Srisailam Temple: శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త..ఏడాది తర్వాత స్వామివారి స్పర్శదర్శనాలు ప్రారంభం
Free Sparsha Darshan : ఏడాదిగా శ్రీశైలం మల్లన్న ఆలయంలో నిలిచిపోయిన స్పర్శదర్శనాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇందుకోసం భక్తులకు కొత్తగా టోకెన్ విధానం అమలుచేయనున్నారు

Srisailam Temple Reintroduces Free Sparsha Darshan: శ్రీశైల మల్లికార్జునుడి భక్తులకు దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. దాదాపు ఏడాదిగా నిలిచిపోయిన ఉచిత స్పర్శ దర్శనానాలను తిరిగి ప్రారంభించింది. జూలై 1 నుంచి ఆలయ అధికారుల పర్యవేక్షణలో ఈ సేవను తిరిగి ప్రారంభమయ్యాయి.
ఉచిత స్పర్శ దర్శనం కోసం కొత్తగా టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టారు అధికారులు. శ్రీశైలంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా టోకెన్లు తీసుకోవచ్చు..ఆఫ్ లైన్లోనే జారీ చేస్తారు.టోకెన్ తీసుకోవాలి అనుకనే భక్తులు తమ పేరు, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. దర్శనానికి వెళ్లే ముందు ఈ టోకెన్లను స్కాన్ చేసిన తర్వాతే లోనికి అనుమతిస్తామని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా భక్తుల రద్దీని నియంత్రించవచ్చని భావిస్తున్నారు.
స్పర్శ దర్శనం టైమింగ్స్ ఇవే
గతంలో అమల్లో విధానాన్నే పాటిస్తూ వారానికి నాలుగు రోజుల పాటూ ఈ సేవను అందించనున్నారు. ప్రతి మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం...ఈ నాలుగు రోజులు మధ్యాహ్న 1:45 నుంచి 3:45 వరకూ భక్తులను స్పర్శ దర్శనానికి అనుమతిస్తారని EO శ్రీనివాసరావు వెల్లడించారు. భక్తుల చిరకాల కోరిక మేరకు ప్రతి ఒక్కరూ మల్లికార్జునుడిని స్పృశించి ఆధ్యాత్మిక అనుభూతి పొందాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం అని చెప్పారు.
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయానికి నిత్యం వేలాది భక్తులు దర్శనార్థం వస్తారు. ఇందులో భాగంగా స్వామివారిని తాకే అరుదైన అవకాశం కోసం తపించిపోతారు. మల్లికార్జునుడిని స్పృశించి ఉప్పొంగిపోతారు. ఇక్కడ గర్భగుడిలో కొలువైన ఈశ్వరుడిని చూడడమే అదృష్టం అనుకుంటే స్పర్శదర్శం చేసుకోవడం మరింత అద్భుత అవకాశంగా భావిస్తారు. ఏడాది కాలంగా నిలిపేసిన స్పర్శ దర్శనాలు తిరిగి ప్రారంభం కావడంతో మల్లన్న సన్నిధిలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. పురుషులు అయితే పంచె, కండువాతో దర్శనానికి వెళ్లాలి. స్త్రీలు సంప్రదాయ వస్త్రధారణతో ఆలయంలోకి ప్రవేశించాలనే నియమం ఉంది.
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయానికి నిత్యం వేలాది భక్తులు దర్శనార్థం వస్తారు. ఇందులో భాగంగా స్వామివారిని తాకే అరుదైన అవకాశం కోసం తపించిపోతారు. మల్లికార్జునుడిని స్పృశించి ఉప్పొంగిపోతారు. ఇక్కడ గర్భగుడిలో కొలువైన ఈశ్వరుడిని చూడడమే అదృష్టం అనుకుంటే స్పర్శదర్శం చేసుకోవడం మరింత అద్భుత అవకాశంగా భావిస్తారు. ఏడాది కాలంగా నిలిపేసిన స్పర్శ దర్శనాలు తిరిగి ప్రారంభం కావడంతో మల్లన్న సన్నిధిలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. పురుషులు అయితే పంచె, కండువాతో దర్శనానికి వెళ్లాలి. స్త్రీలు సంప్రదాయ వస్త్రధారణతో ఆలయంలోకి ప్రవేశించాలనే నియమం ఉంది.
శివాష్టకం
ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజామ్
భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే
గళే రుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలమ్
జటాజూటగంగోత్తరంగైర్విశాలం శివం శంకరం శంభుమీశానమీడే
ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరం తమ్
అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే
వటాధోనివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదాసుప్రకాశమ్
గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే
గిరింద్రాత్మజాసంగృహీతార్ధదేహం గిరౌసంస్థితం సర్వదా పన్నగేహమ్
పరబ్రహ్మబ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే
కపాలంత్రిశూలం కరాభ్యాం ధానం పదాంభోజనమ్రాయ కామం దదానమ్
బలీవర్దయానం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమీశానమీడే
శరచ్చంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్
అపర్ణాకళత్రం సదాసచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమీడే
హరంసర్పహారం చితాభూవిహారం భవంవేదసారం సదానిర్వికారమ్
శ్మశానేవసంతం మనోజందహంతం శివంశంకరం శంభుమీశానమీడే
స్తవం యః ప్రభాతే నరశ్శూలపాణేః పఠేత్ స్తోత్రరత్నం త్విహప్రాప్యరత్నమ్
సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం విచిత్రైస్సమారాధ్య మోక్షం ప్రయాతి
ఇతి శ్రీ శివాష్టకం ||
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి






















