By: ABP Desam | Updated at : 11 May 2022 09:25 AM (IST)
Edited By: RamaLakshmibai
Spirituality (Image Credit: Pinterest)
పసుపు కుంకుమ..సుమంగళీ చిహ్నాలైన ఈ రెండింటికీ హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇంటికి అతిథులు ఎవరైనా వచ్చినప్పుడు ఏం ఇచ్చినా ఇవ్వకపోయినా బొట్టు పెట్టి మరీ పంపిస్తారు. ఏదైనా శుభకార్యానికి ఆహ్వానించినప్పుడు కూడా బొట్టుపెట్టి పిలుస్తారు. పుట్టింటికి వెళ్లిన ఆడపిల్లలు అత్తారింటికి వెళ్లేటప్పుడు పసుపు-కుంకుమ అందించి పంపిస్తుంటారు. ఇలా ఎంతో పవిత్రంగా భావించే పసుపు, కుంకుమ ఒక్కోసారి పొరపాటున చేజారిపడిపోతుంది. అలాంటప్పుడు చాలామందిలో భయం మొదలవుతుంది. అదో అపశకునం అని, ఏదో చెడు జరగబోతోందని భావిస్తారు. ఆ రోజంతా ఏదో ఆలోచనలోనే ఉండిపోతారు. అయితే ఇది ఏ మాత్రం నిజం కాదని కేవలం అపోహ మాత్రమే అంటున్నారు పండితులు.
Also Read: విలువైన వస్తువులు, పత్రాలు పోగొట్టుకుంటే ఈ అమ్మవారిని ప్రార్థిస్తే దొరుకుతాయట
మహిళలు బొట్టు పెట్టుకునే సమయంలో
సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే
అని జగన్మాతను స్మరించుకుంటూ బొట్టు పెట్టుకోవాలి.
ఏ వేలితో బొట్టు పెట్టుకోవాలి
Also Read: ఏడు జన్మలకు గుర్తుగా ఏడు ద్వారాలు, అజ్ఞానాన్ని పోగొట్టి ముక్తిని ప్రదర్శించే శక్తి స్వరూపం
బొట్టు నుదుటనే ఎందుకు పెట్టుకోవాలి
నుదిటి భాగాన్ని బ్రహ్మ స్థానంగా భావిస్తారు. నుదుటి భాగం జ్ఞాపకశక్తికి , ఆలోచనా శక్తికి స్థానం. అందుకే నుదుటి మధ్య బొట్టు పెడతారు. కనుబొమ్మల మధ్య ఉన్న సూక్ష్మస్థానం విద్యుద్ అయస్కాంత తరంగ రూపాల్లో శక్తిని వెలువరిస్తుంది. కుంకుమ పెట్టుకోవడం స్త్రీలకే కాదు పురుషులకు కూడా. బొట్టుపెట్టుకోవడం మూఢాచారం కాదు. పెద్దలు మనకోసం పెట్టిన ఆధ్యాత్మిక ఆరోగ్య రహస్యం.
ఏంకాదులే అని, భూదేవికి బొట్టు పెట్టినట్టు ఉంటుందని చీటికి మాటికి కావాలని కింద పడేయడం కూడా మంచిది కాదు. కేవలం పొరపాటున కిందపడినప్పుడు మాత్రం అదో అపశకునంగా భావించి ఏదో జరిగిపోతుందనే అపోహవద్దని చెప్పడం మాత్రమే మా ప్రయత్నం....
Also Read: మీరు తినే ఆహారంపైనా నవగ్రహాల ప్రభావం ఉంటుందని తెలుసా
Shani Jayanti 2022: మే 30 సోమవారం శనిజయంతి, ఆ రోజు ఇలా చేస్తే ప్రతీదీ శుభమే జరుగుతుంది
TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త, ఆగస్టు దర్శన టికెట్లు విడుదల - మధ్యాహ్నం మరిన్ని సేవల కోటా టికెట్లు ఆన్లైన్లో
Hanuman Jaya Mantram: హనుమాన్ జయమంత్రం, పిల్లలతో నిత్యం ఇది చదివించడం చాలా అవసరం - ఎందుకంటే!
Sundarakanda Parayanam: వివాహం, సంతానం, శని బాధలు ఇలా సుందరకాండలో ఏ ఘట్టం చదివితే ఎలాంటి సమస్యలు తీరుతాయో తెలుసా
Horoscope Today 24th May 2022: మంగళవారం ఈ రాశులవారికి జయాన్నిస్తుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?
Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!
Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !
Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్రం! సన్ఫ్లవర్ ఆయిల్ ధరపై..!