Saphala Ekadashi December 2024: డిసెంబర్ 26 సఫల ఏకాదశి..ఈ రాశులవారికి రాజయోగం!
Saphala Ekadashi on December 26th: మార్గశిర మాసం అమావాస్య ముందు వచ్చే ఏకాదశిని సఫల ఏకాదశి అంటారు... అత్యంత విశిష్టమైన ఈ రోజు కొన్ని రాశులవారికి అదృష్టాన్నిస్తోంది...
Saphala Ekadashi December 2024: మార్గశిర మాసం అంటే శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరం. ప్రతి నెలలో రెండు ఏకాదశి తిథులొస్తాయి.. ప్రతి ఏకాదశి విష్ణుమూర్తి ఆరాధనకు ప్రత్యకమే.అయితే మార్గశిరంలో అమావాస్య ముందు వచ్చే సఫల ఏకాదశి అంటే మరింత ప్రత్యేకం. ఈ రోజు ఏ కార్యం తలపెట్టినా సఫలమే కానీ విఫలం అనే మాటే ఉండదంటారు పండితులు.
ప్రతి ఏకాదశికి పాటించే ఉపవాస నియమాలే ఈ ఏకాదశికి కూడా అనుసరించాలి. ఈ ఏడాది డిసెంబర్ 26న సఫల ఏకాదశి వచ్చింది. డిసెంబర్ 25 బుధవారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఏకాదశి ఘడియలు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 26 గురువారం రాత్రి 11న్నర గంటలవరకూ ఏకాదశి తిథి ఉంది. ఆ తర్వాత ద్వాదశి వచ్చింది.
ఏకాదశి ఘడియలు పూర్తయ్యే వరకూ ఉపవాసం ఉండి ద్వాదశి ఘడియలు పూర్తికాకుండా పూజ, దాన ధర్మాలు చేసి ఉపవాసం విరమించాలి. సఫల ఏకాదశి రోజున జరిగే గ్రహసంచారం కొన్ని రాశులవారికి మంచి ఫలితాలను అందిస్తున్నాయి. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..
Also Read: కొత్త ఏడాది ఆరంభంలో శని..ఆ తర్వాత బృహస్పతి సంచారంతో మీ జీవితంలో భారీ మార్పులు!
మేష రాశి
మేష రాశివారికి ప్రస్తుతం మంచి సమయం నడుస్తోంది..ఇందులో భాగంగా సఫల ఏకాదశి మరింత కలిసొస్తుంది. ఈ సమయంలో ఈ రాశివారు నూతన ఆస్తులు కొనుగోలు అమ్మకాలు చేస్తే లాభపడతారు. నూతన వాహన యోగం ఉంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. అనుకోని ఆర్థిక ప్రయోజనాలుంటాయి.
సింహ రాశి
సఫల ఏకాదశి సింహరాశివారికి సత్ఫలితాలనిస్తోంది. గత కొన్నాళ్లుగా వెంటాడుతున్న ఆర్థిక ఇబ్బందులు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరిస్థితి మీరు ఊహించని విధంగా మెరుగుపడుతుంది. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఇంటా బయటా మీకు సపోర్ట్ పెరుగుతుంది. స్నేహితుల సహకారంతో చాలా పనులు పూర్తవుతాయి. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు.
తులా రాశి
సఫల ఏకాదశి తులా రాశివారికి అదృష్టాన్నిస్తుంది. ఆర్థికంగా కలిసొస్తుంది. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయం. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు.
ధనుస్సు రాశి
ఈ రాశివారికి కూడా సఫల ఏకాదశి అన్నీ సత్ఫలితాలనే అందిస్తోంది. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం మీపై ఉంటుంది. పెండింగ్ లో ఉన్న డబ్బు చేతికందుతుంది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. సంతోషంగా ఉంటారు. ఉద్యోగం, వ్యాపారం, వృత్తి, విద్య...ఇలా ఏ రంగంలో ఉన్నా కానీ మంచి ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
Also Read: అదృష్టం - దురదృష్టం.. 2025లో తులా రాశి వారు ఏవైపు తూగుతున్నారు!
మీన రాశి
సఫల ఏకాదశి మీనరాశివారికి కలిసొస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి ఈ రోజు చాలా అనుకూలం. నిరుద్యోగులు ఉద్యోగం సాధిస్తారు. ఉద్యోగులు ఉన్నతాధికారులతో ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. సఫల ఏకాదశి మీనరాశివారి జీవితంలో మంచి మార్పులు తీసుకొస్తుంది.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
Also Read: ఈ రాశివారికి నూతన సంవత్సరం ఫస్టాఫ్ కన్నా సెకెండాఫ్ అదిరిపోతుంది - సింహ రాశి వార్షిక ఫలితాలు 2025!