Ramayanam: కన్నుమూస్తూ రావణుడు లక్ష్మణుడికి చెప్పిన మాటలు నేటి పాలకులకు-మనకు కూడా వర్తిస్తాయ్

అనుభవంతో నేర్చుకున్న పాఠాలు జీవితాంతం గుర్తిండిపోతాయి.అలాంటి అనుభవాలు చెప్పేఅవకాశం ఆఖరి క్షణంలో వస్తే అవి మరొకరి జీవితానికి మంచి పాఠాలవుతాయి. రావణుడి నుంచి లక్ష్మణుడు నేర్చుకున్నది ఇదే

FOLLOW US: 

'రామాయణం' ముగిసేది రావణ సంహారంతోనే అని అందరికీ తెలిసిన విషయమే. కానీ రావణుడు కొన ఊపిరితో ఉన్నప్పుడు రాముడు అతని తమ్ముడైన లక్ష్మణుడితో బ్రాహ్మణుల్లో మంచి పండితుల్లో ఒకడైన రావణబ్రహ్మ దగ్గరకు వెళ్లి నాలుగు మించి విషయాలు తెలుసుకుని రమ్మని పంపిస్తాడు. అన్నమాటను గౌరవించి లక్ష్మణుడు ..కొనఊపిరితో ఉన్న రావణుడి దగ్గరకు వెళతాడు.  అప్పుడు రావణుడు చెప్పిన విషయాలివే..

Also Read: శ్రీరాముడు నవమి రోజే ఎందుకు జన్మించాడు, ఆ తిథికి ఉన్న ప్రత్యేకత ఏంటి

  • మన రథ సారథితో, పాలవాడితో, వంటవాడితో, నీ సోదరులతో ఎప్పుడూ స్నేహంగా మెలగాలి...వాళ్ళతో శతృత్వం పెట్టుకుంటే వారు ఎప్పుడైనా ఎట్నుంచి అయినా మనకు హాని చేస్తారు. ఒక్కొక్క సమయంలో వాళ్ళు మన ప్రాణాలను తియ్యడానికి కూడా వెనుకాడరు. ( సోదరుడైన విభీషణుడిని దూరం చేసుకుని రావణుడు కష్టాలు కోరి తెచ్చుకున్నాడు)  
  • నీతో ఉంటూ నిన్న విమర్శించే వారిపై నువ్వు ఎక్కువ నమ్మకం పెట్టుకో కానీ నిన్ను పొగిడే వారిని అస్సలు నమ్మకూడదు ( ఈ విషయం అర్థంకాకే ఎవరు మనవారో, ఎవరు బయటివారో, ఎవరు మన మంచికోరుకుంటున్నారో,ఎవరు ముంచేవారో తెలుసుకోలేకపోతున్నారు)
  • ఎప్పుడు విజయం నిన్నే వరిస్తుంది కదా అని ఎప్పుడూ నువ్వే గెలుస్తావని అనుకోకు ( నీ గెలుపుపై నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు)
  •  నీ శత్రువు చిన్నవాడు అని తక్కువ అంచనా వేయకు. ఎవరి వెనుక ఎంత బలం ఉందో ఎవరికి తెలుసు. నేను హనుమంతుడిని కోతే కదా అని తక్కువ అంచనా వేసి చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాను.  
  • రాజు యుద్ధంలో గెలవాలని కోరిక ఉండాలి కానీ ఎప్పటికీ అత్యాశపరుడై ఉండకూడదు. ( గెలవాలి అనుకోవడం వేరు ఎదుటివారు నాశనం అయిపోవాలి అనుకోవడం వేరు...ఈ రెండింటి మధ్య ఉన్న స్వల్ప వ్యత్యాసం గమనించిన వారే నిజమైన విజేత)
  • దేవుడిని ప్రేమించు లేదా ద్వేషించు.... కానీ ఏదైనా కూడా అపారమైన ధృఢ నిశ్చయంతో ఉండాలి. ( ఈ తరంలో దేవుడున్నాడు, లేడని రెండు రకాల విషయాలపై వితండం వాదం చేసేవారికి వర్తిస్తుంది ఇది ఎందుకంటే దేవుడున్నాడు లేడన్న విషయంలో ఎవరి వాదన వారిది. వాళ్లు దాన్ని బలంగా నమ్మడంలో తప్పులేదు కానీ ఎదుటి వారి అభిప్రాయాన్ని తప్పుపట్టడం తప్పు)
  • ఇతరులకు, సైన్యానికి అవకాశం ఇచ్చి రాజు అలిసిపోకుండా పోరాడితేనే విజయం సొంతం అవుతుంది. ( ఈ విషయంలో రాజకీయాలు, కార్యాలయాల్లో బాస్ లకు వర్తిస్తుంది. అన్నింటా తామే కనిపించాలనే ఉద్దేశంతో పనంతా తామే చేసేసుకుంటారు, కొందరైతే క్రిడిట్ ఎవ్వరికీ దక్కకూడదనే ఉద్దేశంతో అన్నింట్లోనూ హడావుడి చేస్తారు. కానీ రాజు మీన్స్ బాస్ అలసిపోకుండా తన టీమ్ తో సరైన వర్క్ చేయించాలి, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసినప్పుడే విజయం సొంతం అవుతుంది)

ఈ విషయాలు లక్ష్మణుడికి చెబుతూ ప్రాణాలు విడిచాడు రావణుడు. అయితే రావణుడు చెప్పిన మాటలు కేవలం పురాణాల్లో వారికి మాత్రమే కాదు ఈ తరానికి, పాలకులకు కూడా వర్తిస్తాయనేందుకే కొంతలో కొంత వివరణ. 

Also Read: ఈ లక్షణాలుంటే మీరు కూడా రాముడే-దేవుడే

Published at : 09 Apr 2022 05:13 PM (IST) Tags: ravana 2022 sri rama navami sri rama navami 2022 2022 ram navami date ram navami date 2022 Sitarama kalyanam janak pur trijata in ramayana Lakshmana

సంబంధిత కథనాలు

Today Panchang 21st May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శనిబాధలు తొలగించే స్త్రోత్రం

Today Panchang 21st May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శనిబాధలు తొలగించే స్త్రోత్రం

Horoscope Today 21st May 2022: ఈ రాశి ఉద్యోగులు టెన్షన్లో ఉంటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 21st May 2022: ఈ రాశి ఉద్యోగులు టెన్షన్లో ఉంటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 21st May 2022: ఈ రాశులవారికి ఇకపై భలే కలిసొస్తుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 21st May 2022: ఈ రాశులవారికి ఇకపై భలే కలిసొస్తుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Shukra Gochar 2022 : శుక్రగ్రహ సంచారం వల్ల ఈ మూడు రాశులవారు ఓ సమస్య నుంచి బయటపడితే మరో సమస్యలో ఇరుక్కుంటారు

Shukra Gochar 2022 : శుక్రగ్రహ సంచారం వల్ల ఈ మూడు రాశులవారు ఓ సమస్య నుంచి బయటపడితే మరో సమస్యలో ఇరుక్కుంటారు

Shukra Gochar 2022 zodiac: మే 23న రాశి మారుతున్న శుక్రుడు, ఈ రాశులవారి జీవితం ప్రేమమయం

Shukra Gochar 2022 zodiac: మే 23న రాశి మారుతున్న శుక్రుడు, ఈ రాశులవారి జీవితం ప్రేమమయం
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రాగల మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు

Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రాగల మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు

Gold Silver Price Today 21th May 2022 : బంగారం, వెండి ధరలు పైపైకి, ప్రధాన నగరాల్లో ఇవాళ్టి రేట్స్ ఇలా

Gold Silver Price Today 21th May 2022 : బంగారం, వెండి ధరలు పైపైకి, ప్రధాన నగరాల్లో ఇవాళ్టి రేట్స్ ఇలా

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?