అన్వేషించండి

Panchang 13th June 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శివ అక్షరమాల స్తోత్రం

కొత్తగా పనులు ప్రారంభించేవారు, దూరప్రయాణాలు చేసేవారు, నిత్య పూజలు చేసేవారు ఈరోజు తిథి,వార, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం తెలుసుకోవాలి అనుకుంటారు.వారికోసం ఏబీపీ దేశం అందిస్తున్న వివారిలివి..

జూన్ 13 సోమవారం పంచాంగం

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు

తేదీ: 13- 06 - 2022
వారం:  సోమవారం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం

తిథి  : చతుర్థశి  సోమవారం రాత్రి 8.03 వరకు తదుపరి పౌర్ణమి
వారం :  సోమవారం 
నక్షత్రం:  అనూరాధ రాత్రి 8.57 వరకు తదుపరి జ్యేష్ట 
వర్జ్యం :  రాత్రి 2.11 నుంచి 3.41 వరకు
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.25 నుంచి 1.17 వరకూ తిరిగి 3.02 నుంచి 3.54 వరకు
అమృతఘడియలు  :  మధ్యాహ్నం  11.07 నుంచి 12.37 వరకు
సూర్యోదయం: 05:29
సూర్యాస్తమయం : 06:౩౦

( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)

Alos Read: శని తిరోగమనం ఈ రాశులవారికి సంపద, సంతోషాన్నిస్తుంది

Also Read:  శని తిరోగమనం, ఈ రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి

సోమవారం శివుడికి అత్యంత ప్రీతకరమైన రోజు. ఈ రోజు శివుడికి సంబంధించిన ఓ శ్లోకాలు చదువుకున్నా శుభమే అంటారు పండితులు....

శివ అక్షరమాల స్తోత్రం

సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ||
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ||

అద్భుతవిగ్రహ అమరాధీశ్వర, అగణితగుణగణ అమృతశివ 
ఆనందామృత ఆశ్రితరక్షక ఆత్మానంద మహేశశివ
ఇందుకళాధర ఇంద్రాదిప్రియ, సుందరరూప సురేశశివ 
ఈశసురేశమహేశ జనప్రియ, కేశవసేవిత పాదశివ (2) | సాంబ |

ఉరగాదిప్రియ భూషణ శంకర, నరకవినాశ నటేశశివ 
ఊర్జితదానవనాశ పరాత్పర, ఆర్జిత పాపవినాశశివ 
ఋగ్వేదశ్రుతి మౌళి విభూషణ, రవిచంద్రాగ్ని త్రినేత్రశివ 
ౠపమనాది ప్రపంచ విలక్షణ, తాపనివారణ తత్వశివ (2) | సాంబ |

లింగస్వరూప సర్వ బుధప్రియ మంగళ మూర్తి మహేశశివ
ళూతాధీశ్వర రూపప్రియశివ వేదాంతప్రియ వేద్యశివ 
ఏకానేక స్వరూప విశ్వేశ్వర లోహిహృదిప్రియ వాసశివ 
ఐశ్వర్యాశ్రయ చిన్మయ చిద్ఘన అచ్యుతానంత మహేశశివ (2) | సాంబ |

ఓంకారప్రియ ఉరగవిభూషణ, హ్రీంకారాది మహేశశివ 
ఔరసలాలిత అంతకనాశన, గౌరిసమేత గిరీశశివ 
అంబరవాస చిదంబరనాయక, తుంబురునారద సేవ్యశివ
ఆహారప్రియ ఆదిగిరీశ్వర, భోగాదిప్రియ పూర్ణశివ (2) | సాంబ |

కమలాక్షార్చిత కైలాసప్రియ, కరుణాసాగర కాంతిశివ 
ఖడ్గశూల మృగ ఢక్కాధ్యాయుత, విక్రమరూప విశ్వేశశివ 
గంగాగిరిసుత వల్లభ గుణహిత, శంకరసర్వ జనేశశివ 
ఘాతకభంజన పాతకనాశన, గౌరీసమేత గిరిశశివ
జ్ఞజ్ఞాశ్రిత శృతిమౌళి విభూషణ, వేదస్వరూప విశ్వేశశివ (2) | సాంబ |

చండ వినాశన సకల జనప్రియ, మండలాధీశ మహేశశివ
ఛత్రకిరీట సుకుండలశోభిత, పుత్రప్రియ భువనేశశివ 
జన్మజరామృతి నాశనకల్మష, జరహితతాప వినాశశివ 
ఝంకారాశ్రయ భృంగిరిట ప్రియ, ఒంకారేశ మహేశశివ 
జ్ఞానాజ్ఞాన వినాశక నిర్మల, దీనజనప్రియ దీప్తశివ (2) | సాంబ |

టంకాధ్యాయుత ధారణ సత్వర, హ్రీంకారాది సురేశశివ
ఠంకస్వరూప సహకారోత్తమ, వాగీశ్వర వరదేశశివ 
డంభ వినాశన డిండిమభూషణ, అంబరవాస చిదీశశివ
ఢంఢం డమరుక ధరణీనిశ్చల, ఢుంఢి వినాయక సేవ్యశివ
నళిన విలోచన నటనమనోహర, అళికులభూషణ అమృతశివ (2) | సాంబ |

తత్వమసిత్యాది వాక్య స్వరూపగ, నిత్యానంద మహేశశివ 
స్థావరజంగమ భువనవిలక్షణ, భావుక మునివర సేవ్యశివ 
దుఃఖవినాశన దళితమనోన్మన, చందనలేపిత చరణశివ 
ధరణీధర శుభధవళ విభాస్వర, ధనదాది ప్రియ దానశివ 
నానామణిగణ భూషణ నిర్గుణ, నటన జనప్రియ నాట్యశివ (2) | సాంబ |

పన్నగభూషణ పార్వతినాయక, పరమానంద పరేశశివ
ఫాలవిలోచన భానుకోటి ప్రభ, హాలాహలధర అమృతశివ 
బంధవినాశన బృహదీసామర, స్కందాదిప్రియ కనకశివ 
భస్మవిలేపన భవభయనాశన, విస్మయరూప విశ్వేశశివ 
మన్మథనాశన మధుపానప్రియ, సుందర పర్వతవాసశివ (2) | సాంబ |

యతిజన హృదయ నివాసిత ఈశ్వర విధి విష్ణ్వాది సురేశశివ 
రామేశ్వర రమణీయ ముఖాంబుజ, సోమేశ్వర సుకృతేశశివ
లంకాధీశ్వర సురగణసేవిత, లావణ్యామృత లసితశివ
వరదాభయకర వాసుకిభూషణ, వనమాలాది విభూషశివ (2) | సాంబ |

శాంతిస్వరూప జగత్రయ చిన్మయ కాంతిమతిప్రియ కనకశివ 
షణ్ముఖజనక సురేంద్రమునిప్రియ, షాడ్గుణ్యాది సమేతశివ 
సంసారార్ణవ నాశన శాశ్వత, సాధుహృది ప్రియవాసశివ 
హర పురుషోత్తమ అద్వైతామృత, పూర్ణమురారి సుసేవ్యశివ 
ళాళితభక్త జనేశనిజేశ్వర, కాళినటేశ్వర కామశివ 
క్షరరూపాది ప్రియాన్వితసుందర, సాక్షిజగత్రయ స్వామిశివ (2) | సాంబ |

సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ||
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ||

Also Read: జూన్ 15 నుంచి రాశిమారనున్న సూర్యుడు, ఈ రాశులవారికి అన్నీ అనుకూల ఫలితాలే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget