Navaratri 4th day: నాలుగో రోజు లలితా త్రిపురసుందరి అలంకారంలో దుర్గమ్మ - ఈ అవతారం విశిష్టత ఇదే!
Sri Lalita Tripura Sundari Devi Alankaram: శరన్నవరాత్రుల్లో నాలుగో రోజైన ఆదివారం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ లలితా త్రిపురసుందరి అలంకారంలో భక్తులను అనుగ్రహించనుంది. ఈ అవతారం విశిష్టత ఏంటంటే..
Navaratri 4th day Sri Lalita Tripura Sundari Devi Alankaram
ప్రాతః స్మరామి లలితా వదనారవిందం
బింబాధరం పృధుల మౌక్తిక శోభినాసమ్
ఆకర్ణ దీర్ఘ నయనం మణికుండలాఢ్యం
మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్
త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కన్నా ముందే ఉన్న శక్తి..అందుకే లిలితా అమ్మవారిని త్రిపురసుందరి అంటారు. శ్రీచక్ర అధిష్టాన దేవతగా , పంచదశాక్షరి మహామంత్రాది దేవతగా ఉపాసకులను అనుగ్రహిస్తుంది. దుర్గమ్మ సన్నిధిలో ఆదిశంకరాచార్యులు ప్రతిష్టించిన శ్రీ చక్ర అధష్టాన దేవత లలితా తిరుపస సుందరి. ఈ శ్రీ చక్రానికే నిత్యం లలితా అష్టోత్తరంతో కుంకుమపూజ చేస్తారు.
Also Read: దసరాల్లో మీ ఇంట ఆధ్యాత్మిక శక్తిని పెంచేందుకు వాస్తు ప్రకారం అనుకూలమైన రంగులివే!
లలితాత్రిపుర సుందరీ దేవికి కుంకుమార్చన సేవ ప్రీతికరం. ఎర్రటి రంగు వస్త్రాలతో అలంకరించి దధ్ద్యోజనం లేదా రవ్వకేసరి నివేదించాలి. దొరికితే ఎర్ర కలువపూలతో కానీ లేదంటే మందాల పూలతో పూజించాలి. త్రిపుర సుందరి అంటే ముల్లోకాలను పాలించేది అని అర్థం. ఓ చేత్తో చెరుకు విల్లు ధరించి మరో చేతిలో పూలబాణాలు ధరించి ఉంటుంది.
భండాసుర సంహారం కోసం అవతరించిన లలితా త్రిపుర సుందరి..ఆ రాక్షసురుడిని వధించేందుకు భీకరమైన యుద్ధం చేసింది. అందుకే లిలితా అమ్మవారిని ‘కరాంగూళీ నఖోత్పన్న నారయణ దశాకృతి’ అని పిలుస్తారు.
ఏ ఇంట్లో లలితా సహస్రం నిత్యం వినిపిస్తుందో అక్కడ నెగెటివ్ ఎనర్జీ ఉండదు..సకల శుభాలు కలుగుతాయి. చిరునవ్వులు చిందిస్తూ శివుడి వక్షస్థలంపై కూర్చుని అపురూప లావణ్యంతో ప్రకాశిస్తుంది లలితా దేవి
ఓజోన్ పొరలోపల భాగంలో జీవశక్తి వృద్ధి చెందుతుంది. ఇదే విషయాన్ని శ్రీసూక్తంలో హిరణ్యప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం అని చెప్పారు.. అంటే భూమచుట్టూ ఆవహించిన శక్తిని హిరణ్య ప్రాకారాంతర్గతం అని చెప్పారు. అంటే హిరణ్య ప్రాకారమే ఓజోన్ పొర అన్నమాట.
ఈ ఓజోన్ పొర బయట జ్వలంతిగా లోపల ఆర్ద్రగా కనిపిస్తుంది..భూమిని శివలింగంగా భావిస్తే భూమి చుట్టూ ఆవరించి ఉన్న అమ్మవారిని లలితగా భావించాలి. లలితా అమ్మవారి ఉపాసన వ్యక్తితో సౌమ్యత్వాన్ని పెంచుతుంది.
Also Read: ఆశ్వయుజ మాసం ప్రారంభ - ముగింపు తేదీలు.. కార్తీకమాసం ఎప్పటి నుంచి మొదలు!
కామ్యార్థాలకు, మోక్షార్థాలకు రెండింకి కూడా లలితాదేవి ఆలంబన. శ్రీచక్ర స్థితంగా కనిపించే అమ్మవారు లలితా త్రిపుర సుందరి. లలితాఅమ్మవారి శక్తిని ఖడ్గమాలగా కూడా కొలిచే సంప్రదాయ ఉంది. ఆత్మ, మనస్సు, శరీరం అనేవి మూడు పురాలు. వీటినే త్రిపురాలు అంటారు. ఈ 3 పురాల్లో ఉండే రాక్షసత్వాన్ని తొలగిస్తే సౌందర్యాన్ని నింపిన త్రిపుర సుందరి దర్శన లభిస్తుంది.
సకుంకుమ విలేపనా మళిక చమ్బి కస్తూరికాం
సమన్దహసితేక్షణాం సశరచాప పాశాంకుశాం
అశేషజనమోహినీ మరుణమాల్యభూషామ్బరాం
జపాకుమ భాసురాం జపవిధౌ స్మరేదమ్బికాం
అస్య శ్రీలలితా త్రిశతీ స్తోత్ర మహామంత్రస్య
భగవాన్ హయగ్రీవ ఋషి:
అనుష్లప్ ఛంద:
శ్రీలతితా మహా త్రిపుర సుందరీ దేవతా
ఐం –బీజం
సౌ: -శక్తి:
క్లీం – కీలకం
శ్రీ లలితా మహా త్రిపుర సుందరీ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగ:.... మొత్తం లలిలా సహస్రం విన్నా, చదివినా ఉత్తమ ఫలితాలు పొందుతారు. వీటితో పాటు ఖడ్గమాల, లలితా అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి.
Also Read: దేవీ త్రిరాత్ర వ్రతం - దసరాల్లో ఈ మూడు రోజులు చాలా ప్రత్యేకం!