అన్వేషించండి

Nagula Chavithi 2025 Date Time : నాగుల చవితి ఎప్పుడు? పుట్టలో పాలుపోసే ముహూర్తం, పుట్ట దగ్గర చదువుకోవాల్సిన శ్లోకం ఇదే!

Nagula Chavithi 2025 Puja Muhurat: కార్తీకమాసం ప్రారంభమైన నాలుగో రోజు నాగుల చవితి వస్తుంది. ఈ ఏడాది నాగులచవితి అక్టోబర్ 25 శనివారం వచ్చింది. ఈ రోజు పుట్టలో పాలుపోసే ముహూర్తం ఇదే...

Nagula Chavithi 2025 Puja Muhurat : దీపావళి అమావాస్య తర్వాత నుంచి కార్తీకమాసం ప్రారంభమవుతుంది. ఈ నెలలో నాలుగోరోజు వచ్చే చవితి రోజు నాగుల చవితి జరుపుకుంటారు. కొందరు నాగులచవితిని శ్రావణమాసంలో జరుపుకుంటారు. పురాణాలలో నాగుల చవితి గురించి ఎన్నో కథలున్నాయి. 

చాలా ఆలయాల్లో నాగప్రతిమలు కనిపిస్తాయి. నాగుల చవితి, నాగుల పంచమి రోజు నాగేంద్రుడిని పూజిస్తే సకల రోగాల తొలగిపోతాయని, దీర్ఘకాలిన వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తుల విశ్వాసం. 

పుట్టతో పోల్చే మనిషి శరీరానికి నవరంధ్రాలుంటాయి. నాడులతో నిండిన వెన్నుముకను వెన్నుపాము అని పిలుస్తారు. మూలాధారచక్రంలో కుండలినీ శక్తి  పాము ఆకారంలో ఉంటుందని యోగశాస్త్రంలో ఉంది. ఇది మనిషిలో నిద్రను నటిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే విషాన్ని కక్కుతూ సత్వగుణాన్ని హరించేస్తుంది. అందుకే నాగుల చవితి రోజు విష సర్పాన్ని ఆరాధిస్తే మనిషిలో విషం తొలగిపోయి శేతత్వం పొందుతుందని పండితులు చెబుతారు.

ఇక జ్యోతిష్య శాస్త్రపరంగా  కుజుడు, రాహువు దోషాలున్నవారు, సంసారిక బాధలున్నవారు... పుట్టలో పాలు పోస్తే ఆ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతారు
 
2025 లో నాగులచవితి అక్టోబర్ 25 శనివారం వచ్చింది. ఈ రోజు మొత్తం పాలు పోయొచ్చు..కేవలం  వర్జ్యం,దుర్ముహూర్తం లేని సమయాలు చూసుకుంటే చాలు..
 
అక్టోబర్ 24 శుక్రవారం రాత్రి 10 గంటల 1 నిముషం నుంచి చవితి ఘడియలు ప్రారంభమయ్యాయి

అక్టోబర్ 25 శనివారం రాత్రి 12 గంటల 3 నిముషాల వరకూ చవితి ఘడియలున్నాయి

అక్టోబర్ 25 వర్జ్యం మధ్యాహ్నం 12 గంటల 5 నిముషాల నుంచి ఒంటిగంట 50 నిముషాల వరకూ ఉంది

అక్టోబర్ 25 ఉదయం దుర్ముహూర్తం ఉదయం ఏడున్నరవరకూ ఉంది..
 
అంటే ఉదయం ఏడున్నర తర్వాత... మధ్యాహ్నం 12 గంటలలోపు...తిరిగి 2 తర్వాత ఎప్పుడైనా పుట్టలో పాలు పోయొచ్చు

పుట్ట దగ్గర పాలు పోసేటప్పుడు ఈ శ్లోకాలు చదువుకోండి
 
నన్నేలు నాగన్న , నాకులమునేలు 
నాకన్నవారల నాఇంటివారనేలు
ఆప్తమిత్రులనందరిని ఏలు 
పడగ తొక్కిన పగవాడనుకోకు 
నడుము తొక్కిన నావాడనుకో
తోక తొక్కితే తొలిగిపో వెళ్లిపో
ఇదిగో ! నూకల్ని పుచ్చుకో మూకల్ని ఇవ్వు
అని పుట్టలో పాలు పోస్తూ నూక వేసి వేడుకుంటారు 

ప్రార్థన

పుట్టలోని నాగేంద్రస్వామి లేచి రావయ్యా!
గుమ్మపాలు త్రాగి వెళ్ళిపోవయ్యా!
చలిమిడి వడపప్పు తెచ్చినామయ్యా!
వెయ్యి దండాలయ్య, నీకు కోటి దండాలయ్యా!
పుట్టలోని నాగేంద్రస్వామి!! ....

నాగులచవితిరోజున ఈ శ్లోకం పఠిస్తే కలిదోష నివారణ అవుతుంది

"కర్కోటకస్య నాగస్య దయయంత్యా నలస్య చ |
ఋతుపర్ణస్య రాజర్షే : కీర్తనం కలినాశనమ్‌ ||

గమనిక: పండితులు చెప్పినవివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో ఉన్న సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

కార్తీక మహాపురాణం కథ DAY-1.. కుక్కగా జన్మించిన నిష్టురికి మోక్షం ఎలా లభించింది? కథ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

 కార్తీక మహాపురాణం కథ DAY-2 బ్రహ్మరాక్షసులకు శాప విమోచనం, కార్తీకమాసంలో దీపారాధనతో మోక్షం ఎలా సాధ్యం? కథ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

 అరుణాచలంలో కార్తీక శోభ - గిరిప్రదక్షిణ అంటే అలా తిరిగేసి వచ్చేయడం కాదు ఈ 44 ఎనర్జీ పాయింట్స్ చూడాల్సిందే!

ఆలయం నుంచి  వరుసగా 17వ ఎనర్జీ పాయింట్ వరకూ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

18వ ఎనర్జీ పాయింట్ నుంచి 44వ ఎనర్జీ పాయింట్ వరకూ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

13-08-2026 గురువారం మీ రాశిఫలాలు!
13-08-2026 గురువారం మీ రాశిఫలాలు!
Solar Eclipse 2026: మొబైల్, టీవీలో ప్రత్యక్ష సూర్యగ్రహణాన్ని చూసినా నియమాలు పాటించాలా? తర్వాత స్నానం చేయలా?
మొబైల్, టీవీలో ప్రత్యక్ష సూర్యగ్రహణాన్ని చూసినా నియమాలు పాటించాలా? తర్వాత స్నానం చేయలా?
Solar Eclipse 2026: సూర్య గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది? విమానం కిటికీ నుంచి సంపూర్ణ సూర్యగ్రహణం ఎలా ఉంటుంది?
ఆగష్టు 12న సూర్య గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది? విమానం కిటికీ నుంచి సంపూర్ణ సూర్యగ్రహణం ఎలా ఉంటుంది?
Pisces Half Year Horoscope: మీన రాశి 2026 జూలై to డిసెంబర్ మీ జీవిత గమనం మారుతుందా?
మీన రాశి 2026 జూలై to డిసెంబర్ మీ జీవిత గమనం మారుతుందా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Embed widget