Pitru Dosha Symptoms: మీకు ఇలా జరుగుతుంటే పితృ దోషం ఉన్నట్టే !
Pitru Dosha Symptoms: మన తల్లితండ్రులు మన నడవడిక కారణంగా కలత చెందినప్పుడు, మనం వారికి సమస్యలు కలిగించినప్పుడు, మనం పితృ దోషం వంటి తీవ్రమైన దోషాలకు గురవుతాము. పితృ దోషం కారణంగా కలిగే లక్షణాలివే.
![Pitru Dosha Symptoms: మీకు ఇలా జరుగుతుంటే పితృ దోషం ఉన్నట్టే ! Pitru Dosha Symptoms: you will get these signs in your life if you have pitru dosha Pitru Dosha Symptoms: మీకు ఇలా జరుగుతుంటే పితృ దోషం ఉన్నట్టే !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/29/6e04842f6ca02aff3a4b733c7b3a44581685365833729691_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Pitru Dosha Symptoms: హిందూ సంప్రదాయంలో పితృస్వామ్యానికి చాలా ప్రాముఖ్యత ఉంది. పితృపక్షం సందర్భంగా మన పూర్వీకులు తమ సంతతిని ఆశీర్వదించేందుకు భూలోకానికి వస్తారన్నది భారతీయుల నమ్మకం. పూర్వీకుల మోక్షం కోసం, వారి ఆత్మకు శాంతి చేకూరడం కోసం పితృపక్షంలో శ్రాద్ధాన్ని నిర్వహిస్తారు. ఈ రోజున పూర్వీకుల పేరిట దాన, పుణ్య, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడం, అన్నదానం చేయడం వల్ల వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది. పూర్వీకులకు కోపం వస్తే ఇంట్లో అశాంతి నెలకొంటుందని విశ్వసిస్తారు. పూర్వీకులు మనపై కోపంగా ఉన్నప్పుడు, ఇంట్లో అనేక విధాలుగా విభేదాలు మొదలవుతాయి. మన తల్లిదండ్రులు మనపై కోపంగా ఉన్నప్పుడు లేదా మనపై పితృ దోషం ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసా..?
Also Read : ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన దేవుడి ఫొటో ఇది!
ఇంట్లో గొడవ
పూర్వీకులకు ఇష్టం లేకపోయినా, మన తల్లిదండ్రులు మనపై కోపంగా ఉన్నా ఇంట్లో గొడవలు రావడం సర్వసాధారణంగా మారుతుంది. కారణం లేకుండానే కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు గొడవ పడతుంటారు. మీకు కూడా ఇలా జరుగుతుంటే , దీనికి కారణం పితృ దోషమే అని గుర్తించాలి.
ఆరోగ్య సమస్యలు
పూర్వీకుల కోపం వల్ల ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. కుటుంబంలో ఎవరో ఒకరు నిరంతరం అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. చికిత్స పొందుతూ ఉన్నప్పటికీ, సమస్యలు కొనసాగుతాయి. ఇది పితృ దోషం ఉందని తెలుసుకోవడానికి ప్రధాన లక్షణం.
పనుల్లో ఆటంకాలు
మీరు ఏదైనా పని చేయాలని తలపెడితే అది సగంలోనే ఆగిపోయినా లేదా పనిలో ఒకదాని తర్వాత ఒకటిగా సమస్యలు కనిపించినా అది పితృదోష లక్షణం కావచ్చు. పితృ దోషం వల్ల పనుల్లో ఆటంకాలు ఏర్పడుతాయి. పని చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆగిపోవడం సర్వ సాధారణంగా మారుతుంది. అంటే పితృ దోషం ఒక వ్యక్తి పురోగతికి సమస్యలను కలిగిస్తుంది.
సంతాన సమస్యలు
పితృదోషం కారణంగా కుటుంబంలో పిల్లలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఎలాంటి సమస్యలు లేకపోయినా సంతానం కలగకుండా ఉంటే అది పితృ దోషానికి సంకేతం.
Also Read : 'శంఖం' సంపదకు ప్రతీకగా ఎందుకు చెబుతారు, దీన్ని ఎలా పూజించాలి!
పెళ్లికి ఆటంకం
మీ కుటుంబంలో ఎవరికైనా వివాహానికి అడ్డంకులు ఎదురైతే, అది పితృ దోషానికి సంకేతం. పితృ దోషం కారణంగా కుటుంబ సభ్యులకు పెళ్లి కాకపోవడం, పెళ్లి తర్వాత వారి బంధంలో సమస్యలు లేదా వివాహం కుదిరిన తర్వాత చెడిపోవడం కూడా పితృ దోష లక్షణాలేనని గుర్తించాలి.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)