Pradosh Vrat December 2025: డిసెంబర్‌లో రెండు ప్రదోష వ్రతాలు, తేదీ పూజా విధానం విశిష్టత తెలుసుకోండి!
Pradosh Vrat December 2025: డిసెంబర్ 2025లో మొదటి ప్రదోష వ్రతం డిసెంబర్ 2 మంగళవారం, రెండవది 17 బుధవారం వచ్చింది. ఈ రోజు ఏం చేయాలి? పూజా విధానం ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి.

Pradosh Vrat 2025: హిందూ ధర్మంలో ప్రదోష వ్రతం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది ప్రతి నెలా త్రయోదశి తిథి నాడు జరుపుకుంటారు. ఈ రోజున శివుడు, పార్వతిని పూజిస్తారు. ఈ పూజ సాయంత్రం సమయంలో చేస్తారు. ఈ వ్రతం ప్రతి నెలా శుక్ల పక్షం ..కృష్ణ పక్షం త్రయోదశి తిథి నాడు చేస్తారు. హిందూ పంచాంగం ప్రకారం, ఈ సంవత్సరం చివరి నెల డిసెంబర్‌లో వచ్చే రెండు ప్రదోష వ్రతాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
ప్రతి కోరిక నెరవేరుతుంది
ఈ వ్రతాలను ఆచరించడం వల్ల మానసిక శాంతి, సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్ముతారు. దీనివల్ల కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు ఉంటాయి. ప్రదోష వ్రతంలో మీరు ఏదైనా కోరుకుంటే, అది నెరవేరుతుంది. ఈ రోజున శివుడిని పూర్తి విధి విధానాలతో పూజించాలి. ఇది రుణ విముక్తుడిని చేస్తుంది..ఎన్నో శాశ్వత సమస్యల నుంచి ఉపశమనాన్ని కూడా ఇస్తుంది.
శుభ తిథి
పంచాంగం ప్రకారం, డిసెంబర్‌లో మొదటి ప్రదోష వ్రతం శుక్ల పక్షంలో డిసెంబర్ 2 న వస్తుంది. ఈ త్రయోదశి తిథి మంగళవారం. అదేవిధంగా, రెండవ ప్రదోష వ్రతం కృష్ణ పక్షంలో డిసెంబర్ 17న ఉంది. త్రయోదశి తిథి నాడు బుధవారం. మంగళవారం మరియు బుధవారం నాడు ప్రదోష వ్రతం రావడంతో దీని ప్రాముఖ్యత అనేక రెట్లు పెరిగుతుందని పండితులు చెబుతారు. ఈ రోజున శివుడిని మాత్రమే కాకుండా ఆదిదంపతులను పూజించాలి.
ప్రదోష వ్రతం భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే శివుని అనుగ్రహం, దాంపత్య సౌఖ్యం, సకల ఐశ్వర్యాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. సూర్యాస్తమయానికి 45 నిమిషాల ముందు నుంచి 45 నిమిషాల తర్వాత వరకు ఈపూజ చేయొచ్చు
ప్రదోష వ్రతం పూజా సామగ్రి
శివలింగం లేదా శివపార్వతుల ఫొటో, బిల్వపత్రాలు , పూలు, అక్షతలు, చందనం, కుంకుమ, కర్పూరం, పంచామృతం (పాలు, పెరుగు, తేనె, పంచదార, నెయ్యి), దీపారాధనకు నెయ్యి దీపం, ధూపం, గంధం, పండ్లు
పూజా విధానం
ప్రదోష వ్రతం ఆచరించాలి అనుకుంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం ఆచరించి చేసి, లేత రంగు దుస్తులు ధరించాలి.
ఈ రోజున వ్రతం చేయడానికి సంకల్పం తీసుకుని, సూర్యాస్తమయం తర్వాత పూజ చేయడానికి ఏర్పాట్లు ప్రారంభించండి.
మీ ఇంట్లో శివలింగం ఉంటే దానికి అభిషేకం చేసి పూజచేయండి..లేదంటే ఆలయానికి వెళ్లి భక్తిశ్రద్ధలతో పూజించండి
ముందుగా గణపతి పూజ చేసి అనంతరం శివపూజ ప్రారంభించాలి
శ్రీ ప్రదోష వ్రతం కోసం శివపూజ చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి
షోడశోపచార పూజ (16 రకాలుగా పూజ):ధూపం, దీపం, నైవేద్యం, కర్పూర హారతి ఇవ్వాలి.
శివలింగానికి గంగాజలం, జలం, పాలు,పెరుగు, తేనె, నెయ్యితో అభిషేకం చేయండి
ఓం నమః శివాయ” మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి.
ఈ రోజు... శివ తాండవ స్తోత్రం, లింగాష్టకం, బిల్వాష్టకం సహా శివస్త్రోత్రాలు పఠించాలి
పగలంతా ఉపవాసం ఉండి ప్రదోష వ్రతం ఆచరించాలి..పూజ అనంతరం ఫలహారం తీసుకోవాలి
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే. ఇక్కడ ABPదేశం ఏదైనా నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని ఆచరించే ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.






















