Black Thread: నల్లదారం ధరిస్తే ప్రయోజనాలేమిటీ? ఆ సమస్యలన్నీ తొలగిపోతాయా?
Black Thread: చాలా మంది కాళ్లకు, చేతులకు నల్లదారం కట్టుకోవడం చూస్తుంటాం. దీన్ని కట్టుకుంటే కలిగే లాభాలేంటో తెలుసుకుందాం.
Black Thread: చాలా మంది కాళ్లకు, చేతులకు నల్ల దారం కట్టుకోవడం చూసే ఉంటారు. దీన్ని ఒకరిని చూసి మరొకరు కట్టుకుంటున్నారు. దీంతో వీటికి గిరాకీ బాగా పెరిగింది. చాలామంది వీటిలో కొత్త కొత్త ఫ్యాషన్స్ ను క్రియేట్ చేసి మార్కెట్లోకి వదులుతున్నారు. అయితే జ్యోతిష్యంతో సంబంధం లేకుండా మీరు కూడా చేతిమణికట్టుకు నల్లటి దారాన్ని కట్టుకోవచ్చు. ఎందుకంటే.. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట. అవేంటో చూసేయండి.
1. అదృష్టం, శ్రేయస్సు:
జ్యోతిష్యశాస్త్రంలో నల్లదారం అదృష్టం, సంపదకు చిహ్నంగా భావిస్తారు. మీరు మీ మణికట్టుకు నల్లదారం ధరించడం మీకు అదృష్టంతోపాటు శ్రేయస్సును తీసుకువస్తుంది. ఇది మీ జీవితంలోకి పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తుంది. ఏవైనా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నా..లేదంటే ఎలాంటి అడ్డంకులు ఎదురైనా నల్లదారం కట్టుకుంటే పరిష్కారం లభిస్తుందని చాలా మంది నమ్ముతుంటారు.
2. ప్రతికూల పరిస్థితుల నుంచి రక్షణగా:
చాలా మంది ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటుంటారు. ఈ తరుణంలో ఒత్తిడికి లోనవుతుంటారు. ప్రతికూల పరిస్థితుల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఆలోచన అనేది చాలా ముఖ్యం. తొందరపడకుండా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అదే విధంగా చెడు శక్తులను దూరం చేసేందుకు మణికట్టుకు నల్లదారం కట్టుకుంటే మేలు జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
3. ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది:
చాలా మంది ఆధ్యాత్మికవేత్తల అభిప్రాయం ప్రకారం నల్లదారం ధరిస్తే...ఒక వ్యక్తిలో ఆధ్యాత్మిక చింతన మెరుగుతుందని చెబుతున్నారు. అంతర్ దృష్టిని, అవగాహనను పెంచుతుంది. అంతేకాదు.. ప్రజలు ఉన్నత భావాలను కలిగేందుకు వీలు కల్పిస్తుంది. మీరు మణికట్టుకు నల్లదారం కట్టుకున్నట్లయితే ఆధ్మాత్మికత వైపు మనస్సు మళ్లుతుందట.
4. మానసిక స్పష్టత:
ఒకరిపై ఒకరు అసూపడేవారు సమాజంలో చాలా మందే ఉంటారు. ఎక్కువగా సంపాదిస్తున్నా.. మంచి పేరు తెచ్చుకున్నా.. ఇతరుల నుంచి ప్రశంసలు పొందినా వారికి ఏ విషయంలోనైనా పై చేయి సాధిస్తే అసూయ పెరుగుతుంది. ఈ మానవ దిష్టి అనేది శని దోషమంతా ప్రభావవంతమైంది. చేతిపై మణికట్టును కట్టుకుంటే మీ ఫోకస్ అంతా మీరు చేపట్టిన పనులపై కేంద్రీకరిస్తారు. ఇతరుల కన్ను మీపై ఉండదు. మీ పని మీరు మరింత సమర్థవంతంగా చేసేందుకు సహాయపడుతుంది.
5. రాహు-కేతు ప్రభావం:
కాస్మిక్ ఎనర్జీ, గ్రహల కదలికలు మనం చాలా ప్రభావం చూపుతాయి. మానవులు విశ్వంలో ఒక భాగమని జ్యోతిష్యం చెబుతోంది. మీ మణికట్టు చుట్టూ నల్లదారం ధరిస్తే.. గ్రహల ప్రభావం తగ్గుతుంది. చెడు శక్తులు మీ దగ్గరకు రాకుండా ఉంటాయి. అంతేకాదు నల్లదారం విశ్వ శక్తులతో మిమ్మల్ని కలిపేందుకు సహాయపడుతుంది.
6. జీవితంలో విజయం సాధిస్తారు:
అన్ని గ్రహాల్లోకెళ్లా శని గ్రహానికి ప్రముఖ స్థానం ఉంటుంది. శని గ్రహం సంతోషంగా ఉంటే జీవితంలో అన్ని మనకు అనుకూలంగా ఉంటాయి. శని ప్రభావం ప్రతికూలంగా ఉంటే జీవితంలో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవల్సి వస్తుంది. చేతి మణికట్టుకు నల్లదారం కట్టుకుంటే శని దేవుని అనుగ్రహం లభిస్తుంది. దీని వల్ల మీరు తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.
Also Read: ఈ ఏడాది ఉగాది ఎప్పుడు - చైత్ర పాడ్యమి రోజే ఎందుకు జరుపుకుంటారు!
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.