Spirituality: రజస్వల, రుతుక్రమం ఆడవారికే ఎందుకు, అది వరమా-శాపమా…
రజస్వల అమ్మాయిలు మాత్రమే ఎందుకవుతారు.. ప్రతి నెలా రుతుక్రమం మహిళలకు మాత్రమే ఎందుకొస్తుంది.. వేదం ఏం చెబుతోంది, సైన్స్ ఏమంటోంది. ఇది స్త్రీలకు వరమా-శాపమా దీనికి సంబంధించిన నియమాలు పాటించాలా వద్దా…
స్త్రీలు ప్రతినెలా ఋతుకాలంలో విడిగా ఉండడం మన పూర్వీకుల నుంచి వస్తోన్న ఆచారం. దీనికి ఆధారం యజుర్వేదంలో విశ్వరూప వధ, రజస్వలా వ్రతాల గురించి ప్రస్తావన ఉంటుంది. దేవతలరాజైన బృహస్పతి తపస్సుకు వెళ్లడంతో ఇంద్రుడు త్వష్ట కుమారుడైన విశ్వరూపుని గురువుగా చేసుకుంటాడు ఆయనకు మూడు తలలు. వాటితో సోమపానం, సురాపానం, భోజనం చేసేవాడు. ఒకప్పుడు తనకు లభించిన యఙ్ఞ ఫలంలో భాగాన్ని రాక్షసులకి ఇవ్వడంతో ఆగ్రహించిన ఇంద్రుడు వజ్రాయుధంతో విశ్వరూపుడి శిరస్సు ఖండించడంతో అవి పక్షులుగా మారి బ్రహ్మహత్యా దోషాన్ని ధరించి ఇంద్రునికి ఆ దోషాన్ని ఇస్తాయి. దాంతో తన పదవికే ఆపదరావడంతో యజ్ఞం ద్వారా కొంత తొలగించుకున్న ఇంద్రుడు... మిగిలిన దోషాన్ని మూడు భాగాలుగా చేస్తాడు. దాన్ని పుచ్చుకున్నవారికి కోరిన వరం ఇస్తానంటాడు.
- ఒక భాగాన్ని పృథ్వి తీసుకుని వరంగా భూమిపై ఎక్కడైనా తవ్వితే కొన్నాళ్లకి ఆ భూమి సమం అయ్యేలా చేయాలని కోరింది..అలాగే అని వరమిచ్చాడు ఇంద్రుడు
- వృక్షాలు ఒక భాగాన్ని పుచ్చుకున్నాయి. కొన్ని కొమ్మలు నరికినా వృక్షం మృతి చెందక మళ్ళీ వేరే శాఖలు మొలిచేలా వరాన్ని పొందింది.
- చివరి భాగాన్ని తీసుకున్న స్త్రీ.. దానికి బదులుగా పుత్రోత్పత్తి సామర్థ్యాన్ని వరంగా పొందింది...
Also Read: యజ్ఞయాగాదులు దేవుడికోసం అనుకుంటే మీరు పొరబడినట్టే...
వేదాల పరంగా
- అందుకే రజస్వల కాలంలో, నెలసరి వచ్చే సమయంలో వారిపై బ్రహ్మ హత్యా దోషం ఉంటుందని చెబుతారు. ఆ దోషం ఉండడం వల్లే వాళ్లతో కలసి భోజనం చేయకూడదు, తాకరాదు, వారు వండినవి తినకూడదనే నియమాలు ఉన్నాయి.
- నాలుగవ రోజున స్నానం చేశాక, నీళ్ళలో పసుపు కలిపి ఆ దోషాలన్నీ పోయేలా భగవత్ స్మరణ చేసి స్నానం చేస్తారు. ఆ మూడు రోజులు మసలిన ప్రదేశం మొత్తం పసుపు నీళ్లతో శుభ్రం చేస్తారు.
- నిత్యం దీపం పెట్టే ఇళ్లలో, తాయెత్తులు, యంత్రాలు లాంటి సెంటిమెంట్స్ పాటించే వారింట్లో ఆ మూడు రోజులు స్త్రీ స్పర్శ తగిలితే వాటి శక్తి పోతుంది..మళ్లీ సంప్రోక్షణ చేస్తే కానీ వాటిలో శక్తి చేరదు.
- నిత్యం సహజంగా మలినాలు విసర్జించాక స్నానం చేస్తే కానీ పూజ చేయం కదా..అలాగే ఇది కూడా శరీరానికి సంబంధించిన శౌచం అని అర్థం. ఆలయాల్లోకి వెళ్లరాదని చెప్పడం వెనుక ఉద్దేశం కూడా ఇదే. అందుకే ఆ నాలుగు రోజులు మంత్రజపం, స్తోత్ర పారాయణ, దీపారాధన చేయరాదు.
Also Read: సోమవారం, శనివారం గణపతిని ఇలా పూజిస్తే శనిబాధలతో పాటూ కష్టాలన్నీ తొలగిపోతాయట…
సైన్స్ పరంగా
- ఆరోగ్యరీత్యా కూడా ఆ నాలుగు రోజులూ స్త్రీకి విశ్రాంతి అవసరం. ఆ మూడు రోజులు ఆమె శరీరంలో జరిగే మార్పుల వల్ల సరైన విశ్రాంతి లేకపోతే ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉంది.
- ఇప్పటికే మన ఆచారాల్లో కొన్నింటి ఆరోగ్య రహస్యాలు అంగీకరిస్తున్నాం. ఇది కూడా ఆ కోవకు చెందినదే.
- ఈ విధమైన అశౌచంలో ఉన్న స్త్రీ శరీరం నుంచి ప్రసరించే సూక్ష్మ విద్యుదయస్కాంత తరంగాలు విపరీతశక్తితో ఉంటాయట.
- బ్రహ్మహత్యాపాతకం అనే శాపాన్ని తీసుకుని.. ఓ ప్రాణిని సృష్టించే వరం పొందిన స్త్రీ శరీరం దేవాలయంతో సమానం. అందుకే ఆ మూడు రోజులు శరీరంపై ఎలాంటి ఒత్తిడి పడకుండా ఉంటే ఆరోగ్యంగా ఉంటారని చెబుతారు...
Also Read: నవగ్రహాల ఆరాధన వల్ల ఏం జరుగుతుంది… గ్రహ దోషాల నుంచి విముక్తి పొందాలంటే నిత్యం ఈ శ్లోకం చదవండి..
కొన్ని ధర్మాలను పాటించలేకపోవచ్చు. పాటించే పరిస్థితి ఇప్పుడు లేకపోవచ్చు అంతమాత్రాన మన పూర్వీకులు పాటించాలని చెప్పే నియమాలన్నీ మూఢనమ్మకాలు అని కొట్టిపారేయడం ఎంతమాత్రం సమంజసం కాదంటారు. ఇప్పటికీ వాటిపై విశ్వాసం ఉన్నవారు పాటిస్తూనే ఉన్నారు.. పట్టించుకోని వారు పరిస్థితులను బట్టి ఆలోచనలు మార్చుకుని మసలుకుంటున్నారు.
పాటించిన వాళ్లు మహానుభావులనీ కాదు..పాటించని వారు మైలపడిన వారని కూడా కాదు.. ఎవరి విశ్వాసం వారిది. ఈ విషయంలో ఎవర్ని ఎవరూ తక్కువ చేసుకోపోవడమే మంచిదంటారు పండితులు.
Also Read: ఈ తిథి రోజు ఏం చేసినా విజయమే.. కానీ, ఈ తిథుల్లో చేసే పనులు కష్టాలు తెచ్చిపెడతాయ్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి