![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sri Rama Navami 2023: ఈ 16 సుగుణాలే రాముడిని ఆదర్శపురుషుడిని చేశాయి!
Sri Rama Navami 2023: రామాయణంలో రాముడి లక్షణాలు గురించి వర్ణిస్తూ షోడశ మహా గుణాలు ఆయనలో ఉన్నట్లు తెలిపారు..ఆ 16 లక్షణాలు ఏంటంటే....
![Sri Rama Navami 2023: ఈ 16 సుగుణాలే రాముడిని ఆదర్శపురుషుడిని చేశాయి! Sri Rama Navami 2023: 16 good Qualities of Lord Ramachandra that everybody should learn, know in telugu Sri Rama Navami 2023: ఈ 16 సుగుణాలే రాముడిని ఆదర్శపురుషుడిని చేశాయి!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/29/594c95a60089218437f7ee6ad0cdf3ba1680082348142217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
16 Good Qualities of Lord Rama: ఓ సందర్భంలో నారదుడితో వాల్మీకి మహర్షి ఇలా అడిగారట..... నిత్యం సత్యం పలికే వాడు, నిరతము ధర్మం నిలిపే వాడు, చేసిన మేలు మరువని వాడు, సూర్యునివలనే వెలిగే వాడు, ఎల్లరికి చలచల్లని వాడు, ఎదనిండా దయగల వాడు...సరియగునడవడివాడు...ఈ లోకంలో ఎవరున్నారని ఓసారి నారదమహర్షిని అడిగాడట వాల్మీకి మహర్షి. ఈ ప్రశ్నలన్నింటికీ ఆయన చెప్పిన ఒకే ఒక సమాధానం శ్రీరామచంద్రుడు. ఓం కారానికి సరి జోడు, జగములు పొగిడే మొనగాడు, విలువులు కలిగిన విలుకాడు, పలుసుగుణాలకు చెలికాడు, చెరగని నగవుల నెలరేడు, మాటకు నిలబడు ఇలరేడు..దశరధ తనయుడు దానవ దమనుడు జానకిరాముడు...అతడే శ్రీరాముడు శ్రీరాముడు అని సమాధానమిచ్చాడు నారద మహర్షి.
శ్రీమహావిష్ణువు దశావతారాల్లో ఏడోది రామావతారం.. దుష్టశిక్షణ కోసం శ్రీహరి మానవరూపంలో ధరణిపై అవతరించి, ధర్మ సంస్థాపన చేసిన అవతారం ఇది. వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రం కర్నాటక లగ్నంలో జన్మించాడు శ్రీరాముడు. పితృవాక్య పరిపాలకుడిగా, ప్రజలను బిడ్డల్లా పాలించిన రాజుగా, భార్య కోసం పరతపించిన భర్తగా, ఆదర్శవంతమైన కుమారుడిగా ఇలా సకల సుగుణాలు కలబోసిన రామయ్యలో షోడస గుణాలను ప్రత్యేకంగా చెబుతారు. అవేంటంటే....
Also Read: ఈ ఒక్క శ్లోకం చదివితే చాలు విష్ణు సహస్రనామం పఠించినంత ఫలితం అని ఎందుకంటారు!
శ్రీరామచంద్రుడిలో ఉన్న 16 సుగుణాలు ఇవే
- గుణవంతుడు
- వీర్యవంతుడు
- ధర్మాత్ముడు
- కృతజ్ఞతాభావం కలిగినవాడు
- సత్యం పలికేవాడు
- దృఢమైన సంకల్పం కలిగినవాడు
- వేద వేదాంతాలను తెలిసివాడు
- అన్ని ప్రాణుల మంచి కోరేవాడు
- విద్యావంతుడు
- సమర్థుడు
- ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత అందగాడు
- ధైర్యవంతుడు
- క్రోధాన్ని జయించినవాడు
- తేజస్సు కలిగినవాడు
- ఎదుటివారిలో మంచిని చూసేవాడు
- అవసరమైనప్పుడు మాత్రమే కోపాన్ని ప్రదర్శించేవాడు
ఈ సుగుణాలే రాముడిని ఆదర్శ పురుషుడిగా నిలబెట్టాయి.
Also Read: కష్టాలు, ఇబ్బందులు తొలగించి మానసిక ప్రశాంతత, సంతోషాన్నిచ్చే శ్రీరామ రక్షా స్త్రోత్రం
భారతదేశంలో ధర్మ బద్ధ జీవనానికి నిలువెత్తు నిర్వచనం శ్రీరాముడు. మనిషి ఇలా బ్రతకాలి అని ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి.. మనిషి జన్మకు ఉన్న విశిష్టతను చాటిచెప్పిన పురుషోత్తముడు. అయనము అంటే నడక అని అర్థం . రామాయణము అంటే రాముని నడక అని అర్థం. సరిగ్గా గమనిస్తే శ్రీ మహవిష్ణువు దశావతారాల్లో ఒక్క రామావతారంలో తప్ప ఇక ఏ అవతారం గురించి ప్రస్తావనలోనూ అయనము అనే మాట వినియోగించలేదు. ఎందుకంటే రామావతారంలో స్వామి పరిపూర్ణముగా మానవుడే. అందుకే ఎక్కడా రాముడు తాను దేవుడిని అనికానీ, దైవత్వం గురించి ప్రకటించడం కానీ చేయడు ( కృష్ణావతారంలో తానే భగవంతుడిని అని చెబుతాడు కృష్ణుడు) . “రామస్య ఆయనం రామాయణం” అంటారు కదా మరి రాముడి కదలికకు అంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది. అంటే ఆయన అడుగు తీసి అడుగు వేస్తే అది ధర్మం, మరో అడుగు వేస్తే అది సత్యం .ఆయన నడక ఆయన కదలిక అంతా సత్యం ధర్మమే అందుకే “రామో విగ్రహవాన్ ధర్మః ” అన్నారు .
శ్రీరామరాజ్యం సినిమాలో ఉన్న ఈ పాటలో రాముడి గుణగణాల గురించి ఉంటుంది
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)