Panchang 25June 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, గ్రహదోషాలను తొలగించే నవగ్రహ శ్లోకం
కొత్తగా పనులు ప్రారంభించేవారు, దూరప్రయాణాలు చేసేవారు, నిత్య పూజలు చేసేవారు ఈరోజు తిథి,వార, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం తెలుసుకోవాలి అనుకుంటారు.వారికోసం ఏబీపీ దేశం అందిస్తున్న వివారిలివి..
జూన్ 25 శనివారం పంచాంగం
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
తేదీ: 25- 06 - 2022
వారం: శనివారం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం
తిథి : ద్వాదశి శనివారం రాత్రి 1.16 వరకు తదుపరి త్రయోదశి
వారం : శనివారం
నక్షత్రం: భరణి 11.49 వరకు తదుపరి కృత్తిక
వర్జ్యం : రాత్రి 12.53 నుంచి 2.37 వరకు తిరిగి రాత్రి 8.55 నుంచి 10.34
దుర్ముహూర్తం : ఉదయం 7.14 వరకు
అమృతఘడియలు : ఉదయం 6.51 నుంచి 8.30 వరకు
సూర్యోదయం: 05:30
సూర్యాస్తమయం : 06:33
( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)
Also Read: ఈ ఆలయం నుంచి వారణాసికి సొరంగ మార్గం! ఇక్కడ పుష్కరిణిలో అస్తికలు కలిపితే గంగలో కలిపినట్టే!
గ్రహదోషాల నుంచి విముక్తి పొందాలంటే నిత్యం చదవాల్సిన శ్లోకం
శ్లోకం
ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||
సూర్యుడు
జపాకుసుమ సంకాశం | కాశ్యపేయం మహాద్యుతిమ్
తమో రిం సర్వపాపఘ్నం | ప్రణతోస్మి దివాకరం ||
చంద్రుడు
దధి శంఖ తుషారాభం | క్షీరోదార్ణవ సంభవమ్
నమామి శశినం సోమం | శంభోర్మకుట భూషణం ||
కుుజుడు
ధరణీగర్భ సంభూతం | విద్యుత్కాంతి సమప్రభమ్
కుమారం శక్తిహస్తం | తం మంగళం ప్రణమామ్యహం ||
Also Read: సోమవారం, శనివారం గణపతిని ఇలా పూజిస్తే శనిబాధలతో పాటూ కష్టాలన్నీ తొలగిపోతాయట…
బుధుడు
ప్రియంగు కలికాశ్యామం | రూపేణా ప్రతిమం బుధం
సౌమ్యం సత్వగుణోపేతం | తం బుధం ప్రణమామ్యహం ||
గురు
దేవానాంచ ఋషీణాంచ | గురుం కాంచన సన్నిభం
బుద్ధిమంతం త్రిలోకేశం | తం నమామి బృహస్పతిం ||
శుక్రుడు
హిమకుంద మృణాళాభం | దైత్యానాం పరమం గురుం
సర్వ శాస్త్ర ప్రవక్తారం | భార్గవం ప్రణమామ్యహం ||
శని
నీలాంజన సమాభాసం | రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం | తం నమామి శనైశ్చరం ||
రాహు
అర్ధకాయం మహావీరం | చంద్రాదిత్య విమర్దనం
సింహికాగర్భ సంభూతం | తం రాహుం ప్రణమామ్యహం ||
కేతు
ఫలాశ పుష్ప సంకాశం | తారకాగ్రహ మస్తకం
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం | తం కేతుం ప్రణమామ్యహం ||
నవగ్రహాల ఆరాధన వల్ల మంచే జరుగుతుంది కానీ చెడుమాత్రం జరగదన్నది పండితుల మాట. నిత్యం ఈ శ్లోకం మొత్తం చదువుకుంటే చాలామంచిదని లేదంటే మీ గ్రహస్థితిని బట్టి అవసరమైన శ్లోకం చదువుతున్నా చాలంటారు.
Also Read: దొంగతనం, కామశాస్త్రం, వశీకరణం, శకునశాస్త్రం సహా 64 కళలివే