అన్వేషించండి

Parijatham Tree:శ్రీ కృష్ణుడు సత్యభామ కోసం తీసుకొచ్చిన పారిజాతవృక్షం ఇప్పుడు ఎక్కడుందంటే!

పారిజాత పువ్వు రుక్ష్మిణీదేవికి ఇచ్చినందుకు శ్రీకృష్ణుడిపై సత్యభామ అలుగుతుంది. ఇష్టసఖి అలకతీర్చేందుకు కన్నయ్య పారిజాత చెట్టే దివి నుంచి భువికి తీసుకొచ్చేస్తాడు. ఇప్పటికీ ఆ చెట్టు ఉంది..ఎక్కడంటే.

పారిజాత పూలతో దేవుడికి పూజ ఎంతో ప్రీతిపాత్రమైనదిగా చెబుతారు. ప్రపంచంలో ఏ చెట్టుకీ లేనంత ప్రత్యేకత పారిజాత వృక్షానికే ఎందుకంటే స్వర్గలోకం నుంచి తీసుకొచ్చినందునే. అందుకే ఈ పూలు నేరుగా చెట్టునుంచి కోయరు..కిందపడినవి ఏరి పూజచేస్తారు. దేవతావృక్షం నుంచి పూలు నేలపై రాలిన తర్వాతే అవి భూమికి చేరినట్టు అని భావిస్తారు. 

Also Read: పుట్టింట్లో అవమానాన్ని భరించలేక అగ్నిలో దూకిన పార్వతి, పరమేశ్వరుడు ఏం చేశాడంటే
మొత్తం నారదుడే చేశాడు
నారదుడు ఓ సందర్భంలో శ్రీకృష్ణుడిని కలవడానికి ద్వారకా నగరానికి వచ్చినప్పుడు స్వర్గలోకం నుంచి పారిజాత వృక్షాన్ని తన వెంట తీసుకొచ్చి దేవలోకంలో మాత్రమే లభించే ఈ అపురూప పుష్పం మీకు ఇస్తున్నాను, దీన్ని మీకు బాగా నచ్చినవారికి ఇవ్వమని చెప్పగా, అప్పుడు అంతఃపురంలో తనతో పాటూ ఉన్న రుక్మిణికి ఇస్తాడు శ్రీకృష్ణుడు. ఆ విషయం చెలికత్తెల ద్వారా తెలుసుకున్న సత్యభామ అలకలపాన్పు ఎక్కుతుంది. అందరికన్నా ఎక్కువని చెప్పి ఇప్పుడిలా చేస్తారా అని రుసరుసలాడుతుంది. అప్పుడు స్పందించిన శ్రీకృష్ణుడు నీకోసం ఏకంగా చెట్టే తీసుకొచ్చేస్తానని చెప్పి అలకమాన్పిస్తాడు.

తానూ దేవలోకానికి వస్తున్నట్లుగా శ్రీకృష్ణుడు ఇంద్రుడికి కబురు పెట్టి స్వర్గలోకానికి సత్యబామతో కలసి బయలుదేరుతాడు. ఇలా దేవలోకానికి వెళ్లి వన విహారం చేస్తూ పారిజాత వృక్షాన్ని చూసి ఆ చెట్టుని పెకిలించి తీసుకువెళుతుండగా ఇంద్రుడు అడ్డుకోవడంతో యుద్ధానికి దిగుతాడు శ్రీకృష్ణుడు. యుద్దానికి దిగి చివరకు ఓటమిని అంగీకరించి పారిజాతవృక్షాన్ని శ్రీకృష్ణుడికి ఇస్తాడు ఇంద్రుడు. అప్పుడు సత్యభామతో కలసి భూలోకానికి వచ్చిన శ్రీకృష్ణుడు పారిజాతవృక్షాన్ని సత్యభామ అంతఃపురం బయట నాటుతాడు.

Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే
కృష్ణుడు తెచ్చిన పారిజాత వృక్షం ఎక్కడుంది-ప్రత్యేకతలేంటి?

  • ఇప్పుడీ పారిజాత వృక్షం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, బారబంకి జిల్లా కింటూర్ లో ఉంది
  • ప్రపంచంలో కెల్లా ఎంతో విలక్షణమైన వృక్షం ఇదేనని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి మరి చెప్పారు
  • శాఖ, ముక్కల నుంచి పునరుత్పత్తి గాని, పండ్లు ఉండవు
  • ఈ చెట్టు కింది భాగంలో చెట్టు ఆకులు చేతి ఐదు వేళ్ళని పోలి ఉంటాయి, పూలకు ఐదు రేకులుంటాయి
  • ఈ వృక్షం జూన్ ,జులై నెలల్లో మాత్రమే వికసిస్తుంది
  • ఈ చెట్టు పూలు బంగారు, తెలుపు రంగులో కనువిందుగా ఉంటాయి. వీటి సువాసన చాలా దూరం వరకు వ్యాపిస్తుంది.
  • ఈ వృక్షం వయసు దాదాపు వెయ్యి సంవత్సరాల నుంచి ఐదు వేల సంవత్సరాలు.
  • వృక్షం కాండం చుట్టుకొలత 50 అడుగులు, ఎత్తు 45 అడుగులు
  • ఈ చెట్టు శాఖలు, ఆకులూ కుచించుకుపోయి కాండంలో కలసిపోవడమే కానీ ఎండిపోవడం, రాలిపోవడం జరగవు.

ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే ఇది దేవతా వృక్షం అయింది.

Also Read: అమ్మవారి వెంటే అయ్యవారు, ఇంత ప్రేమ పొందడం ఎవరికి సాధ్యం!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Chairman: టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియామకం, కొత్త పాలకమండలి సభ్యులు వీరే
TTD Chairman: టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియామకం, కొత్త పాలకమండలి సభ్యులు వీరే
Telangana Group 3 : తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ ఇదిగో
తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ ఇదిగో
Jai Hanuman First Look : 'జై హనుమాన్' నుంచి దివాళి బ్లాస్ట్ వచ్చేసింది... 'హనుమాన్'గా 'కాంతారా' స్టార్ లుక్ అదుర్స్
'జై హనుమాన్' నుంచి దివాళి బ్లాస్ట్ వచ్చేసింది... 'హనుమాన్'గా 'కాంతారా' స్టార్ లుక్ అదుర్స్
Harish Rao Chit Chat: రేవంత్ కుర్చీ కిందే బాంబు - పాదయాత్రకు డేటు, టైం చెప్పు - రేవంత్‌కు హరీష్ సవాల్
రేవంత్ కుర్చీ కిందే బాంబు - పాదయాత్రకు డేటు, టైం చెప్పు - రేవంత్‌కు హరీష్ సవాల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SS Rajamouli Lion Update | వైల్డ్ సఫారీ ఫోటోలతో హింట్స్ ఇస్తున్న రాజమౌళి | ABP Desamవివాదంలో సాయి పల్లవి, పాత వీడియో తీసి విపరీతంగా ట్రోల్రతన్‌ టాటా వీలునామాలో శంతను పేరు, ఏమిచ్చారంటే?మహేశ్ రాజమౌళి సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Chairman: టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియామకం, కొత్త పాలకమండలి సభ్యులు వీరే
TTD Chairman: టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియామకం, కొత్త పాలకమండలి సభ్యులు వీరే
Telangana Group 3 : తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ ఇదిగో
తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ ఇదిగో
Jai Hanuman First Look : 'జై హనుమాన్' నుంచి దివాళి బ్లాస్ట్ వచ్చేసింది... 'హనుమాన్'గా 'కాంతారా' స్టార్ లుక్ అదుర్స్
'జై హనుమాన్' నుంచి దివాళి బ్లాస్ట్ వచ్చేసింది... 'హనుమాన్'గా 'కాంతారా' స్టార్ లుక్ అదుర్స్
Harish Rao Chit Chat: రేవంత్ కుర్చీ కిందే బాంబు - పాదయాత్రకు డేటు, టైం చెప్పు - రేవంత్‌కు హరీష్ సవాల్
రేవంత్ కుర్చీ కిందే బాంబు - పాదయాత్రకు డేటు, టైం చెప్పు - రేవంత్‌కు హరీష్ సవాల్
New Kia Carnival Sales: ఆకాశాన్నంటే ధర - అయినా అవుట్ ఆఫ్ స్టాక్ - మార్కెట్లో ఈ కియా కారుకు సూపర్ డిమాండ్‌!
ఆకాశాన్నంటే ధర - అయినా అవుట్ ఆఫ్ స్టాక్ - మార్కెట్లో ఈ కియా కారుకు సూపర్ డిమాండ్‌!
YSRCP: విజయమ్మ ఇచ్చిన షాక్‌తో వైసీపీలో డైలమా - ఎలా స్పందించాలో అర్థం కాని నేతలు ! సైలెంట్
విజయమ్మ ఇచ్చిన షాక్‌తో వైసీపీలో డైలమా - ఎలా స్పందించాలో అర్థం కాని నేతలు ! సైలెంట్
Apple Intelligence Devices: ఐవోఎస్ 18.1 వచ్చేసింది - యాపిల్ ఇంటెలిజెన్స్ ఇక అందరికీ అందుబాటులో!
ఐవోఎస్ 18.1 వచ్చేసింది - యాపిల్ ఇంటెలిజెన్స్ ఇక అందరికీ అందుబాటులో!
SSMB 29: సింహాన్నిచూపిస్తూ హింట్... రాజమౌళి కొత్త పోస్ట్ వైరల్ - మహేష్ బాబు పాత్ర ఇదేనా?
సింహాన్నిచూపిస్తూ హింట్... రాజమౌళి కొత్త పోస్ట్ వైరల్ - మహేష్ బాబు పాత్ర ఇదేనా?
Embed widget