అన్వేషించండి

Navratri Day 7 Saraswati Devi : అక్టోబరు 09 మూలా నక్షత్రం - సరస్వతీ పూజ..ఈ రోజు పిల్లలతో ఈ శ్లోకాలు చదివించండి!

Navratri Day 7 : మూలా నక్షత్రం రోజు నుంచి విజయదశమి వరకు విశేష పుణ్య దినాలుగా భావిస్తారు. మూలా నక్షత్రం రోజు సరస్వతిగా దర్శనం ఇస్తోంది ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గాదేవి.

Dussehra 2024 - శరన్నవరాత్రుల్లో ఏడో రోజు సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ

'సర్వ విద్యా స్వరూపా యా సా ప దేవీ సరస్వతీ'

సంగీతం, సాహిత్యం, మేధస్సు, ప్రతిభ, స్మృతి, వ్యాఖ్యానం, బోధనాశక్తి ఇవన్నీ సరస్వతీ కటాక్షంతో లభించేవే. 
 
సరస్వతి చేతిలో వీణ సంగీత విద్యలకు, పుస్తకం లౌకిక విద్యలు, అక్షమాల ఆధ్యాత్మిక విద్యలకు సంకేతంగా చెబుతారు. అజ్ఞానం మనిషికి   జాడ్యాన్ని ఇస్తే... జ్ఞానం ఆత్మోద్ధరణకు సంకేతంగా మారుతుంది. 

పిల్లలకు పుస్తకదానం చేయడం ఈరోజు  ఉత్తమం.  సామూహిక అక్షరాభ్యాసాలు కూడా నిర్వహిస్తారు.


శ్లోకం
సరస్వతి నమ: స్తుభ్యం వరదే కామరూపిణి
విద్యరంభం కరిశ్యామి సిద్ధిర్భవతు మే సదా
పద్మపత్ర విశాలాక్షి పద్మ కేసర వర్ణని
నిత్యం పద్మాలయాం దేవీ సామం పాతు సరస్వతి

Also Read: సతీదేవి కురులు పడిన ప్రదేశం.. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి - దసరాల్లో ఈ అమ్మవారి వైభోగం చూసేందుకు రెండు కళ్లు సరిపోవ్!

 శ్రీ సరస్వతీ ద్వాదశనామ స్తోత్రం 

సరస్వతీ త్వయం దృష్ట్యా వీణాపుస్తకధారిణీ |
హంసవాహ సమాయుక్తా విద్యాదానకరీ మమ ||  

ప్రథమం భారతీ నామా ద్వితీయం చ సరస్వతీ |
తృతీయం శారదాదేవీ చతుర్థం హంసవాహనా ||  

పంచమం జగతీఖ్యాతం షష్ఠం వాగీశ్వరీ తథా |
కౌమారీ సప్తమం ప్రోక్తమష్టమం బ్రహ్మచారిణీ ||  

నవమం బుద్ధిధాత్రీ చ దశమం వరదాయినీ |
ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ ||  

బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |
సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ |
సా మే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ ||  

Also Read: అష్టాదశ శక్తిపీఠం - సతీదేవి చెవిపోగు పడిన ప్రదేశం - వివాహం కానివారికి ప్రత్యేకం!

సరస్వతి స్తోత్రం

యా కుందేందు తుషారహార ధవళా యాశుభ్ర వస్త్రావృతా
యా వీణావర దండమండితకరా యా శ్వేతపద్మాసనా ||

యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైస్సదా పూజితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా ||

దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణినిభైరక్షమాలాందధానా
హస్తేనైకేన పద్మం సితమపిచ శుకం పుస్తకం చాపరేణ |

భాసా కుందేందుశంఖస్ఫటికమణినిభా భాసమానాఽసమానా
సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా ||

సరస్వతీ సరసిజకేసరప్రభా తపస్వినీ సితకమలాసనప్రియా |
ఘనస్తనీ కమలవిలోలలోచనా మనస్వినీ భవతు వరప్రసాదినీ ||

 సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి |
 విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||

 సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమః |
శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః ||

నిత్యానందే నిరాధారే నిష్కళాయై నమో నమః |
విద్యాధరే విశాలాక్షి శుద్ధజ్ఞానే నమో నమః ||

 శుద్ధస్ఫటికరూపాయై సూక్ష్మరూపే నమో నమః |
శబ్దబ్రహ్మి చతుర్హస్తే సర్వసిద్ధ్యై నమో నమః ||

 ముక్తాలంకృత సర్వాంగ్యై మూలాధారే నమో నమః |
మూలమంత్రస్వరూపాయై మూలశక్త్యై నమో నమః ||

 మనోన్మని మహాభోగే వాగీశ్వరి నమో నమః |
వాగ్మ్యై వరదహస్తాయై వరదాయై నమో నమః ||

 వేదాయై వేదరూపాయై వేదాంతాయై నమో నమః |
గుణదోషవివర్జిన్యై గుణదీప్త్యై నమో నమః ||

 సర్వజ్ఞానే సదానందే సర్వరూపే నమో నమః |
సంపన్నాయై కుమార్యైచ సర్వజ్ఞేతే నమోనమః ||

 యోగానార్య ఉమాదేవ్యై యోగానందే నమో నమః |
 దివ్యజ్ఞాన త్రినేత్రాయై దివ్యమూర్త్యై నమో నమః ||

 అర్ధచంద్రజటాధారి చంద్రబింబే నమో నమః |
చంద్రాదిత్యజటాధారి చంద్రబింబే నమో నమః ||

 అణురూపే మహారూపే విశ్వరూపే నమో నమః |
అణిమాద్యష్ట సిద్ధాయై ఆనందాయై నమో నమః ||

జ్ఞానవిజ్ఞాన రూపాయై జ్ఞానమూర్తే నమోనమః|
నానాశాస్త్ర స్వరూపాయై నానారూపే నమో నమః ||

పద్మజా పద్మవంశాచ పద్మరూపే నమోనమః |
పరమేష్ఠ్యై పరామూర్త్యై నమస్తే పాపనాశినీ ||

 మహాదేవ్యై మహాకాళ్యై మహాలక్ష్మ్యై నమో నమః |
 బ్రహ్మవిష్ణుశివాయై చ బ్రహ్మనార్యై నమో నమః ||

కమలాకరపుష్పా చ కామరూపే నమో నమః |
కపాలికర్మదీప్తాయై కర్మదాయై నమో నమః ||

సాయం ప్రాతః పఠేన్నిత్యం షణ్మాసాత్సిద్ధిరుచ్యతే |
చోరవ్యాఘ్రభయం నాస్తి పఠతాం శృణ్వతామపి ||

ఇత్థం సరస్వతీస్తోత్రమగస్త్యమునివాచకమ్ |
సర్వసిద్ధికరం నౄణాం సర్వపాపప్రణాశనమ్ ||

సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు మీ బంధుమిత్రులకు ఇలా తెలియజేయండి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
India vs Canada: కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
India vs Canada: కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Rains Update: బలహీనపడిన అల్పపీడనం, నేడు ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు- తెలంగాణలో వాతావరణం ఇలా
బలహీనపడిన అల్పపీడనం, నేడు ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు- తెలంగాణలో వాతావరణం ఇలా
Indiramma Houses: అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
Embed widget