News
News
X

Navratri 2022: ఈ విశ్వాన్ని సృష్టించిన అమ్మే కూష్మాండ దుర్గ, నవదుర్గల్లో ఈమె నాల్గవది

Kushmanda Durga: శరన్నవరాత్రుల్లో నాల్గవ రోజున అమ్మవారిని 'కూష్మాండ దుర్గ' గా అలంకరించి పూజిస్తారు. నవదుర్గల్లో ఈమె నాల్గవది.

FOLLOW US: 

నవదుర్గ శ్లోకం
ప్రథమా శైలపుత్రీచ|ద్వితీయా బ్రహ్మచారిణీ|
తృతీయా చంద్రఘంటేతి| కూష్మాండేతి చతుర్థికీ|
పంచమా స్కందమాతేతి| షష్ఠా కాత్యాయనేతిచ|
సప్తమా కాళరాత్రీచ| అష్టమాచేతి భైరవీ|
నవమా సర్వసిద్ధిశ్చాత్| నవదుర్గా ప్రకీర్తితా|| 

"కు" అంటే చిన్న
"ఊష్మ" అంటే శక్తి
"అండా" అంటే విశ్వం
తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించింది అని అర్ధం. ఈ అమ్మవారిని పూజిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, శక్తీ లభిస్తాయని భక్తుల విశ్వాసం. 
ఇంకా చెప్పాలంటే ఈ లోకాన్ని సృష్టించిన తల్లి అని ఈ పేరుకి అర్థం.అమ్మవారి తేజస్సే సూర్యుడు అని అంటారు. అందుకు ప్రతీకగా కూష్మాండ దేవి ఆ సూర్యుని ధరించి కనిపిస్తుంది. ఈ దేవిని కొలిచినవారికి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి

కూష్మాండ దుర్గ... పులిని వాహనంపై కూర్చుని ఉంటుంది. అమ్మవారి శక్తికి నిదర్శనంగా కనిపించే ఎనిమిది చేతుల్లో  విల్లు , బాణం, చక్రం, గద, తామరపువ్వు, జపమాల, కమండలం,అమృత కలశం ఉంటుంది. అష్ట భుజాలు కలిగి ఉన్నందున అష్ట్భుజాదేవిగా పిలుస్తారు. ఈదేవికి (గుమ్మడి కాయ) కూష్మాండ బలి ఎంతో ప్రీతిదాయకమైనది. అందుకే కూష్మాండ దుర్గగా పూజిస్తారు. 

Also Read: పార్వతి ముచ్చటపడిందని చంద్రుడిని తీసి అలంకరించిన శివుడు, నవదుర్గల్లో మూడవది చంద్రఘంట

News Reels

 కూష్మాండ రూపం ( Kushmanda Durga)
'సురాసంపూర్ణ కలశం రుధిరాపుత్రమేవచ
దధనా హస్త పద్మాభ్యం కూష్మాండా శుభదాస్తుమ్ '

త్రిమూర్తులు, త్రిమాతల సృష్టి మహాకాళీ కుష్మాండా దుర్గాదేవి ఎడమ కంటి కాంతి నుంచి నల్లటి రూపంతో ఒక అమ్మవారు జన్మించింది. ఈమెకు కూష్మాండ దేవి మాహాకాళి అని పేరు పెట్టింది. చాలా ఉగ్ర స్వరూపమైనది. ఈ అమ్మవారికి పది తలలు, పది చేతులు, పది కాళ్ళు, 30 కళ్ళు, 30 చేతి వేళ్ళు, 30 కాలి వేళ్ళు, చిందరవందరగా ఉండే జుట్టుతో నాలుకలు బయట పెట్టి కనిపిస్తుంది. మండుతున్న చితిపై కూర్చుని ఉంటుంది ఈ అమ్మవారు. ఆయుధం, త్రిశూలం, చక్రం, బాణం, డాలు, తెంచిన రాక్షసుని తల, పుర్రె, నత్త గుల్ల, ధనువు, కర్ర ధరించి ఉంటుంది కాళీ.

కూష్మాండ దుర్గాదేవి మూడో కంటి నుంచి ఉద్భవించిన రూపం... బంగారు వర్ణంలో 18 చేతులతో ఉంది. ఈమె కాషాయ రంగు వస్త్రాలు, కవచం, కిరీటం ధరించింది. ఆ చేతుల్లో గొడ్డలి, త్రిశూలం, చక్రం, గద, పిడుగు, బాణం, ఖడ్గం, కమలం, జపమాల, నత్తగుల్ల, ఘంట, ఉచ్చు, బల్లెం, కొరడా, ధనువు, డాలు, మధుకలశం, నీటిపాత్రలు పట్టుకుని ఉంది. కమలంపై కూర్చున్న ఈ అమ్మవారు మధువును తాగి, గట్టిగా గర్జించిందిట. అలా ఉన్న ఆ అమ్మవారికి కూష్మాండా దేవి మహాలక్ష్మి అని నామకరణం చేసింది. 

కూష్మాండదేవి కుడి కంటి కాంతి నుంచి శాంతమూర్తి అయిన తెల్లని శరీర ఛాయ కలిగిన ఒక స్త్రీ జనించింది. ఈమెకు మహాసరస్వతి అని పేరు పెట్టింది అమ్మ. తెల్లటి వస్త్రాలు ధరించి తలపై చంద్రవంకతో ఉన్న ఆమెకు 8 చేతులు ఉన్నాయి. వాటిలో త్రిశూలం, చక్రం, చిన్న ఢమరుకం, నత్తగుల్ల, ఘంట, విల్లు, నాగలి ఉన్నాయి. ఆమె ముఖం చంద్రబింబంలా వెలిగిపోతోంది. ముత్యాల నగలు అలంకరించుకున్న ఆమె రత్నాలతో చేసిన సింహాసనంపై కూర్చుని ఉంది.

కూష్మాండ దేవి దృష్టి మహాకాళిపై పడగానే.. ఆమె నుండి ఒక స్త్రీ, పురుషుడు పుట్టారు. పురుషునికి 5 ముఖాలు, 15 కళ్ళు, 10 చేతులు ఉన్నాయి. అతని చర్మం పులి చర్మంలా ఉంది. అతని మెడ చుట్టూ ఒక పాము ఉంది. తలపై చంద్రవంకను ధరించి ఉన్నాడు. అతని చేతుల్లో గొడ్డలి, జింక, బాణం, ధనువు, త్రిశూలం, పిడుగు, కపాలం, ఢమరుకం, జపమాల, కమండలం ఉన్నాయి. కూష్మాండా దుర్గా అతనికి శివుడు అని పేరు పెట్టింది. మహాకాళీ శరీరం నుంచి పుట్టిన స్త్రీ తెల్లగా ఉండి, నాలుగు చేతుల్లో పాశం, జపమాల పుస్తకం, కమలం ఉన్నాయి. ఆమెకు శక్తి అని పేరు పెట్టింది కుష్మాండా దేవి. ఇలా కలసి పుట్టిన శివుడు, శక్తి(సరస్వతీదేవి)లు అన్నాచెల్లెళ్ళు అని అంటారు. 

Also Read: శివయ్య ప్రేమ గెలిచిన బ్రహ్మచారిణి, ఈ అవతారాన్ని పూజిస్తే సంతోషం, సౌభాగ్యం, సంపద

కూష్మాండ దేవి మహాలక్ష్మిని చూడగానే ఆమె శరీరం నుండి ఒక స్త్రీ, ఒక పురుషుడు వచ్చారు. నాలుగు ముఖాలతో, నాలుగు చేతులతో ఎరుపు రంగు శరీరంతో కాషాయ వస్త్రాలతో ఉన్నాడు. ఖరీదైన నగలు ధరించిన అతను తామరపువ్వు, పుస్తకం, జపమాల, కలశం పట్టుకుని ఉన్నాడు. తనకి బ్రహ్మ అని పేరు పెట్టింది. ఆ స్త్రీకి నాలుగు చేతులు ఉన్నాయి. అందంగా, లేత ఎరుపు వర్ణంలో ఉన్న ఆమె పై రెండు చేతుల్లో తామరమొగ్గలు, కింద రెండు చేతులూ అభయ ముద్రలోనూ ఉన్నాయి. లెక్కలేనన్ని ఆభరణాలు ధరించి ఉంది అమె. కూష్మాండా దేవి ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టి పిలిచింది. ఇలా కలసి పుట్టిన బ్రహ్మ, లక్ష్మీదేవిలు కూడా అన్నాచెల్లెళ్ళే.

ఇంత శక్తివంతమైన కూష్మాండ దేవిని నవరాత్రుల్లో నాల్గవరోజు ఆరాధిస్తే  కీర్తి , ఆరోగ్యం, దీర్ఘాయువు లభిస్తుందని పండితులు చెబుతారు.

Published at : 29 Sep 2022 05:10 AM (IST) Tags: Lord Durga dussehra 2022 puja time dussehra 2022 dates Maha Navmi 2022 Durga Ashtami 2022 Date Chandraghanta Kushmanda Skandamata Katyayani Kalaratri Mahagauri Navratri 2022

సంబంధిత కథనాలు

Subramanya Swamy Temple: 300 ఏళ్ల నాటి కుమార సుబ్రహ్మణ్య స్వామి ఆలయం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Subramanya Swamy Temple: 300 ఏళ్ల నాటి కుమార సుబ్రహ్మణ్య స్వామి ఆలయం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

December 2022 Horoscope: డిసెంబర్ నెల ఈ 5 రాశులవారికి బావుంది, ఆ రాశివారికి అత్యద్భుతంగా ఉంది

December 2022 Horoscope: డిసెంబర్ నెల ఈ 5 రాశులవారికి బావుంది, ఆ రాశివారికి అత్యద్భుతంగా ఉంది

Daily Horoscope Today 28th November 2022: ఈ రాశివారికి ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ, నవంబరు 28 రాశిఫలాలు

Daily Horoscope Today 28th November 2022: ఈ రాశివారికి ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ, నవంబరు 28 రాశిఫలాలు

Kaal Bhairav Astami 2022: డిసెంబరు 1 కాలభైరవాష్టమి, దుర్గణాలు తొలగించి సిరి, సంపదలు ఇచ్చే భైరవుడు

Kaal Bhairav Astami 2022:  డిసెంబరు 1 కాలభైరవాష్టమి, దుర్గణాలు తొలగించి సిరి, సంపదలు ఇచ్చే భైరవుడు

Weekly Horoscope 27 November to December 3: ఈ రాశులవారి జీవితంలో ఊహించని మార్పు వస్తుంది, మేషం నుంచి కన్యా రాశి వరకూ వారఫలాలు

Weekly Horoscope 27 November to December 3: ఈ రాశులవారి జీవితంలో ఊహించని మార్పు వస్తుంది,  మేషం నుంచి కన్యా రాశి వరకూ వారఫలాలు

టాప్ స్టోరీస్

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

AP: ఏపీలో 6,511 పోలిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

AP: ఏపీలో 6,511 పోలిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

Sharmila Arrest : షర్మిల అరెస్ట్ - పాదయాత్ర ఆపబోనన్న వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు !

Sharmila Arrest :   షర్మిల అరెస్ట్ - పాదయాత్ర ఆపబోనన్న వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు !

Yadamma Raju Engagement: ఓ ఇంటివాడు కాబోతున్న కమెడియన్ యాదమ్మ రాజు, ఎంగేజ్మెంట్ పోటోలు వైరల్

Yadamma Raju Engagement: ఓ ఇంటివాడు కాబోతున్న కమెడియన్ యాదమ్మ రాజు, ఎంగేజ్మెంట్ పోటోలు వైరల్