Eid-Ul-Fitr 2023 wishes In Telugu 2023: రంజాన్ శుభాకాంక్షలు - ఈ కోట్స్‌తో ఈద్ ఉల్ ఫితర్ విషెస్ చెప్పండి!
Eid Mubarak Wishes: ఏప్రిల్ 22న ముస్లిం సోదరుల రంజాన్ ఉపవాసాలు ముగించుకుని ‘ఈద్ ఉల్ ఫితర్’ జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా రంజాన్ శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి
Happy Eid-ul-Fitr 2023 : ముస్లింల పవిత్ర గ్రంథం 'ఖురాన్' అవతరించిన రంజాన్ మాసంను ముస్లింలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ పవిత్ర మాసంలో ఉపవాసాలు, దీక్షలు, ఆధ్యాతిక్మక చింతన, దానాలు, ధర్మాలు చేపడతారు. నెలవంకతో ప్రారంభమైన రంజాన్ మాసం.. మళ్లీ నెలవంక రాకతో ముగుస్తుంది. ‘ఈద్ ఉల్ ఫితర్’ పండుగతో రంజాన్ పండుగ ముగుస్తుంది. షవ్వాల్ నెలలో మొదటి రోజైన ఈద్ ఉల్ ఫితర్ రోజున ఉపవాసం చేయకూడదనేది ఆచారం. రంజాన్ సందర్భంగా మసీదులలో తరావీహ్ ప్రార్థనలు జరుగుతాయి. ఇవి సాధారణంగా జరిగే ప్రార్థన కంటే ఎక్కువ సమయం అంటే రాత్రిపూట కూడా సాగుతాయి. సూర్యోదయానికి ముందు సెహరీతో ప్రారంభమైన ఉపవాస దీక్ష ప్రతి రోజూ సూర్యాస్తమయం తర్వాత చేసే ఇఫ్తార్ అనే విందుతో ముగిస్తారు. ఇలా నెల రోజుల పాటు సాగుతుంది. చివరి రోజున నెలవంక దర్శనంతో ఉఫవాస దీక్షలు పూర్తయిపోతాయి. తర్వాత ఈద్ ఉల్ ఫీతర్ అనే పండుగ చాలా వైభవంగా జరుపుకుంటారు. పండుగ రోజున సాధారణంగా ఈద్ ముబారక్, ఈద్ సద్ అని కానీ శుభాకాంక్షలు ఒకరికొకరు చెప్పుకుంటారు. వివిధ దేశాల్లో వారి వారి స్థానిక భాషల్లోనూ ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు చెప్పుకోవడం జరుగుతుంది. మరి మీ స్నేహితులకు, బంధు మిత్రులకు శుభాకంక్షలు ఇలా తెలియజేయండి
Also Read: క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్
ముస్లిం సోదరులకు ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు
రంజాన్ మాస ఉపవాస దీక్షలను ముగించుకుని
ఈద్ ఉల్ ఫితర్ వేడుకను జరుపుకుంటున్న ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు
ప్రేమ, దయ, సహనం, ఆనందం, సంతోషాల కలయిక రంజాన్ మాసం
మీకు మీ కుటుంబ సభ్యులకు ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు
సక్రమ మార్గంలో నడుచుకుంటూ
దేవుని యందు భక్తి విశ్వాసములు కలవారికి వారి కర్మానుసారం
మంచి, పవిత్రమైన జీవితం ప్రసాదించబడుతుంది - ఖురాన్
రంజాన్ శుభాకాంక్షలు
క్రమ శిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయిక పవిత్ర రంజాన్ మాసం
ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు
కూలీలతో పని చేయించుకున్నప్పుడు వారి చెమట ఆరకముందే కష్టార్జితం చెల్లించాలి - ఖురాన్
ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు
ఉపవాసంతో మనిషిని బాధించడం ఇస్లాం ఉద్దేశం కాదు
పేదవాడి ఆకలి బాధలు తెలుసుకోవడమే ముఖ్యోద్దేశం - ఖురాన్
Also Read: వంశపారపర్య ఆస్తులతో పాటూ పాపాలూ వెంటే వస్తాయి, వాటినుంచి విముక్తి పొందాలంటే!
అల్లా అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలని
మీ జీవితాన్ని సుఖశాంతులతో ఆనందంగా గడపాలని కోరుకుంటూ
రంజాన్ శుభాకాంక్షలు
ఈ రంజాన్ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని
అంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ
ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు
ఆ చంద్రుడి కాంతి మీపై ప్రసరించాలి
అల్లా దీవెనలతో నేడు మీరు కోరుకునే ప్రతీదీ జరగాలి
హ్యాపీ ఈద్
అల్లా మీ జీవితంలో ఆనందాలు నింపాలి
ఐశ్వర్యాలు ప్రసాదించాలి
ఎన్నో సంతోషాలు, మర్చిపోలేని జ్ఞాపకాల్ని మిగల్చాలి
ఈద్ ముబారక్
ప్రతి రంజాన్ మాసం ఓ అద్భుత ప్రయాణం
అందులో ఈద్-ఉల్-ఫితర్ ఓ అద్భుత ఘట్టం
మీకు మీ కుటుంబ సభ్యులకు ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు
అల్లా మీకు శాంతి, శ్రేయస్సును ప్రసాదించాలి
మీకు మీ కుటుంబ సభ్యులకు ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు
జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్నీ అధిగమించే శక్తిని అల్లా మీకు ప్రసాదించాలి
ఈద్ ముబారక్