Panchang 2nd July 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, ఏలినాటి, అష్టమ, అర్దాష్టమ శనిదోష నివారణ స్తోత్రం
కొత్తగా పనులు ప్రారంభించేవారు, దూరప్రయాణాలు చేసేవారు, నిత్య పూజలు చేసేవారు ఈరోజు తిథి,వార, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం తెలుసుకోవాలి అనుకుంటారు.వారికోసం ఏబీపీ దేశం అందిస్తున్న వివారిలివి....
జులై 2 శనివారం పంచాంగం
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
తేదీ: 02-07 -2022
వారం: శనివారం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, ఆషాడమాసం
తిథి : తదియ మధ్యాహ్నం 12.22 వరకు ఆ తర్వాత చవితి
వారం : శనివారం
నక్షత్రం: ఆశ్లేష రాత్రి తెల్లవారుజామున 4.24 వరకు తదుపరి మఖ
వర్జ్యం : సాయంత్రం 4.10 నుంచి 5.55 వరకు
దుర్ముహూర్తం : ఉదయం 7.16 వరకు
అమృతఘడియలు : రాత్రి 2.39 నుంచి 4.27 వరకు
సూర్యోదయం: 05:33
సూర్యాస్తమయం : 06:34
( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)
Also Read: ఈ రాశివారికి గౌరవ మర్యాదలు, ఆ రాశివారికి ధననష్టం - జులై నెలలో మీ రాశిఫలితం తెలుసుకోండి
శనిదోష నివారణకు పఠించాల్సిన శ్లోకాలు
శని దోషం ఉన్నవారు సుఖశాంతులు లేకుండా బాధపడుతుంటారు.కష్ట నష్టాల నుంచి బయపడేందుకు దేవాలయాల్లో శాంతులు, ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే శనివారం రోజు ప్రత్యేక పూజలు మాత్రమే కాదు శనిధ్యానం చేసినా ఆ ప్రభావం తగ్గుతుందని చెబుతారు. ఇవి కేవలం శనివారం మాత్రమే కాదు నిత్యం చదువుకోవచ్చు.
శని గాయత్రి
ఓం ఖగథ్వజాయ విద్మహే ఖఢ్గ హస్తాయ ధీమహి
తన్నో: మంద: ప్రచోదయాత్
ఓం శనైశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి
తన్నో: మంద: ప్రచోదయాత్
శనిధ్యానం శ్లోకాలు
సూర్యపుత్రో దీర్ఘదేహః
విశాలక్ష శ్శివప్రియ:
మందచార: ప్రసన్నాత్మా
పీడాం దహతు మే శని:
శన్యారిష్టే తు సంప్రాప్తే
శనిపూజాంచ కారయేత్
శనిధ్యానం ప్రవక్ష్యామి
ప్రాణి పీడోపశాంతయే
నీలాంజన సమాభాసం
రవిపుత్రం యమాగ్రజం
చాయా మార్తాండ సంభూతం
తన్నమామి శనైశ్చరం!
నమస్తే రౌద్ర దేహాయ
నమస్తే చాంతకాయచ
నమస్తే యమ సంజ్ఞాయ
నమస్తే సౌరాయే విభో !!
నమస్తే మంద సంజ్ఞాయ
శనైశ్చర నమోస్తు
ప్రసాదం మమదేవేశ
దీనస్య ప్రణతస్యచ!!
నమస్తే కోణ సంస్థాయ
పింగళాయ నమోస్తుతే
నమస్తే బభ్రు రూపాయ
కృష్ణాయచ నమోస్తుతే !!
నిత్యం ఈ శ్లోకాలు చదవడం వల్ల ఏలినాటి, అష్టమ, అర్దాష్టమ శనిదోష నివారణతో పాటూ అనుకున్న కార్యాలు నెరవేరుతాయని పండితులు చెబుతారు. శని దోషం నుంచి బయటపడేందుకు హనుమాన్ చాలీసా చదువుకోవడం వలన మంచి జరుగుతుందని పండితులు చెబుతారు.
Also Read: జులై నెలలో ఈ రాశులవారికి అవమానం, ధనవ్యయం- మీ రాశిఫలితం తెలుసుకోండి
Also Read: జూలైలో పుట్టినవారు కష్టాలు పడతారు కానీ మీరు ఓ అద్భుతం అని మీకు తెలుసా!