవతగా పరిగణిస్తారు. ఆయన అనుగ్రహం వల్ల మన జీవితంలోని అన్ని రకాల సమస్యలు పరిష్కారమవుతాయి, శుభ ఫలితాలు లభిస్తాయి. ఈ కారణంగానే గురువారానికి సంబంధించి కొన్ని చర్యలను గ్రంథాలు పేర్కొంటున్నాయి. గురువారం రోజు వీటిని చేస్తే ఉద్యోగ సమస్యలు, వ్యాపారంలో నష్టం, ఆర్థిక సమస్యలు మొదలైన అనేక సమస్యలు తొలగిపోతాయని అంటారు. మరి, గురువారం ఏం చేయాలో చూద్దాం..
Also Read : గురువారం పసుపు ఇలా వాడితే జీవితంలో మీకు లోటు ఉండదు..!
1. వ్యాపారంలో లాభం కోసం
మీరు వ్యాపారంలో చాలా కాలంగా నష్టపోతుంటే, లేదా మీరు వ్యాపారానికి సంబంధించిన ఇతర సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, గురువారం నాడు విష్ణాలయాన్ని సందర్శించి, భగవంతునికి పసుపు మాల సమర్పించండి. అంతేకాకుండా ఈ రోజు పసుపు రంగు దుస్తులు ధరించండి. నుదుటిపై పసుపును తిలకంలా ఉంచుకోవాలి. ఈ పరిష్కారం చేయడం ద్వారా మీరు గురువు అనుగ్రహాన్ని పొందుతారు, ఫలితంగా వ్యాపారంలో లాభం పొందుతారు.
2. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం
మీరు మీ ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ రాలేదని బాధపడుతుంటే, గురువారం నాడు పసుపు రంగు దుస్తులు ధరించి పసుపు రంగులో ఉండే పండ్లు, పువ్వులు సమర్పించి విష్ణువును పూజించండి. పసుపు గుడ్డ తీసుకుని అందులో పసుపు పూలు, కొబ్బరి, పసుపు రంగు పండ్లు, పసుపు, ఉప్పు కట్టాలి. అలా కట్టిన మూటను ఆలయ మెట్లపై ఉంచి, ఏమీ మాట్లాడకుండా భగవంతుడికి నమస్కరించి వచ్చేయండి.
3. శ్రేయస్సు కోసం
గురువారం ఉదయాన్నే లేచి తలస్నానం చేయండి. తరువాత శ్రీమహా విష్ణువు, లక్ష్మిదేవిని పూజించండి. పూజలో తప్పనిసరిగా అరటిపండు, మినుము, బెల్లం సమర్పించి విష్ణుసహస్రనామ పారాయణం చేయాలి. ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇది మీ ఇంటిని ధన, ధాన్యాలతో నింపుతుంది.
4. గురు దోష పరిష్కారానికి
జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉన్నట్లయితే లేదా గురు దోషం ఉన్నట్లయితే, గురువారం స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసి "ఓం నమో భగవతే వాసుదేవాయ" అనే మంత్రాన్ని పఠించి స్నానం చేయాలి.
Also Read : దేవాలయాల్లో ఈ దానం చేస్తే పదితరాలకు మంచి జరుగుతుంది!
గురువారం నాడు పైన పేర్కొన్న పనులు చేయడం వల్ల మీరు విష్ణువుతో పాటు లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందుతారు. ఈ పరిహారాలు మీకు గురు, విష్ణువు కటాక్షాలతో పాటు లక్ష్మీ దేవి ఆశీర్వాదాలను కూడా అందజేస్తాయి.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)