Naramukha Ganapathi : పార్వతీ దేవి తయారు చేసిన గణపయ్య నిజ రూపం చూశారా..గజముఖం పెట్టకముందు తొండం లేకుండా వినాయకుడు ఎలా ఉన్నాడో చూసి తరించండి..

గణపతిని తలచుకోగానే మనకు గజముఖుడే గుర్తుకు వస్తాడు. కానీ అందుకు భిన్నంగా వినాయకుడు మొదట ఆవిర్భవించిన రూపంతోనే అంటే మనిషి ముఖంతోనే పూజలందుకుంటున్న క్షేత్రం ఎక్కడుంది. ఆ విశేషాలు చూద్దాం…

FOLLOW US: 

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతలకు అధిపతి. అన్నికార్యాలకూ, పూజలకూ ప్రధమంగా పూజలందుకునేవాడు. విజయాన్ని, జ్ఙానాన్ని ప్రసాదించే గణపయ్యను… లంబోదరుడు, గణనాధుడు. వినాయకుడు, విఘ్ననాధుడు అని ఎన్నో పేర్లతో పూజలు చేస్తాం. మనదేశంలో ఎన్నో వినాయక ఆలయాలున్నాయి. అంతెందుకు వినాయక చవితి రోజున కూడా విభిన్న రూపాల్లో గణపయ్యని మండపాల్లో కొలువుతీరుస్తారు. కానీ మనిషి మఖంతో  వినాయకుడు పూజలందుకుంటున్నాడని మీకు తెలుసా…

అ గజానన పద్మార్కం గజాననమహర్నిశం।
అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే।।
...అంటూ వినాయకుడిని స్తుతిస్తాం.

Also Read: వినాయక చవితి పూజ ఎలా చేయాలి.. అసలు మంత్రాలు ఏంటి?

గణనాథుని తలచుకోగానే పెద్దపెద్ద చెవులూ, తొండం, ఏక దంతంతో గజముఖమే కళ్లముందు సాక్షాత్కారం అవుతుంది. కానీ బొజ్జలేని గణపతిగా…. పార్వతిదేవి బొమ్మను తయారు చేసి ప్రాణం పోసిన సుందర రూపుడిని ఎవరైనా చూశారా? అయితే ఆ గణపయ్యను దర్శించుకోవాలంటే తమిళనాడులోని ఆదివినాయక ఆలయానికి వెళ్లాలి. దీన్నే నరముఖ వినాయక ఆలయం అంటారు.

ఇక్కడి విశిష్టత

తిలతర్పణపురి అనే గ్రామంలో వున్న స్వర్ణవల్లి సమేత ముక్తీశ్వర ఆలయం ఇది. పితృదోషాలతో బాధపడుతున్నవారు  ఇక్కడ కొలువైన నరముఖ వినాయకుడిని దర్శించుకుని ఆ దోషాల నుంచి విముక్తి పొందుతారని చెబుతారు. ఈ ఆలయంలో శ్రీరామచంద్రుడు  తన తండ్రి అయిన దశరథుడికి పితృకార్యక్రమాలు నిర్వహించాడట. దేశం మొత్తం ఎన్నిచోట్ల తిరిగి….పితృకార్యం నిర్వహించినా దశరథుడికి ముక్తి లభించకపోవడంతో పరమశివుడుని ప్రార్థించాడట. ముక్తీశ్వరాలయంలో ఉన్న కొలనులో స్నానమాచరించి తండ్రికి తర్పణాలు వదలమని శివుడు చెప్పాడట. అప్పటి నుంచే ఈ ఊరికి తిలతర్పణ పురి అనే పేరు వచ్చిందని చెబుతారు. తిలం అంటే నువ్వులు, తర్పణాలు అంటే వదలటం, పురి అంటే స్థలం.

ఈ ఆలయం ముఖ్యంగా భారతదేశంలోనే 7 ప్రముఖ స్థలాలుగా చెప్పుకునే కాశీ, రామేశ్వరం, శ్రీవాణ్యం తిరువెంకాడు, గయ, త్రివేణి సంగమంతో సరిసమానమైన స్థలంగా భావిస్తారు . అందుకే ఎవరైతే పెద్దలకు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేక బాధపడతారో వాళ్లు ఈ ఆలయాన్ని దర్శించి తర్పణాలు వదలితే ఆ దోషాల నుంచి విముక్తి పొందుతారని చెబుతారు.

నరముఖంతో ఉన్న గణపతి అంటే...శివుడు వినాయకుడి శిరస్సు ఖండించక ముందున్న రూపం అన్నమాట. అందుకే తొండం లేకుండా బాలగణపతి రూపంలో మనిషి ముఖంతో ఉంటాడు. అందుకే నరముఖ గణపతి, ఆది వినాయకర్ గణపతి ఆలయంగా చాలా ప్రసిద్ధి చెందింది.

తమిళనాడులోని తిరునల్లార్ శనిభగవానుని ఆలయానికి 25కిలోమీటర్ల దూరంలో….కూతనూరు సరస్వతీ ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ ఆలయం.

పితృకార్యాలు చేయలేకపోయాం అని బాధపడేవారు...ఈ నరముఖ గణపతి ఆలయానికి వెళ్లి తర్పణాలు వదిలితే చాలంటారు పెద్దలు....

Published at : 07 Aug 2021 03:12 PM (IST) Tags: Specialities Naramukha Ganapathi Tamil Nadu

సంబంధిత కథనాలు

Tirumala Darshan Tickets: శ్రీవారి భక్తులకు శుభవార్త - ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేసిన టీటీడీ

Tirumala Darshan Tickets: శ్రీవారి భక్తులకు శుభవార్త - ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేసిన టీటీడీ

Ashada Masam 2022 : ఆషాడాన్ని శూన్య మాసం అని ఎందుకంటారు!

Ashada Masam 2022 : ఆషాడాన్ని శూన్య మాసం అని ఎందుకంటారు!

Vivasvat Saptami 2022: ఈ రోజు వివస్వత సప్తమి, సూర్యుడిని ఇలా పూజిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం

Vivasvat Saptami 2022: ఈ రోజు వివస్వత సప్తమి, సూర్యుడిని ఇలా పూజిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం

Horoscope 6th July 2022: ఈ రాశులవారి దృష్టి తప్పుడు కార్యకలాపాలపైకి మళ్లుతుంది , జులై 6 బుధవారం రాశిఫలాలు

Horoscope 6th July  2022:  ఈ రాశులవారి దృష్టి తప్పుడు కార్యకలాపాలపైకి మళ్లుతుంది , జులై 6 బుధవారం రాశిఫలాలు

Panchang 6th July 2022: జులై 6 బుధవారం తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, వివస్వత సప్తమి సందర్భంగా సూర్య ధ్యానం

Panchang 6th July 2022: జులై 6 బుధవారం తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, వివస్వత సప్తమి సందర్భంగా సూర్య ధ్యానం

టాప్ స్టోరీస్

UK Ministers Resign: యూకే ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు షాక్- ఇద్దరు సీనియర్ మంత్రులు రాజీనామా!

UK Ministers Resign: యూకే ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు షాక్- ఇద్దరు సీనియర్ మంత్రులు రాజీనామా!

MM Keeravani: కీరవాణి తప్పు చేశారా? బూతు ట్వీట్ డిలీట్ చేసినా...

MM Keeravani: కీరవాణి తప్పు చేశారా? బూతు ట్వీట్ డిలీట్ చేసినా...

Hyderabad As Bhagyanagar: హైదరాబాద్ పేరుని బలవంతంగా మార్చారా? అంతకు ముందు భాగ్యనగర్‌గానే పిలుచుకున్నారా?

Hyderabad As Bhagyanagar: హైదరాబాద్ పేరుని బలవంతంగా మార్చారా? అంతకు ముందు భాగ్యనగర్‌గానే పిలుచుకున్నారా?

Congress MP Pen Theft: ఎంపీ జేబులో పెన్ను మిస్సింగ్! కలం కోసం కంటతడి, ఎంపీని ఓదార్చిన సన్నిహితులు-ధర ఎంతో తెలుసా?

Congress MP Pen Theft: ఎంపీ జేబులో పెన్ను మిస్సింగ్! కలం కోసం కంటతడి, ఎంపీని ఓదార్చిన సన్నిహితులు-ధర ఎంతో తెలుసా?