IPL, 2022 | Match 68 | Brabourne Stadium, Mumbai - 20 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
CSK
CSK
IPL, 2022 | Match 69 | Wankhede Stadium, Mumbai - 21 May, 07:30 pm IST
(Match Yet To Begin)
MI
MI
VS
DC
DC

Spirituality: పెళ్లైన మహిళలు గాజులు వేసుకోవడం లేదా, అయితే ఈ విషయాలు తెలుసుకోండి

హిందూ సాంప్రదాయంలో పాటించే ప్రతి పద్ధతి వెనుకా ఓ కారణం ఉంటుందంటారు. గాజులు వేసుకోవడం కూడా ఇందులో భాగమే. ముఖ్యంగా పెళ్లైన మహిళలు గాజులు వేసుకోవడం అయిదోతనానికి గుర్తుమాత్రమే కాదు...ఇంకా చాలా ఉన్నాయ్

FOLLOW US: 

మారుతున్న ట్రెండ్ కి తగ్గట్టు ఇప్పుడు గాజులు వేసుకునే మహిళల సంఖ్య తగ్గినా... పండుగలు, వేడుకలు, శుభకార్యాల సమయంలో మాత్రం ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్నప్పుడు గాజులు వేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. లక్ష్మీస్వరూపంగా భావించే ఆడపిల్ల చేతినిండా గాజులు వేసుకుంటే గలగల శబ్దానికి ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. గాజులు పగిలిపోకుండా జాగ్రత్తగా చూసుకునే అమ్మాయిలు ఇంటి వ్యవహారాలను కూడా జాగ్రత్తగా చక్కదిద్దుతారని నమ్మకం. అయితే స్త్రీలు గాజులు వేసుకోవడం వెనుక అందం, సెంటిమెంట్స్ మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్. 

 • గాజులు వేసుకున్నవారి శరీరంలో రక్త ప్రసరణ బాగుంటుంది. పనులు చేస్తున్నప్పుడు మణికట్టు ప్రదేశంలో ఉన్న గాజులు పైకి, కిందకు కదలడం వల్ల రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది.
 • గాజులు వేసుకుని పనిచేసే మహిళలు తొందరగా అలసటకు గురికారట.గాజుల ధరించినవారికి ఒత్తిడిని భరించే శక్తి లభిస్తుందట. 
 • మట్టి గాజులు వేసుకుంటే శరీరంలో వేడిని తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుతుందట. అందుకనే ఎన్ని బంగారం గాజులు వేసుకున్నా కనీసం రెండైనా మట్టి గాజు చేతికి ఉండాలని పెద్దలు కండిషన్ పెట్టారు.
 • మహిళల శరీరం మగవారితో పోల్చితే చాలా సున్నితంగా ఉంటుంది. దీంతో హార్మోన్లు అసమతౌల్యత గురవుతుంటాయి. అందుకే గాజులు వేసుకోవడం వల్ల వాటి స్థాయి బ్యాలన్స్ డ్ ఉంటుంది. ప్రస్తుతం చాలామంది అమ్మాయిలకు హార్మోన్ల అసమతౌల్యత వల్లే ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. 
 • సీమంతం చేసినప్పుడు గర్భిణులకు గాజులు వేసి ప్రసవం అయ్యేవరకూ ఉంచుకోవాలని చెబుతారు. గర్భం ధరించిన వారికి ఐదో నెల తర్వాత పెరిగే బిడ్డ బరువు వల్ల అలసట ఎక్కువగా ఉంటుంది. ఆ ఒత్తిడిని తగ్గించడంతో పాటూ..ప్రసవ వేదనని భరించే శక్తి ఉంటుందని భావించేవారు. 
 • సుమంగళి స్త్రీలు తప్పనిసరిగా గాజులు వేసుకోవాలని సంప్రదాయం చెబుతోంది. చేతినిండా గాజులు వేసుకోపోయినా, బంగారం వేసుకున్నా కానీ మట్టి గాజులు రెండైనా కానీ తప్పనిసరిగా ఉండాలంటారు.
 • శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి పూజలో కూడా పసుపు, కుంకుమతో పాటు గాజులు పెట్టి పూజించడం, ముత్తైదువలకు అందించడం ఆచారంగా వస్తోంది. 

Also Read: శ్రీ చక్రం ఎంత పవర్ ఫులో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది

ఏ రంగు గాజులను వేసుకుంటే ఎలాంటి ప్రయోజనం

 • ఎరుపు రంగు గాజులు- శక్తి
 • ఆకుపచ్చ రంగు గాజులు- అదృష్టాన్నిస్తాయి
 • పసుపు రంగు గాజులు- సంతోషాన్నిస్తాయి
 • నారింజ రంగు గాజులు -విజయాన్ని అందిస్తాయి
 • నీలిరంగు గాజులు - విఙ్ఞానాన్ని ఇస్తాయి
 • ఊదారంగు గాజులు - స్వేచ్ఛనిస్తాయి
 • తెలుపు రంగు గాజులు - ప్రశాంతతను అందిస్తాయి
 • నలుపు రంగు గాజులు - అధికారాన్ని ఇస్తాయి
 • వెండి గాజులు - బలాన్నిస్తాయి
 • బంగారు గాజులు - ఐశ్వర్యాన్ని సూచిస్తాయి

Also Read: ఇంట్లో కనక వర్షం కురిపించే స్తోత్రం, నిత్యం చదివితే ఆర్థిక సమస్యలే ఉండవు
Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే

Published at : 07 May 2022 03:09 PM (IST) Tags: Spirituality Married Women benefits of wearing bangles different color bangles

సంబంధిత కథనాలు

Gyanvapi Mosque Row: మూడు దశాబ్దాల క్రితమే మొదలైన జ్ఞానవాపి మసీదు వివాదం

Gyanvapi Mosque Row: మూడు దశాబ్దాల క్రితమే మొదలైన జ్ఞానవాపి మసీదు వివాదం

Bhanu Saptami 2022: ఈ ఆదివారం భానుసప్తమి, ఆ రోజు మాత్రం ఈ పనులు చేయకండి

Bhanu Saptami 2022: ఈ ఆదివారం భానుసప్తమి, ఆ రోజు మాత్రం ఈ పనులు చేయకండి

Today Panchang 19th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శ్రీ షిరిడీ సాయి బాబా అష్టోత్తర శత నామావళి

Today Panchang 19th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శ్రీ షిరిడీ సాయి బాబా అష్టోత్తర శత నామావళి

Horoscope Today 19th May 2022: ఈ రాశివారిని ఏదో ఆందోళన వెంటాడుతుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 19th May 2022: ఈ రాశివారిని ఏదో ఆందోళన వెంటాడుతుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Gyanvapi Mosque : 'జ్ఞానవాపి' వెనుక ఇంత కథ ఉందా, శివలింగంతో పాటూ బావిలో దూకిన పూజారి!

Gyanvapi Mosque : 'జ్ఞానవాపి' వెనుక ఇంత కథ ఉందా, శివలింగంతో పాటూ బావిలో దూకిన పూజారి!
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్క‌డ దాక్కున్నా లాక్కొచ్చి లోప‌లేయిస్తా: చంద్ర‌బాబు సంచలన వ్యాఖ్యలు

Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్క‌డ దాక్కున్నా లాక్కొచ్చి లోప‌లేయిస్తా: చంద్ర‌బాబు సంచలన వ్యాఖ్యలు

RCB Vs GT Highlights: ఫాంలోకి వచ్చిన కింగ్ కోహ్లీ - గుజరాత్‌పై బెంగళూరు ఘనవిజయం!

RCB Vs GT Highlights: ఫాంలోకి వచ్చిన కింగ్ కోహ్లీ - గుజరాత్‌పై బెంగళూరు ఘనవిజయం!

NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!

NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!

Nikhat Zareen: తెలంగాణ బంగారు కొండ - ప్రపంచ చాంపియన్‌గా నిఖత్ జరీన్!

Nikhat Zareen: తెలంగాణ బంగారు కొండ - ప్రపంచ చాంపియన్‌గా నిఖత్ జరీన్!