అన్వేషించండి

Significance of Aarti in Hinduism : ఆలయాల్లో హారతి ఎందుకిస్తారు - ఆ సమయంలో ఘంటానాదం ఎందుకు!

Significance of Aarti: దేదీప్యమానంగా వెలుగుతుంది..ఆఖరి వరకూ ఆ వెలుగులో ఎలాంటి మార్పు ఉండదు..అవశేషాలు మాయమయ్యాక చప్పున ఆగిపోతుంది. ఇంతకీ దైవారాధనలో హారతి ఎందుకిస్తారు..

Significance of Aarti in Hinduism : షోడశోపచారాలలో ఒకటైన హారతి లేనిదే ఏ పూజా సంపూర్ణం కాదు. ఎంత ఘనంగా పూజ చేసినా చివర్లో హారతి కళ్లకు అద్దుకున్న తర్వాతే ఆ ఫలం దక్కినట్టు అనిపిస్తుంది. ఇంతకీ ఆ హారతిని ఎందుకిస్తారు..ఎందుకివ్వాలి? హారతివ్వడం వెనుకున్న ఆధ్యాత్మిక - శాస్త్రీయ కారణాలేంటో తెలుసా... 

శరీరంలో నూతన ఉత్తేజం

ఎప్పుడైనా హారతి ఇచ్చేటప్పుడు గమనించారా. అప్రయత్నంగా గంటను తీసి మోగిస్తారు. ఆలయాల్లో భక్తులు కూడా క్యూ లైన్లలో నిల్చునే అందుబాటులో ఉన్న గంటను మోగిస్తారు. కొన్ని ప్రదేశాల్లో శంఖం ఊదుతారు.  గంటలు, శంఖం శబ్దం వల్ల ఎలాంటి ఆలోచనలు లేకుండా పూర్తిగా భగవంతుడిపై మనసు లగ్నం అవుతుంది. ఫలితంగా  శరీరంలో నిద్రిస్తున్న ఆత్మ మేల్కొంటుంది. శరీరంలో నూతన ఉత్తేజం వస్తుంది. 

Also Read: ఈ 6 రాశులవారికి ఆదాయం, ఆనందం, విజయాన్నిచ్చి వెళ్లిపోతోంది 2023

ఆరోగ్యాన్నిచ్చే హారతి

ఒకప్పుడు ఆలయాలలో ఎలాంటి కృత్రిమమైన దీపాలూ ఉండేవి కావు. పైగా గాలి కూడా చొరబడని రాతితో నిర్మాణాలు సాగేవి. అలాంటి ప్రదేశాలలో తేమ అధికంగా ఉండటం సహజం. దీంతో దుర్వాసన, సూక్ష్మక్రిములు చేరేవి. సాధారణంగా కర్పూరానికి సూక్ష్మక్రిములను సంహరించే శక్తి, అంటువ్యాధులను నివారించే గుణం ఉన్నాయని ప్రాచీన వైద్యుల నమ్మకం. ఇప్పుడంటే కర్పూరం తయారీలో రసాయనాలను ఉపయోగిస్తున్నారు  కానీ ఒకప్పుడు  కర్పూరం చెట్ల నుంచే సేకరించేవారు. అలా అర్చనకు, ధూపదీపాలు సహా మొత్తం పూజంతా ప్రకృతి సిద్ధంగానే సాగేది.

భగవంతుడిని తాకినంత భావన

భగవంతుడికి ఇచ్చిన హారతిని కళ్లకు అద్దుకోవడం సహజం. ఈ ప్రక్రియతో కళ్లకి చలువ చేస్తుంది. పైగా భగవంతుని మూలవిరాట్టుని నేరుగా తాకలేము కాబట్టి, ఈ హారతి ద్వారా ఆయనను స్పర్శించుకుంటున్నామన్న తృప్తి కలుగుతుంది. 

Also Read: 2023 డిసెంబరు నెల ఈ రాశులవారికి కొన్ని హెచ్చరికలు చేస్తోంది

ఘంటానాదం ఎందుకు?

హారతితో పాటుగా ఘంటానాదాన్ని చేయడం సహజం. కళ్లు మూసుకుని హారతిని అద్దుకోవడం ద్వారా మనసు, చెవులు, ఆఘ్రానించే శక్తీ, స్పర్శా...ఇన్ని ఇంద్రియాలు భగవంతుని ధ్యానంలో లగ్నమవుతాయి.

​శాస్త్రీయ కారణం

కర్పూరాన్ని వెలిగించడం ద్వారా అద్భుతమైన సుగంధ పరిమళాలతో కూడిన సువాసన వస్తుంది. ఈ సువాసన నలుమూలలా వెదజల్లి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఫలితంగా  ఆ ప్రదేశమంతా సానుకూల శక్తి ప్రసరిస్తుంది. అంతేకాకుండా ప్రతికూల శక్తులు దూరమై అక్కడ ఉన్నవారికి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అందుకే హారతిని ప్రశాంతతకు చిహ్నంగా పరిగణిస్తారు.

Also Read: ఇదే ఏడాదిలో మళ్లీ ముక్కోటి ఏకాదశి - న్యూ ఇయర్ కన్నా ముందే వచ్చింది!

మనిషి జీవితం హారతిలా ఉండాలి
కర్పూరానికి రెండు సుగుణాలు ఉన్నాయి. 
1. ఎలాంటి అవశేషమూ మిగలకుండా దహించుకుపోవడం
2. రెండోది సుగంధాన్ని, ప్రకాశాన్ని వెదజల్లడం
బహుశా మనిషి జీవితం కూడా ఇలాగే సాగాలన్నది దీనివెనుకున్న ఆంతర్యం. భక్తుడు ఎలాంటి కర్మ ఫలం మిగలకుండా, మోక్షం వైపుగా సాగిపోవాలనీ.. జీవించినంతకాలం జ్ఞానమనే ప్రకాశాన్నీ, సద్గుణాలు అనే సుగంధాలనీ వెదజల్లుతూ ఉండాలనీ ఉద్దేశం.

గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: కంచ గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా వేసిన హైకోర్టు, ప్రతివాదులకు నోటీసులు
కంచ గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా వేసిన హైకోర్టు, ప్రతివాదులకు నోటీసులు
Black Monday: బ్లాక్ మండే భయం నిజమైంది - సెన్సెక్స్ 3300 పాయింట్లు, నిఫ్టీ 1000 పాయింట్లు పతనం
బ్లాక్ మండే భయం నిజమైంది - సెన్సెక్స్ 3300 పాయింట్లు, నిఫ్టీ 1000 పాయింట్లు పతనం
Annamayya Crime News: రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతి, సీఎం చంద్రబాబు సంతాపం
రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతి, సీఎం చంద్రబాబు సంతాపం
Waqf Amendment Act:  కొత్త వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో వరుస పిటిషన్లు, విచారణకు వచ్చేది ఎప్పుడంటే..
కొత్త వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో వరుస పిటిషన్లు, విచారణకు వచ్చేది ఎప్పుడంటే..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tilakvarma removed Mumbai Indians Name | ముంబై ఇండియన్స్ పేరును తొలగించిన తిలక్ వర్మ | ABP DesamJasprit Bumrah Re Entry | బుమ్రాను గాల్లోకి ఎత్తి మరీ ప్రకటించిన పొలార్డ్ | ABP DesamMI vs RCB Match preview IPL 2025 | పదేళ్ల గడిచిపోయాయి..ఇప్పటికైనా దక్కేనా.? | ABP DesamSiraj Bowling in IPL 2025 | ఐపీఎల్ లో వంద వికెట్ల క్లబ్ లోకి దూసుకొచ్చిన హైదరాబాదీ సిరాజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: కంచ గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా వేసిన హైకోర్టు, ప్రతివాదులకు నోటీసులు
కంచ గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా వేసిన హైకోర్టు, ప్రతివాదులకు నోటీసులు
Black Monday: బ్లాక్ మండే భయం నిజమైంది - సెన్సెక్స్ 3300 పాయింట్లు, నిఫ్టీ 1000 పాయింట్లు పతనం
బ్లాక్ మండే భయం నిజమైంది - సెన్సెక్స్ 3300 పాయింట్లు, నిఫ్టీ 1000 పాయింట్లు పతనం
Annamayya Crime News: రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతి, సీఎం చంద్రబాబు సంతాపం
రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతి, సీఎం చంద్రబాబు సంతాపం
Waqf Amendment Act:  కొత్త వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో వరుస పిటిషన్లు, విచారణకు వచ్చేది ఎప్పుడంటే..
కొత్త వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో వరుస పిటిషన్లు, విచారణకు వచ్చేది ఎప్పుడంటే..
Avanthika Sundar: ఖుష్బూ కూతురి కష్టాలు... పేరెంట్స్‌ ముందుకు రావట్లేదు... సినిమా ఎంట్రీ కష్టాలు విన్నారా?
ఖుష్బూ కూతురి కష్టాలు... పేరెంట్స్‌ ముందుకు రావట్లేదు... సినిమా ఎంట్రీ కష్టాలు విన్నారా?
YS Sharmila: ఏపీలో నిలిచిన ఎన్టీఆర్ వైద్య సేవలు, కూటమి ప్రభుత్వంపై షర్మిల మండిపాటు
ఏపీలో నిలిచిన ఎన్టీఆర్ వైద్య సేవలు, కూటమి ప్రభుత్వంపై షర్మిల మండిపాటు
AP Economic Growth: ‘ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్’, వృద్ధి రేటులో ఏపీ రికార్డు - తమిళనాడు తర్వాత స్థానం ఏపీదే
‘ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్’, వృద్ధి రేటులో ఏపీ రికార్డు - తమిళనాడు తర్వాత స్థానం ఏపీదే
Peddi First Shot Reactions: ప్రభాస్ బౌలింగ్‌లో చరణ్ సిక్సర్... క్యాచ్ పట్టిన బాలయ్య, పవన్, ఎన్టీఆర్... 'పెద్ది' మీమ్స్ అదుర్స్ అంతే
ప్రభాస్ బౌలింగ్‌లో చరణ్ సిక్సర్... క్యాచ్ పట్టిన బాలయ్య, పవన్, ఎన్టీఆర్... 'పెద్ది' మీమ్స్ అదుర్స్ అంతే
Embed widget