చైనీస్ రాశిచక్రంలో జంతువుల పేర్లు ఎందుకు ఉంటాయ్? దానివెనుకున్న ఆసక్తికరమైన కథ తెలుసా మీకు!
Chini Horoscope Story: భారతీయ జాతకంలాగే..., చైనీస్ జాతకం కూడా ప్రసిద్ధి చెందింది. ఇది జంతువుల ఆధారంగా ఉంటుంది..దీనివెనుకున్న ఆసక్తికరమైన కథ తెలుసా?

The myth behind the Chinese zodiac: వర్తమాన సమయంలో చైనా రాశి ఫలాలకు కూడా ఆదరణ పెరుగుతోంది. భారత జ్యోతిష్యం లాగే చైనా జ్యోతిష్య శాస్త్రంలోనూ 12 రాశులుంటాయి. చైనా రాశి ఫలాలు చదివేవారి మనసులో ఓ ప్రశ్న వస్తుంది.
భారత్ లో రాశులపేర్లు.. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తులా, వశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం.. ఇలా జంతువులు, దంపతులు, మూలకాలు అన్నీ కలసి ఉంటాయి..
కానీ..
చైనా జ్యోతిష్య శాస్త్రంలో 12 రాశులు జంతువుల పేర్లతోనే ఉంటాయి. ఎలుక, ఎద్దు, పులి, ముండి, డ్రాగన్, పాము, గుర్రం, గొర్రె, కోతి, కోడి, కుక్క పంది.
చైనాలో రాశులు జంతువుల పేర్లతో ఎందుకు ఉంటాయ్? దీనివెనుకున్న ఆసక్తికర కథ తెలుసా?
చాలాకాలం క్రితం చేనాను జేడ్ చక్రవర్తి ((Jade Emperor – స్వర్గానికి రాజు) పాలించారు. తన పాలలనో సమయాన్ని, సంవత్సరాలను లెక్కించేందుకు జంతువులతో ఓ గొప్ప పోటీ ప్రకటించారు. ఎవరు ముందుకు వచ్చి నదిని ఈవలి నుంచి ఆవలి ఒడ్డుకి దాటుతారో వారి క్రమంలోనే సంవత్సరాల చక్రం ఏర్పడుతుందని చెప్పారు. రేసు మొదలైంది.
మొదటి స్థానంలో నిలిచింది ఎలుక
ఎలుక (Rat)– ఎద్దు వీపుపై దాక్కుని..ఆఖరి నిముషంలో తెలివిగా ఓ దూకు దూకి మొదటి స్థానంలో నిలిచింది
ఎద్దు (OX – నిజాయితీగా కష్టపడి ఈదుకుంటూ వచ్చి రెండో స్థానంలో నిలిచింది
పులి (Tiger) – తన బలంతో మూడో స్థానం దక్కించుకుంది
కుందేలు (Rabbit) – నాలుగో స్థానం
డ్రాగన్ (Dragon) – ఐదో స్థానం
పాము (Snake) – ఆరో స్థానం ( ఈ స్థానంలో ఉండాల్సిన గుర్రం కాలుకి చుట్టుకుని ఆపేసింది)
గుర్రం (Horse) – ఏడో స్థానం.. ( పాము కారణంగా)
మేక (Goat) – ఎనిమిదో స్థానం
కోతి (Monkey) – తొమ్మిదో స్థానం
కోడి (Rooster) – పదో స్థానం
కుక్క (Dog) - పదకొండో స్థానం ( నదిలో దూకగానే ఆడుకోవడం మొదలుపెట్టిందట..అందుకే ఆలస్యం అయిపోయింది)
పంది (Pig) - శుభ్రంగా తిని మార్గమధ్యలో నిద్రపోయింది.. అందుకే ఆఖరుగా వచ్చింది
పిల్లి కూడా ఈ రేసులోనే ఉండాలి అనుకుంది కానీ ఎలుక మోసం చేసి నీళ్లలోకి తోసేసిందట.. అప్పటి నుంచే ఈ రెండు జంతువుల మధ్యా శత్రుత్వం ఏర్పడిందనే కథ కూడా ప్రచారంలో ఉంది.
ప్రాచీన కాలంలో గ్రామీణ జీవితంలో ప్రజలకు ఈ 12 జంతువులతోనే ఎక్కువగా పరిచయం ఉండేది. జంతువుల ద్వారా సంవత్సరాలు గుర్తుంచుకోవడం తేలిక అనే ఉద్దేశంతోనూ ఈ పేర్లు నిర్ణయించారని మరో కథనం.
అయితే మాహారేసు కథ మాత్రం 2 వేల సంవత్సరాలుగా చైనా, వియత్నాం, కొరియా, జపాన్ వంటి దేశాల్లో ప్రజాదరణ పొందింది
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించిన సమాచారం మాత్రమే. ఇక్కడ ABPదేశం ఏదైనా నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
చాణక్య నీతి: ఇగ్నోర్ చేయడం అవసరం కాదు ఆయుధం.. ఎవరిని, ఎప్పుడు, ఎందుకు ఇగ్నోర్ చేయాలో తెలుసుకోండి!






















