New Year 2023: ఈ నాలుగు లక్షణాలు ఉంటే ఆర్థికంగా ఎప్పటికీ ఎదగలేరు, కొత్త ఏడాదిలో అయినా ఈ మార్పులు చేయండి!
ఇంట్లో ప్రశాంతత లభించాలన్నా, ఆర్థికంగా ఓ మెట్టు ఎదగాలన్నా భారీగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు చిన్న చిన్న మార్పులు చేస్తే చాలు లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మీపై ఉంటాయి..అవేంటో చూద్దాం..
![New Year 2023: ఈ నాలుగు లక్షణాలు ఉంటే ఆర్థికంగా ఎప్పటికీ ఎదగలేరు, కొత్త ఏడాదిలో అయినా ఈ మార్పులు చేయండి! New Year 2023: If you have these four characteristics, you will never grow financially, make these changes even in the new year New Year 2023: ఈ నాలుగు లక్షణాలు ఉంటే ఆర్థికంగా ఎప్పటికీ ఎదగలేరు, కొత్త ఏడాదిలో అయినా ఈ మార్పులు చేయండి!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/29/8d8740fb82f033f9a16d492dfc3bf6361672295793947217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
New Year 2023: ఎంత కష్టపడినా ఫలితం ఉండడం లేదని, లక్ష్మీ అనుగ్రహం కలగడం లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. అయితే వాస్తు శాస్త్ర నిపుణులు, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు లక్ష్మీ కటాక్షం కలగడానికి అనేక సూచనలు చేస్తున్నారు.ఎలా ఉండకూడదో హెచ్చరిస్తూనే, ఎలా ఉండాలో కూడా సూచించారు. ఇలా చేస్తే ఇంటికి పట్టిన దరిద్రం వదలడమే కాదు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెబుతారు.
Also Read: కామన్ వచ్చే 10 కలలు ఇవి, వీటిలో వచ్చిన కలను బట్టి ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోవచ్చు!
- ఇంటి ఇల్లాలు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రపరిచి ముగ్గు వేసి దేవుడికి దీపం పెట్టాలి. బూజు, దుమ్ముపట్టిన ఇళ్లలో దరిద్ర దేవత నివసిస్తుంది అందుకే ఇంటిని శుభ్రంగా ఉంచాలి. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది
- చిరిగిన, మాసిన వస్త్రాలు ధిరించే వారింట జ్యేష్టా దేవి వదిలివెళ్లదు..అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి కొలువుండదు
- తెగిన చెప్పులను వాడడం, ఇంట్లో ఉంచుకోవడం, వేరేవారి చెప్పులు వేసుకోవడం దరిద్రానికి హేతువు . సింహ ద్వారం దగ్గర చెప్పులు చిందర వందరగా పడయకూడదు
గడప లక్ష్మి స్వరూపం కనుక గడప తొక్కి ఇంట్లోకి రావడం, గడప మీద కాలు వేయడం, గడపకు అటు ఇటు చెరో కాలు వేసి నుంచోవడం చేయరాదు. - పసుపు, కుంకుమ ఉన్న గడపలు లక్ష్మి దేవికి ఆహ్వానం పలుకుతాయి. అందువల్ల ప్రతి శుక్రవారం గడపకు పసుపు, కుంకుమ తో అలంకరించాలి.
- భోజనం చేసే పళ్లెం అటూ ఇటూ కదలకూడదు. కదిలే పళ్లెంలో అసలు భోజనం చేయకూడదు. భోజనం తర్వాత వేళ్లు నాకకూడదు
- ప్రధాన ద్వారం తలుపు మీద ఎర్రని కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేస్తే ఈ ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి
- పనికిరాని వస్తువులు, విరిగి పోయిన, చెడిపోయిన వస్తువులు ఎప్పటికప్పుడు బయట పడేయాలి
- ఇంటి ఇల్లాలు గట్టిగా గొంతు పెట్టి మాట్లాడడం, నట్టింట్లో చెడు మాటలు, చెడు తిట్లు తిట్టడం చేయకూడదు
- ఏ ఇంట్లో అయితే భార్య-భర్త నిరంతరం కోట్లాడుకుంటారో ఈ ఇంట్లో ఎప్పటికీ మంచి జరగదు
- అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఇరు సంధ్యలలో భుజించేవారు, నిద్రించే వారు, బద్దకస్తులు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మి దేవి ఉండదు
- ఇరు సంధ్యలలో దీపారాధన చేసే ఇంట్లో లక్ష్మి దేవి కొలువై ఉంటుంది.సాయం సంధ్య వేళల్లో సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసిన మంచిదే
- అతిగా మాట్లాడే వారు, గురువులను-పెద్దలను అగౌరవ పరిచేవారు, జూదరులు, అతిగా నిద్రపోయేవారు ఉండేచోట లక్ష్మీదేవి కరుణ అస్సలు ఉండదు
- చిల్లర పైసలను, పువ్వులను, అన్నాన్ని నిర్లక్ష్యంగా పడేసేవారు ఆర్థికంగా ఎప్పటికీ సక్సెస్ కాలేరు
Also Read: కలలో డబ్బు-బంగారం కనిపిస్తే ఏమవుతుంది, శుభమా-అశుభమా!
నోట్: పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం...
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)