Horoscope Today 27th May 2022: ఈ రాశులవారికి అనారోగ్య సూచనలున్నాయి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Horoscope Today 27 May 2022: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి
మే 27 శుక్రవారం రాశిఫలాలు
మేషం
ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. విద్యార్థులు పరీక్షల్లో సక్సెస్ అవుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కొత్త వ్యాపారాలు చేపట్టేందుకు అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటారు. మీరు మీ జీవిత భాగస్వామి కోసం ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆలోచించి మాట్లాడండి. జాగ్రత్తగా ఖర్చు పెట్టండి.
వృషభం
కార్యాలయంలో అదనపు పని భారం పడకుండా చూసుకోండి. మీరు మీ ప్రవర్తనలో మార్పును గమనిస్తారు. చికాకు ఎక్కువగా ఉంటుంది. ఎవరితోనైనా వివాదం వస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ప్రభుత్వ పనులు పెండింగ్ పడతాయి. వ్యక్తిగత సమస్యలను అందరితో చర్చించవద్దు.
మిథునం
ఈ రోజు సన్నిహితుల ప్రవర్తన మీ మానసిక స్థితిని పాడు చేస్తుంది. విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. మీ పురోగతితో మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. శ్రమకు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
కర్కాటకం
ఈ రోజంతా చాలా బిజీగా ఉంటారు. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు కుట్రలకు బలయ్యే అవకాశం ఉంది. సరదాగా కూడా ఎవ్వరినీ విమర్శించకండి. ఉద్యోగంలో ప్రమోషన్‌కు సంబంధించి చర్చలు సాగుతాయి. వ్యాపారం మెరుగుపడుతుంది. కుటుంబం, సమాజం నుంచి ప్రశంసలు అందుకుంటారు. దినచర్యలో మార్పుంటుంది.
సింహం
గతంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటారు. దాని గురించే ఆలోచించకుండా కొత్త పని ప్రారంభించండి. మీ డబ్బు, ఆస్తి భద్రత గురించి అజాగ్రత్తగా ఉండకండి. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. అధికారులు మీ నిర్ణయాన్ని తిరస్కరిస్తారు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి.
కన్య
ఈ రోజంతా బాగానే ఉంటుంది. కొంత భయం కారణంగా మీ పని ప్రభావితం అవుతుంది. బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించండి. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త. అపరిచితులను సులభంగా నమ్మొద్దు. మీ అభిప్రాయాలను అంగీకరించమని ఇతరులను బలవంతం చేయకండి. మీరు స్నేహితుడి గురించి కొంచెం ఆందోళన చెందుతారు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు సక్సెస్ అవుతారు.
తులా
వైవాహిక జీవితం బావుంటుంది. మీ సలహాలు కొందరికి మంచి చేస్తాయి. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. కళతో సంబంధం ఉన్న వ్యక్తులు అద్భుతమైన అవకాశాలను పొందుతారు. రహస్య శాస్త్రాల అధ్యయనం పట్ల మొగ్గు ఉంటుంది.ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.
వృశ్చికం
నిలిచిపోయిన పనులను ప్రారంభించేందుకు ఒత్తిడి ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రను ప్లాన్ చేసుకుంటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. అధికారులు మీకు పెద్ద బాధ్యతను అప్పగిస్తారు. ఈరోజు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా మిమ్మల్ని మోసం చేయవచ్చు. మీకు ఏపనీ చేయాలని అనిపించదు.
ధనుస్సు
ఈ రోజు ప్రారంభం మీకు ప్రశాంతంగా ఉంటుంది. ఎవరినీ విమర్శించొద్దు. విద్యార్థులకు ఉన్నత విద్య, చదువుల పట్ల ఆసక్తి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కొంత అసంతృప్తి ఉంటుంది. వ్యవసాయ రంగానికి సంబంధించిన వ్యక్తులు ప్రయోజనాలు పొందుతారు.
మకరం
స్నేహితులతో కొన్ని విభేదాలు ఉండొచ్చు. పూర్వీకుల ఆస్తి విషయంలో కుటుంబంలో కలహాలు పెరుగుతాయి. నిస్సహాయ ఆలోచనలకు దూరంగా ఉండండి. ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. భావోద్వేగంగా ఉండటం కూడా ప్రతికూలంగా ఉంటుంది. ఆఫీసు ఒత్తిడిని ఇంటికి మోసుకెళ్లొద్దు. ఈరోజు సాధారణంగా ఉంటుంది.
కుంభం
జీవిత భాగస్వామితో సఖ్యత ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. న్యాయవాద వృత్తితో సంబంధం ఉన్న వ్యక్తులు పెద్ద అవకాశాలు అందుకుంటారు. తెలియని భయం తొలగిపోతుంది. ప్రత్యర్థులు మీకు దూరంగా ఉంటారు. పరీక్షల్లో విజయం సాధించేందుకు విద్యార్థులు తీవ్రంగా ప్రయత్నిస్తారు.
మీనం
ఆర్థిక ఇబ్బందుల ప్రభావం మీ పనిపై పడతాయి. అప్పు తీసుకోవడాన్ని పరిశీలించండి. పిల్లల చదువుల విషయంలో ఆందోళన ఉంటుంది. కార్యాలయంలో మీ హక్కులు తగ్గుతాయి. మీ సూత్రాలు, ఆలోచనలపై రాజీ పడకండి. వ్యాపారంలో లాభం ఉంటుంది.