అన్వేషించండి
Advertisement
Spirituality: ఆధ్యాత్మికంగా 24 కు ఇంత ప్రత్యేకత ఉందా!
చాలా మందికి గాయత్రీ మంత్రం ఉందని తెలిసినా, ఆ మంత్రం ప్రత్యేకతతో పాటూ ఆ మంత్రం చుట్టూ ఉండే మరికొన్ని ప్రత్యేకతలు తెలియదు..అవేంటో చూద్దాం..
గాయత్రీ మంత్రం
“ఓం, భూర్భువస్సువః, తత్ సవితుర్వరేణ్యం,
భర్గోదేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్”
ఈ మంత్రంలో 24 బీజాక్షరాలున్నాయి
Also Read: స్నానం చేయకుండా వంట చేస్తున్నారా, ఆ భోజనం తిన్నవారు ఎలా తయారవుతారో తెలుసా
కేవలం గాయత్రి మంత్రం మాత్రమే కాదు ఆధ్యాత్మికంగా 24 కి చాలా ప్రత్యేకతలున్నాయి
- కంచి కామాక్షి మందిరం లో అమ్మవారు మూలవిరాట్టుగా కూర్చుని ఉన్న మంటపాన్ని గాయత్రి మంటపం అంటారు. ఆ ప్రాక్రారంలో 24 స్తంభాలున్నాయి. అవి 24 బీజాక్షరాలకు ప్రతీకలు.
- కోణార్క్ లోని సూర్య దేవాలయ సముదాయం ఒక పెద్ద రధంపై నిర్మించి ఉంటుంది. ఆ రధానికి గాయత్రీ మంత్రానికి ప్రతీకగా 24 చక్రాలు వున్నాయి.
- పురాణ కధనం ప్రకారం 24మంది మహా ఋషులు వారి మంత్రశక్తిని ఈ 24 బీజాక్షరాలలో నిక్షిప్తం చేసారు.
- జైన సిద్ధాంతంలో 24 తీర్ధంకరులు
- కేశవ నామాలు 24 (ఓం కేశవాయ స్వాహా, ఓంనారాయణాయ స్వాహా,ఓం మాధవాయ స్వాహా, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః,ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః , ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్ధాయ నమః , ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయనమః
ఓం జనార్ధనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరాయే నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః )
తత్వాలు 24 ( జ్ఞానేంద్రియాలు-5, కర్మేంద్రియాలు-5, పంచతన్మాత్రలు-5, మహాద్భుతాలు-5, బుద్ధి, అహంకారం, ప్రకృతి, మనస్సు
రామాయణంలో 24 సహస్ర శ్లోకాలు - వీణలో 24 చిర్రలు వుంటాయి. సంగీత శాస్త్రం తెలిసినవాళ్ళు దీన్నే గాయత్రి ఉపాసన అని అంటారు
- మన వెన్నుపాములో 24 మ్రుదులాస్తులు (Cartilage)వుంటాయి. వాటికి అధి దేవతలే గాయత్రి మంత్రాక్షరాలు.
Also Read: కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్న 50 లక్షల మందికి వండిపెట్టింది ఎవరు, ఇక్కడో ట్విస్ట్ ఉంది
“న గాయత్రీ త్రాహ్య పరం మంత్రం .. నమాతాః పర దైవతం” అని చెబుతారు.
అంటే 24 బీజాక్షరాలతో కూడిన గాయత్రీ మాతను ఒక్కసారి జపిస్తే చాలు, సర్వ పాపాలు హరించి,సకల దోషాలు తొలగి పోతాయంటారు.
Also Read: మీన రాశిలో గురు గ్రహం సంచారం వల్ల ఈ ఐదు రాశువారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion