News
News
X

Konark Sun Temple: ఇది ఆలయం కాదు ప్రతి ఒక్కరూ సందర్శించాల్సిన మహా విశ్వవిద్యాలయం

పన్నెండేళ్ల పాటు 1200 మంది శిల్పులు కష్టపడి నిర్మించిన ఆలయం కోణార్క్ దేవాలయం. సూర్యుడి రథంలా ఉండే ఈ ఆలయం కేవలం హిందువులు మాత్రమే కాదు ప్రపంచంలో ప్రతి వ్యక్తి సందర్శించాల్సిన అద్భుతమైన విశ్వవిద్యాలయం.

FOLLOW US: 

13వ శతాబ్దంలో నిర్మించిన కోణార్క్ ఆలయం ఎన్నో దాడులకు తట్టుకుని, వందల ఏళ్లు భూస్థాపితమై ఉన్నా అద్భుత శిల్ప సౌందర్యంతో ఆకట్టుకుంటోంది. చిన్నారుల నుంచి యవ్వనంలో ఉండేవారికి, మలిసంధ్యలో ఉన్నవారికి ఇలా  ఓ వ్యక్తి జీవితంలో వివిధ  దశలకు సంబంధించిన విఙ్ఞానాన్ని అందిస్తోంది  కోణార్క్ ఆలయం. నేలకు రెండు అడుగుల ఎత్తులో అంటే పిల్లలకు కనిపించే విధంగా ఉండే వివిధ రకాల జంతువులు, పక్షులు వాటి విన్యాసాలు కనిపిస్తాయి. బొమ్మలతో పాటూ వాటి ఆహారపు అలవాట్లు కూడా దర్శనమివ్వడం పిల్లల్ని భలే ఆకట్టుకుంటాయి. ఈ బొమ్మలకు పై భాగంలో వివిధ రకాల సంగీత వాయిద్యాలు, నాట్యం, కుస్తీ లాంటి విభిన్న రకాల కళలున్న శిల్పాలు కనిపిస్తాయి. ప్రత్యేకంగా ఒడిస్సీ నృత్యానికి సంబంధించిన 128 రకాల భంగిమలు చూపుతిప్పుకోనివ్వకుండా ఉంటాయి. ఇంకా... రాజకీయం, యుద్ధ కళలు, రాజ్య పాలన, శిక్షలు లాంటి ఎన్నో కార్యకలాపాలకు సంబంధించిన శిల్పాలు విద్యార్థుల మెదడుకి పదును పెడతాయి. 

ఈ విగ్రహాలు అన్నింటిపైనా చెక్కిన కామసూత్ర భంగిమలు యవ్వనంలో ఉండేవారికి పాఠాలు నేర్పిస్తాయి. హైందవ సమాజంలో వివాహ వ్యవస్థకు ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ శిల్పాలు తెలియజేస్తాయి.  ఈ దశ దాటిన తర్వాత పైకి దృష్టి మరల్చితే దేవతా మూర్తుల విగ్రహాలు కనిపిస్తాయి. ఎలాంటి ఆకర్షణలకూ, మోహానికి లొంగిపోకుండా మనసును నిర్మలంగా ఉంచుకోగలిగితే భగవంతుడు సాక్షాత్కరిస్తాడని చెప్పడమే వీటి పరమార్థం.

ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఉన్న సింహం, ఏనుగు విగ్రహాలు కూడా అద్భుతంగా ఉంటాయి. సింహం ఏనుగుపై దాడి చేస్తూ ఉంటే, ఆ ఏనుగు ఒక మనిషిని చంపుతున్నట్లు కనిపిస్తుంది. అహంకారానికి, పొగరుకి సింహం నిదర్శనం, ఏనుగు ధనానికి ప్రతీక, ఈ రెండూ మనిషికి ఉంటే పతనం తప్పదనేది ఈ శిల్పం సందేశం. అలాగే, 10 అడుగుల పొడవు, 7 అడుగుల ఎత్తు ఉండే అశ్వాలు వీరత్వానికీ, బలానికీ ప్రతీకలుగా చెబుతారు. ఇక  రథంలా ఉండే ఈ ఆలయానికి ఉన్న 24 చక్రాలు ఏదో అందానికి చెక్కారనుకుంటే పొరపాటే... అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన  ఈ చక్రాలు సమయాన్ని సూచిస్తాయి. రథాన్ని లాగుతున్నట్టు రూపొందించిన  ఏడు గుర్రాలు ఏడు రోజులకు, సూర్య రశ్మిలో రంగులకు ప్రతీక అంటారు.  

1884 సంవత్సరంలో ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో చేర్చారు. ఈ ఆలయానికి ఇరువైపులా 12 చక్రాల వరుస ఉంది. ఈ 24 చక్రాలు గంటలను సూచిస్తాయని చెబుతారు. 10 రూపాయల నోటులో కనిపించే చక్రం ఇదే. ఒడిశాలో పూరీకి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోణార్క్ దేవాలయాన్ని గంగా వంశానికి చెందిన నర్సింహదేవ (1236-1264) నిర్మించారు. 

Alos Read: రథసప్తమికి- జిల్లేడు ఆకులకు ఏంటి సంబంధం .. పురాణాల్లో ఏముంది, సైన్స్ ఏం చెబుతోంది..

Published at : 08 Feb 2022 08:52 AM (IST) Tags: konark sun temple konark temple konark konark surya mandir konark gananatya konark mandir konark temple mystery sun temple konark konark temple story konark temple history konark sun temple secrets konark sun temple facts konark sun temple magnet konark puri surya mandir konark konark sun temple sunrise konark sun temple documentary konark sun temple history konark sun temple mystery konark mystery కోణార్క్ సూర్య దేవాలయ రహస్యం

సంబంధిత కథనాలు

Horoscope Today  16th August 2022:  ఈ రెండు రాశులవారికి అదృష్టం, ఆ రాశివారికి విజయం, ఆగస్టు 16 రాశిఫలాలు

Horoscope Today 16th August 2022: ఈ రెండు రాశులవారికి అదృష్టం, ఆ రాశివారికి విజయం, ఆగస్టు 16 రాశిఫలాలు

Horoscope Today 15 August 2022: స్వాతంత్ర్య దినోత్సవం ఈ రాశులవారి జీవితంలో రంగులు నింపుతుంది, ఆగస్టు 15 రాశిఫలాలు

Horoscope Today  15 August 2022:  స్వాతంత్ర్య దినోత్సవం ఈ రాశులవారి జీవితంలో రంగులు నింపుతుంది, ఆగస్టు 15 రాశిఫలాలు

Holes to Pots in Cremation : అంత్యక్రియలు సమయంలో కుండకు కన్నాలు పెట్టి పగలగొడతారెందుకు!

Holes to Pots in Cremation : అంత్యక్రియలు సమయంలో కుండకు కన్నాలు పెట్టి పగలగొడతారెందుకు!

Krishna Janmashtami 2022: శ్రీ కృష్ణుడు చిన్నప్పుడు ఎలా ఉన్నాడో చూడాలనుకుంది రుక్మిణి, ఏం చేసిందో తెలుసా!

Krishna Janmashtami 2022: శ్రీ కృష్ణుడు చిన్నప్పుడు ఎలా ఉన్నాడో చూడాలనుకుంది రుక్మిణి, ఏం చేసిందో తెలుసా!

Tirumala Updates: టీటీడీ కీలక నిర్ణయం - చతుర్దశ కలశ విశేష పూజ రద్దు

Tirumala Updates: టీటీడీ కీలక నిర్ణయం - చతుర్దశ కలశ విశేష పూజ రద్దు

టాప్ స్టోరీస్

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ

Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ

ఈ విమానం రెప్పపాటులో గమ్యానికి చేరుస్తుంది, టికెట్ జస్ట్ రూ.1,645 మాత్రమే!

ఈ విమానం రెప్పపాటులో గమ్యానికి చేరుస్తుంది, టికెట్ జస్ట్ రూ.1,645 మాత్రమే!

Tummmala Nageswararao : హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల

Tummmala Nageswararao :  హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల