Surya Grahan 2025: సూర్య గ్రహణం భారతదేశంలో కనిపించదు! మరి ప్రయాణం చేయొచ్చా? గ్రహణం రోజు ప్రయాణం చేస్తే ఏమవుతుంది?
Surya Grahan 2025: సెప్టెంబర్ 21, 2025న ఏర్పడే సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. ప్రయాణం వాయిదా వేయాలా? రాశి ప్రకారం ప్రభావాలు తెలుసుకోండి.

సూర్య గ్రహణం 2025: భారతదేశంలో సెప్టెంబర్ 21 అర్థరాత్రి సూర్యగ్రహణం కనిపించదు. ఆధ్యాత్మిక దృక్కోణంలో ప్రయాణానికి ఎలాంటి ఆంక్షలు లేవు. అయినప్పటికీ, గ్రహణాన్ని అశుభ సమయంగా శాస్త్రాల్లో పేర్కొన్నారు. ఈ సమయంలో ప్రయాణం వాయిదా వేయడమే మంచిది అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.
గ్రహణం దేవతలు - రాక్షసుల మధ్య పోరాటానికి చిహ్నంగా పరిగణిస్తారు. గ్రహణకాలే చ యత్ కర్మ, న స్యాత్ పుణ్యం న చాశుభమ్ అని స్కంద పురాణం , నారద సంహితలో స్పష్టంగా ఉంది. అంటే గ్రహణ సమయంలో చేసిన పనులకు పూర్తి ఫలితం లభించదు. అవి వ్యర్థమవుతాయి లేదా తక్కువ ఫలితాలను ఇస్తాయి. అందుకే శాస్త్రాలు గ్రహణ సమయంలో ప్రయాణం, కొత్త పనులు, వివాహం, వ్యాపారం లేదా పెట్టుబడులకు దూరంగా ఉండాలని సలహా ఇచ్చాయి.
సెప్టెంబర్ 21-22, 2025 సూర్యగ్రహణం: ప్రత్యేకత ఏంటి?
సమయం (IST): సెప్టెంబర్ 21 రాత్రి 10:59 నుంచి సెప్టెంబర్ 22 తెల్లవారుజామున 3:23 వరకు
సూర్యుడు చంద్రుని స్థానం: ఇద్దరూ కన్యారాశిలో ఉంటారు
నక్షత్రం: ఉత్తర ఫాల్గుణి
భారతదేశంలో గ్రహణం కనిపించదు (ప్రధానంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ , దక్షిణ అర్ధగోళంలో కనిపిస్తుంది)
ఇది భారతదేశంలో కనిపించనందున సూతకాలం వర్తించదు. ఆలయాలు తెరిచే ఉంటాయి.. మతపరమైన ఆచారాల్లో ఎటువంటి ఆంక్షలు ఉండవు.
జ్యోతిష్యం ప్రకారం గ్రహణం సూర్యుడు - చంద్రుని శక్తి అసమతుల్యత పరిస్థితి. ఇది మానసిక స్థిరత్వం, నిర్ణయం తీసుకునే సామర్థ్యం , ప్రయాణ భద్రతపై ప్రభావం చూపుతుంది.
కన్యా రాశిలో గ్రహణం ఏర్పడటం వల్ల ప్రయాణంలో గందరగోళం, చిన్న చిన్న అడ్డంకులు , మానసిక అశాంతి ఏర్పడే అవకాశం ఉంది. గ్రహణ సమయంలో ప్రారంభించిన కొత్త పనులు, కొత్త ప్రయాణం లేదా కొత్త డీల్స్ ఫలితం ఆశించిన విధంగా ఉండకపోవచ్చు. ప్రయాణం మతపరమైన ప్రదేశాలకు లేదా దానధర్మాలకు అయితే పాక్షికంగా ప్రయోజనకరంగా ఉండవచ్చు.
కనిపించే గ్రహణం సమయంలో వాతావరణంలో ప్రతికూల తరంగాలు వచ్చే అవకాశం ఉంది. ఆ కిరణాలు శరీరం , మనస్సుపై ప్రభావం చూపుతుంది. అందుకే సుదూర ప్రయాణం అసురక్షితంగా పరిగణిస్తారు. పురాతన కాలంలో మార్గ భద్రత, వెలుగు , ఆహారం లేకపోవడం వల్ల గ్రహణం సమయంలో ప్రయాణాన్ని నిలిపివేయమని చెప్పారు.
నేటి యుగంలో శాస్త్రవేత్తలు గ్రహణం కేవలం ఖగోళ సంఘటన అని నమ్ముతారు. రైళ్లు, విమానాలు, బస్సు సర్వీసులు సాధారణంగా నడుస్తాయి. భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు, కాబట్టి రవాణా నిలిచిపోదు . సాధారణ కార్యకలాపాలకు ఆటంకం ఉండదు. మీరు మతపరమైన నమ్మకాలు కలిగి ఉంటే, మానసిక శాంతి కోసం ప్రయాణాన్ని వాయిదా వేసుకోవచ్చు.
పరిష్కారాలు
తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి వస్తే..ప్రయాణానికి ముందు ఓం ఘృణిః సూర్యాయ నమః మంత్రాన్ని 11 సార్లు జపించండి. రాగి పాత్రలో నీరు నింపి సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు బెల్లం లేదా తీపి తిని వెళ్ళండి. ప్రయాణం పూర్తయిన తర్వాత పేదవారికి దానం చేయండి.
రాశి ప్రకారం ప్రభావం
మేష రాశి
గ్రహణ సమయంలో సుదూర ప్రయాణాలను వాయిదా వేయండి. మానసిక ఒత్తిడి పెరగవచ్చు. పరిష్కారం: హనుమాన్ చాలీసా పారాయణం.
వృషభ రాశి
స్వల్ప దూర ప్రయాణం సాధ్యమే కానీ పెద్ద డీల్స్ మానుకోండి. పరిష్కారం: లక్ష్మీదేవికి ఎర్రటి పువ్వులు సమర్పించండి.
మిథున రాశి
ప్రయాణంలో ఆటంకాలు ఎదురవుతాయి.. ఖర్చులు పెరగవచ్చు. పరిష్కారం: తులసికి నీరు సమర్పించండి.
కర్కాటక రాశి
విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే కొంత టైమ్ తీసుకోండి. పరిష్కారం: శివునికి నీరు సమర్పించండి.
సింహ రాశి
గ్రహణం మానసిక అశాంతిని కలిగిస్తుంది, వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. పరిష్కారం: పేదలకు ఆహారం అందించండి.
కన్యా రాశి
మీ రాశిలోనే గ్రహణం ఉంది, ప్రయాణాన్ని వాయిదా వేయడం ఉత్తమం. పరిష్కారం: సూర్య మంత్రాన్ని జపించండి.
తులా రాశి
సాధారణ ప్రయాణం శుభప్రదం, కానీ పెట్టుబడులకు సంబంధించిన ప్రయాణాలు చేయవద్దు. పరిష్కారం: తెల్లటి వస్త్రాలు దానం చేయండి.
వృశ్చిక రాశి
కుటుంబంతో కలిసి ప్రయాణం చేయవచ్చు, కానీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. పరిష్కారం: మంగళ బీజ మంత్రాన్ని జపించండి.
ధనుస్సు రాశి
మతపరమైన ప్రయాణం ఫలవంతంగా ఉంటుంది, కానీ వ్యాపార ప్రయాణాలను వాయిదా వేయండి. పరిష్కారం: విష్ణు సహస్రనామ పారాయణం.
మకర రాశి
సుదూర ప్రయాణాలలో అలసట ఖర్చులు ఉంటాయి. పరిష్కారం: రావి చెట్టును ప్రదక్షిణ చేయండి.
కుంభ రాశి
అకస్మాత్తుగా ప్రణాళికలు చెడిపోవచ్చు, ఓపిక పట్టండి. పరిష్కారం: శని మంత్రం జపం.
మీన రాశి
సముద్రం, జలమార్గ ప్రయాణాలను వాయిదా వేయండి, లేకపోతే జాగ్రత్తగా ఉండండి. పరిష్కారం: జలచరాలకు ఆహారం అందించండి.
భారతదేశంలో ఈ సూర్యగ్రహణం కనిపించదు, కాబట్టి మతపరంగా ప్రయాణానికి ఎటువంటి ఆంక్షలు లేవు. జ్యోతిష్యపరంగా, గ్రహణ సమయంలో కొత్త ప్రారంభాలు మరియు సుదూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ప్రయాణం తప్పనిసరి అయితే, మంత్రాలు, అర్ఘ్యం , దానం ద్వారా గ్రహణ దోషాన్ని శాంతింపజేయవచ్చు.
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.






















