News
News
X

Spirituality/Vastu: కనీసం పాటించాల్సిన వాస్తు నియమాలివి, మీ ఇల్లు ఇలాగే ఉందా చెక్ చేసుకోండి

సంప్రదాయాలు, పద్దతులు ఏవైనా గానీ పట్టించుకునేవారికి అన్నీ పట్టించుకోని వారికి ఏమీ ఉండదు. పట్టించుకోకుంటే పెద్ద సమస్యేం ఉండదు కానీ పట్టించుకుంటే మాత్రం ఇవేం చిన్న విషయాలు కాదు. వాస్తు ఈ కోవకు చెందినదే

FOLLOW US: 
Share:

మనదేశంలో వాస్తు శాస్త్రాన్ని బాగా నమ్ముతారు. ఇంటి నిర్మాణం ఆధారంగానే దశ తిరుగుతుందని విశ్వసిస్తారు. అందుకే నిర్మాణం చేసేముందు, చేస్తున్నప్పుడు, చేసిన తర్వాత కూడా వాస్తు శాస్త్ర నిపుణులను పిలిచి మరీ సలహాలు స్వీకరిస్తారు. మార్పులు చేర్పులు చేస్తుంటారు. ఈ నియమాలు పట్టించుకోనివారి సంగతి ఎందుకులెండి కానీ...పట్టించుకునే వారు మాత్రం ప్రతిచిన్న విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. అయితే భారీగా వాస్తు నియమాలు పాటించకపోయినా కనీసం పాటించాల్సినవి కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం....

కనీసం పాటించాల్సిన వాస్తు నియమాలు 

 • సింహద్వారం ఎదురుగా మెట్లు మొదలవడం అస్సలు మంచిది కాదు. మీ ఇంటి ఫేసింగ్ ను బట్టి మెట్లు సింహద్వారానికి ఓ వైపుగా ఉండాలి కానీ ఎదురుగా మెట్లు కట్టకూడదు.
 • ఈ శాన్యం వైపు ఎట్టిపరిస్థితుల్లోనూ మెట్లు ఉండకూడదు
 • మెట్లు తూర్పు నుంచి పడమరకు కానీ, ఉత్తరం నుంచి దక్షిణం వైపునకు కానీ ఎక్కేవిధంగా ఉండాలి. మెట్లు బేసిసంఖ్యలో ఉండాలి, కుడిపాదం పెట్టి ఎక్కడం మొదలు పెడితే మీ ఫ్లోర్ కి చేరుకునేటప్పుడు మొదట కుడిపాదమే పెడతారు.
 • సింహద్వారానికి ఉన్న తలుపు కుడివైపు తెరుచుకోవాలి. కొన్ని ఇళ్లకు తలుపు ఎడమవైపు తెరుచుకుని ఉంటుంది. కానీ ఈ చిన్న జాగ్రత్త పాటిస్తే మంచిది అంటారు వాస్తు నిపుణులు.
 • రూమ్ సీలింగ్ అందంగా ఉంజాలనే ఉద్దేశంతో రకరకాలుగా డిజైన్ చేస్తారు. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ ఐదు కార్నర్ లు ఉండడం మంచిది కాదని చెబుతారు.
 • ఇంటికి వచ్చిన గెస్టులకు వాయువ్యం వైపు ఉన్న రూమ్ ని కేటాయించాలి
 • ఆగ్రేనయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ బెడ్ రూమ్ ఏర్పాటు చేసుకోకూడదు. అలా చేస్తే నిప్పులపై పడుకున్నట్టే. పైగా ఆ ఇంట దంపతుల మధ్య సఖ్యత ఉండదని చెబుతారు.
 • రెండు ద్వారాలు ఎదురెదురుగా ఉన్నప్పుడు రెండూ సమానంగా ఉండేలా ఉండాలి.
 • ఇంటికి ఉత్తరం, తూర్పు మూతపడకుండా చూసుకోవడం మంచిది.
 • కిటికీ తలుపులు బయటకు తెరుచుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలి
 • కొన్ని ఇళ్లు అందంకోసం, స్థలం సరిపకడ రకరకాల షేపుల్లో నిర్మిస్తారు. అయితే తిక్రోణం, యూ ఆకారంలో ఇల్లు నిర్మించడం ఎంతమాత్రం కలసిరాదు

వాస్తునిపుణులు చెప్పినవి , పుస్తకాల ఆధారంగా తెలుసుకుని రాసిన విషయాలివి. వీటిని ఎంతవరకూ విశ్వసించవచ్చు అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.  

Also Read: ఇంటి ద్వారాన్ని 16 విధాలుగా నిర్మించవచ్చు... ఇలా ఉంటే ఆయుష్షు, ఐశ్వర్యం, వంశాభివృద్ధి

Also Read: ఏం చేసినా కలిసిరావట్లేదా? వాస్తు దోషం ఉందేమో ఇలా చెక్ చేయండి

Published at : 19 Feb 2022 12:17 PM (IST) Tags: Vastu tips vastu vastu tips for home vastu for home vastu shastra vastu shastra for home basic vastu rules for home vastu plan basic rules in vastu

సంబంధిత కథనాలు

Garuda Purana: గరుడ పురాణం - ఆలస్యంగా నిద్రలేస్తే అన్ని కష్టాలా? లక్ష్మీదేవి కటాక్షించాలంటే ఏం చేయాలి?

Garuda Purana: గరుడ పురాణం - ఆలస్యంగా నిద్రలేస్తే అన్ని కష్టాలా? లక్ష్మీదేవి కటాక్షించాలంటే ఏం చేయాలి?

సాక్షాత్తు ఆ విష్ణు స్వరూపమే ‘సాలగ్రామం’ - ఇలా పూజిస్తే మీ కష్టాలన్నీ మాయం!

సాక్షాత్తు ఆ విష్ణు స్వరూపమే ‘సాలగ్రామం’ - ఇలా పూజిస్తే మీ కష్టాలన్నీ మాయం!

Horoscope Today 08th February 2023: ఈ రాశివారు కొన్నివిషయాల్లో సంకోచం లేకుండా దూసుకుపోతారు, ఫిబ్రవరి 8 రాశిఫలాలు

Horoscope Today 08th February 2023: ఈ రాశివారు కొన్నివిషయాల్లో సంకోచం లేకుండా దూసుకుపోతారు, ఫిబ్రవరి 8 రాశిఫలాలు

Gunadala Mary Mata Festival: ఈ 9 నుంచి గుణదల మేరీ మాత ఉత్సవాలు - అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు

Gunadala Mary Mata Festival: ఈ 9 నుంచి గుణదల మేరీ మాత ఉత్సవాలు - అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు

Mahamrityunjaya Mantra:మృత సంజీవని అని చెప్పే మృత్యుంజయ మంత్రం ఎప్పుడు జపించాలి!

Mahamrityunjaya Mantra:మృత సంజీవని అని చెప్పే మృత్యుంజయ మంత్రం ఎప్పుడు జపించాలి!

టాప్ స్టోరీస్

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కాంలో వరుస అరెస్టులు - ఆడిటర్ బుచ్చిబాబుతో పాటు గౌతమ్‌ని కూడా !

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కాంలో వరుస అరెస్టులు - ఆడిటర్ బుచ్చిబాబుతో పాటు గౌతమ్‌ని కూడా !

Home Loan EMI: గృహ రుణం మరింత ప్రియం, పెరగనున్న EMIల భారం

Home Loan EMI: గృహ రుణం మరింత ప్రియం, పెరగనున్న EMIల భారం

Balakrishna Phone : బాలకృష్ణ ఏ ఫోన్ వాడుతున్నారో చూశారా? పాకెట్‌లో ఎలా స్టైలుగా పెట్టారో?

Balakrishna Phone : బాలకృష్ణ ఏ ఫోన్ వాడుతున్నారో చూశారా? పాకెట్‌లో ఎలా స్టైలుగా పెట్టారో?

Kalyan Ram On Taraka Ratna Health : ఎందుకీ మౌనం - తారక రత్న హెల్త్ అప్డేట్ మీద కళ్యాణ్ రామ్ ఏమన్నారంటే?

Kalyan Ram On Taraka Ratna Health : ఎందుకీ మౌనం - తారక రత్న హెల్త్ అప్డేట్ మీద కళ్యాణ్ రామ్ ఏమన్నారంటే?