Pisces Horoscope 8th June 2022: జూన్ 8 మీన రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి
Horoscope Today 8th June 2022: జూన్ 8 బుధవారం, ఈ వారం, ఈనెలలో మీన రాశివారికి ఫలితాలు ఎలా ఉన్నాయంటే...
మీన రాశి అధిపతి - బృహస్పతి
మీన రాశివారి పేర్లలో మొదటి అక్షరాలు-డి, డు, త్, ఝా, జె, దే, దో, చ్, చి
మీన రాశివారికి మంచి రోజులు- గురువారం, సోమవారం, మంగళవారం
జూన్ 8 మీన రాశి ఫలితం ( Pisces Horoscope 8th June 2022)
మీన రాశివారు ఈ రోజు కార్యాలయంలో శుభవార్త వింటారు. ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఆస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి లేదంటే పరిష్కారమవుతాయి. ఎండల్లో బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర వివాదాల్లో జోక్యం చేసుకోకండి. న్యాయపరమైన వ్యవహారాలు ముందుకు సాగుతాయి. ఈ రోజు స్నేహితులతో సంతోష సమయం గడుపుతారు. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం అందుకుంటారు. తెలియని వ్యక్తులనుంచి దూరం పాటించండి. పెట్టుబడులు పెట్టేందుకు మీకు ఈ రోజు సరైన సమయం కాదు...జాగ్రత్త.
Also Read: ఈ వారం ఈ మూడు రాశులవారికి డబ్బే డబ్బు, ఆ రాశి డయాబెటిక్ రోగులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే
మీన రాశి వార ఫలం ( Pisces Weekly Horoscope June 6 to June 12)
మీన రాశివారు ఈ వారం ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. కుటుంబంలో సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు కలిసొస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదా లభిస్తుంది. రాజకీయ నాయకులకు కలిసొచ్చే సమయం ఇది. వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు. మానసిక అశాంతి ఉంటుంది. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఆహారం సమయానికి తీసుకునేేందకు ప్రయత్నించండి. విద్యార్థులకు శుభసమయం నడుస్తోంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారి ప్రయత్నాలు ఫలించే సూచనలున్నాయి.
Also Read: మీ నక్షత్రం ప్రకారం ఇంటి ఆవరణలో పెంచాల్సినవి .. ఆవరణలో ఉండకూడని చెట్లు ఇవే..
మీన రాశి జూన్ నెల ఫలితం (Pisces 2022 June Horoscope)
మీన రాశివారికి జూన్ నెలలో గ్రహ సంచారం మిశ్రమంగా ఉంది. చేసే వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. సృజనాత్మక పనులపై దృష్టి సారిస్తే లాభదాయకంగా ఉంటుంది. కార్యాలయంలో మీరిచ్చే సలహాలు, సూచనలకు ప్రాధాన్యత లభిస్తుంది. జూన్ నెలలో మొదటి 15 రోజులూ ఒడిదొడుకులు తప్పవ్. అనవసర ఖర్చులు తగ్గించుకోండి. కుటుంబ సౌఖ్యం, వాహన సౌఖ్యం ఉంటుంది. బంధు మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం...
Also Read: ఇంటి ద్వారాన్ని 16 విధాలుగా నిర్మించవచ్చు... ఇలా ఉంటే ఆయుష్షు, ఐశ్వర్యం, వంశాభివృద్ధి