అన్వేషించండి

హైదరాబాద్ నుంచి శ్రీశైలం హెలికాప్టర్ ప్యాకేజీలు , ధరలు, ఎలా బుక్ చేసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో!

Srisailam Helicopter Tour from Hyderabad: మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ పర్యాటక శాఖ. ఇకపై హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి గంటలో వెళ్లేలా ప్లాన్ చేస్తోంది.. పూర్తి వివరాలు తెలుసుకోండి...

Srisailam Helicopter Tour: హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి హెలీ టూరిజంప్రారంభం కానుంది.  తెలంగాణ పర్యాటక శాఖ, ప్రైవేట్ భాగస్వామ్యంతో కలిసి 2026 సంక్రాంతి నుంచి ఈ సేవలు ప్రారంభించనుంది. 

 రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఈ రంగంలో 15 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిన పర్యాటక శాఖ.. ఫ్యూచర్లో దేశానికి నూతన టూరిజం కేంద్రంగా తెలంగాణను మార్చాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. పర్యాటకులకు ఆహ్లాదం, ఆనందంతో పాటు సరికొత్త అనుభూతిని అందించాలనే ఆలోచనతో ‘హెలీ టూరిజం’ అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి  శ్రీశైలానికి హెలికాప్టర్ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.

ప్రయాణ వివరాలు

రోడ్డు మార్గంలో అయితే హైదరాబాద్ to శ్రీశైలం 220 కిలోమీటర్లు (5-6 గంటలు పడుతుంది).

హెలికాప్టర్‌: కేవలం 1 గంటలోపు చేరుకోవచ్చు.

రూట్ ప్లాన్

 హైదరాబాద్ నుంచి బయలుదేరి, నల్లమల అడవులు, కృష్ణా నది, సోమశిల, అమరాగిరి వంటి అందాలను  చూపిస్తూ శ్రీశైలం 
చేరుకుంటుంది. ఇది ఒక అద్భుతమైన ఏరియల్ వ్యూ టూర్‌లా ఉంటుంది. 

ఈ  సేవ విజయవంతమైతే, వరంగల్, ములుగు జిల్లాల్లో రామప్ప, లక్నవరం వంటి పర్యాటక ప్రదేశాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది. 

 రౌండ్-ట్రిప్ ఫ్లైట్‌లు, సైట్‌సీయింగ్, ఆడ్వెంచర్ ఆప్షన్లు ఉండవచ్చని అంచనా
 
హైదరాబాద్ నుంచి శ్రీశైలం హెలికాఫ్టర్లో వెళ్లాలంటే ధర ఎంత  అన్నది ఇంకా ధృవీకరించలేదు కానీ సార్వత్రిక హెలీ-టూర్స్‌లో 4 నుంచి ఆరుగురు  ప్యాసింజర్లకు 50 వేల నుంచి  లక్షా 50 వరకూ ట్రిప్ ఉండొచ్చు. కచ్చితమైన ధరలు తెలుసుకునేందుకు తెలంగాణ టూరిజం వెబ్‌సైట్ ని చెక్ చేయండి. 

ఎలా బుక్ చేయాలి?

EaseMyTrip ద్వారా ఆన్‌లైన్ బుకింగ్ త్వరలో అందుబాటులోకి రానుంది
 
తెలంగాణ టూరిజం హెల్ప్‌లైన్: 1800-425-4647 లేదా వెబ్‌సైట్: tourism.telangana.gov.in. చూడండి

శ్రీశైలం ఆంధ్రప్రదేశ్‌  నంద్యాల జిల్లా నల్లమల అడవుల మధ్య కృష్ణా నది ఒడ్డున ఉన్న ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం. ఇక్కడ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం (12 జ్యోతిర్లింగాల్లో 2వది)  భ్రమరాంబికా అమ్మవారి ఆలయం (అష్టాదశ శక్తి పీఠాల్లో 6వది) కొలువయ్యాయి.

శివపురాణం, స్కందపురాణం, పద్మపురాణం వంటి గ్రంథాల్లో శ్రీశైలాన్ని "శ్రీపర్వతం"గా ప్రస్తావించారు. ఇక్కడ పరమేశ్వరుడు మల్లికార్జునుడిగా , పార్వతి భ్రమరాంబికగా ఆవిర్భవించారు. సతీదేవి మరణం తర్వాత శివుడు తన కార్యాన్ని పక్కనపెట్టి... సతీదేవి శరీరాన్ని మోస్తూ తిరగడం ఆరంభించాడు. మళ్లీ శివుడికిని కార్యోన్ముఖుడిని చేసేందుకు శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో అమ్మవారి శారీరాన్ని ముక్కలు చేశాడు. ఆభాగాలు పడినవే అష్టాదశ శక్తిపీఠాలు అని చెబుతారు. శ్రీశైలంలో సతీదేవి గొంతు భాగం పడింది. 
 
ఆర్యుల కాలం (క్రీ.పూ. 2000-1000) నుంచే ఇక్కడ ఆరాధన ఉందని...రామాయణం, మహాభారతంలో ప్రస్తావనలు ఉన్నాయి. ఆదిశంకరాచార్యులు (క్రీ.శ. 8వ శతాబ్దం) ఇక్కడ శ్రీశైల మాహాత్మ్యాన్ని రచించారు. శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, చాలుక్యులు, కాకతీయులు , రెడ్డి రాజులు , విజయనగర సామ్రాజ్య రాజులు ఇలా కాలక్రమేణా ఈ ఆలయం వివిధ రాజవంశాల చేతుల్లో అభివృద్ధి చెందింది.   1970ల్లో శ్రీశైలం డ్యామ్ నిర్మాణంతో పర్యాటకుల సంఖ్య పెరిగింది. 
 
ద్రావిడ-విజయనగర  శైలిలో నిర్మాణం, భైరవ కొండపై ఉన్న ఆలయం, పాతాళ గంగ రోప్‌వే, అక్క మహాదేవి గుహలు ప్రసిద్ధి.
మహాశివరాత్రి (ఫిబ్రవరి-మార్చి)లో లక్షల మంది భక్తులు వస్తారు. ఉగాది, దసరాల్లో కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు, వాహనసేవలు జరుగుతాయి

2025లో ధన త్రయోదశి , నరక చతుర్థశి, దీపావళి...ఏ రోజు ఏ పండుగ, ఏం చేయాలి, విశిష్టత ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

03-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
03-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
మీన రాశి ఆగస్టు 2-8 వారఫలాలు: ప్రేమ, కెరీర్, ఆర్థిక విజయాలు మీ సొంతం!
మీన రాశి ఆగస్టు 2-8 వారఫలాలు: ప్రేమ, కెరీర్, ఆర్థిక విజయాలు మీ సొంతం!
కుంభ రాశి ఆగస్టు 2-8 వారఫలాలు: అద్భుత అవకాశాలు, ఆర్థిక వృద్ధి
కుంభ రాశి ఆగస్టు 2-8 వారఫలాలు: అద్భుత అవకాశాలు, ఆర్థిక వృద్ధి
మకర రాశి: ఆగస్టు 2-8 వారం - మీ జీవితంలో స్థిరత్వం, ఎదుగుదలకు ఇదే సమయం!
మకర రాశి: ఆగస్టు 2-8 వారం - మీ జీవితంలో స్థిరత్వం, ఎదుగుదలకు ఇదే సమయం!

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Embed widget