అన్వేషించండి

Medaram Maha Jathara 2026: మేడారం జాతరలో తప్పిపోయిన చిన్నారులు, రిస్ట్‌ బ్యాండ్ సహకారంతో 2 గంటల్లో ఆచూకీ తెలుసుకున్న పోలీసులు!

Sammakka Saralamma Jatara 2026: మేడారం జాతర వైభవంగా కొనసాగుతోంది. తప్పిపోయిన చిన్నారులను రిస్ట్‌ బ్యాండ్ సహకారంతో 2 గంటల్లో ఆచూకీ తెలుసుకుని వారి తల్లిదండ్రుల వద్దకు చేరుస్తున్నారు పోలీసులు

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. లక్షల సంఖ్యలో భక్తులు బంగారం తీసుకొచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. వనం మొత్తం జనసంద్రంగా మారింది. జన జాతరలో పిల్లలు , పెద్దలు తప్పిపోకుండా ఉండేందుకు, తప్పిపోయినా వెంటనే కనిపెట్టేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే తప్పిపోయిన చిన్నారులను రెండు గంటల్లో కనిపెట్టి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ రిస్ట్ బ్యాండ్ మంచి ఫలితాలను ఇస్తోంది. 

మేడారం జాతరలో తప్పిపోయిన వారిని సులువుగా కనిపెట్టేందుకు క్యూ ఆర్ కోడ్ రిస్ట్ బ్యాండ్ వ్యవస్థను భక్తులు సద్వినియోగం చేసుకుంటున్నారు. క్యూఆర్  కోడ్ రిస్ట్ బ్యాండ్ వ్యవస్థపై మల్టీ జోన్ -2 IGP S. చంద్రశేఖర్ రెడ్డి వివరాలు వెల్లడించారు.  భక్తులు వచ్చే ప్రధాన మార్గాల్లో 11 ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి  తెలంగాణ  RTC సహకారంతో చిన్నారులకు ఈ బ్యాండ్లను ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. హన్మకొండ హయగ్రీవాచారి గ్రౌండ్, హైదరాబాద్ ఉప్పల్, MGBS బస్ స్టేషన్, కరీంనగర్, పరకాల, పెద్దపల్లి, మంథని, ఏటూరునాగారం, కాటారం బస్ స్టేషన్లతో పాటూ వరంగల్ రైల్వేస్టేషన్, కాజిపేట్ రైల్వే స్టేషన్లో రిస్ట్ బ్యాండ్లు అందించే కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చంద్రశేఖర్ రెడ్డి వివరించారు. 

మేడారం జాతరలో చిన్నారులు ఎవరైనా తప్పిపోతే వారిచేతికున్న రిస్ట్ బ్యాండ్ పై క్యూ ఆర్ కోడ్ ను స్మార్ట్ ఫోన్ ద్వారా స్కాన్ చేయాలని చెప్పారు. స్కాన్ చేసిన వెంటనే చిన్నారికి సంబంధించిన వారి ఫోన్ నంబర్ కనిపిస్తుందని..లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

మేడారం జాతరలో రెండోరోజైన జనవరి 29 గురువారం సాయంత్రం సమ్మక్కను గద్దెపైకి తీసుకొచ్చి ప్రతిష్టించారు. చిలకలగుట్ట నుంచి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆడపడుచులంతా అమ్మకు ఘన స్వాగతం పలికారు. వందలాది భక్తుల కోలాహం, డప్పు చప్పుళ్లు, గిరిజన నృత్యాల మధ్య సమ్మక్క గద్దెపై కొలువుతీరింది. చిలుకల గుట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చే ఘట్టం అత్యంత ఉద్వేగ భరితంగా జరిగింది.  మంత్రులు  సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజరామయ్యర్, కలెక్టర్‌ దివాకర అమ్మవారికి స్వాగతం పలికేందుకు ముందుగానే గద్దెల ప్రాంగణానికి చేరుకున్నారు. పూజారులు అమ్మవారిని తీసుకుని చిలకల గుట్ట దిగుతున్న సమయంలోనే ఆమె రాకకు గౌరవ సూచకంగా  ములుగు జిల్లా ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ ఏకే 47తో గాల్లోకి కాల్పులు జరిపారు. చిలకలగుట్ట గేటు వద్ద కూడా పోలీసులు , భక్తుల జయజయధ్వానాల మధ్య రెండోసారి కాల్పులు జరిపారు.గద్దెపై సమ్మక్క కొలువుతీరే ఘట్టం చూసేందుకు రెండు కళ్లు సరిపోవు

 ఫోన్ చేసిన క్షణాల్లో భక్తుల ముందుకు 108 బైక్ అంబులెన్స్! మేడారంలో ప్రాణాలు కాపాడేందుకు వినూత్న ప్రయోగం! .. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

మేడారం జాతరలో న్యూజిలాండ్ మావోరీల ప్రదర్శించిన 'హాకా' నృత్యం గురించి ఆశ్చర్యపోయే విషయాలు

వనదేవతలకు రక్త తర్పణం.. మేడారంలో 'బలిహారతి' వెనుక రహస్యాలేంటి?

బెల్లం చుట్టూ ఈగలు' అంటారు కదా! మేడారం జాతరలో టన్నుల కొద్దీ బెల్లం, కానీ ఒక్క ఈగ కూడా ఉండదేం? ఈ వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి


 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

ఇంద్రకీలాద్రి భక్తులకు అలర్ట్: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢమాసం రద్దీ, వీఐపీ దర్శనాలు నిలిపివేత!
ఇంద్రకీలాద్రి భక్తులకు అలర్ట్: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢమాసం రద్దీ, వీఐపీ దర్శనాలు నిలిపివేత!
శ్రావణంలో శివుడికి నీటి అభిషేకం ఎందుకు? నీలకంఠుడి కథతో మన జీవితానికి లింకేంటి?
శ్రావణంలో శివుడికి నీటి అభిషేకం ఎందుకు? నీలకంఠుడి కథతో మన జీవితానికి లింకేంటి?
ఆధ్యాత్మిక, మానసిక వికాసానికి దోహదపడే చాతుర్మాసం! నవంబర్ వరకూ ఈ 4 రాశులవారికి విష్ణువు అనుగ్రహం, సంపద!
ఆధ్యాత్మిక, మానసిక వికాసానికి దోహదపడే చాతుర్మాసం! నవంబర్ వరకూ ఈ 4 రాశులవారికి విష్ణువు అనుగ్రహం, సంపద!
26-07-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
26-07-2026 ఆదివారం మీ రాశిఫలాలు!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: YS Jagan సూటి ప్రశ్న
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: వైఎస్ జగన్ ప్రశ్న
Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
Chennai Love Story Collections: చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
526km కియా సైరోస్‌ EV ఎంట్రీ - టాటా ఎక్సాన్‌ EV, మహీంద్రా XUV 3XO EV కంటే బెటరా?
Kia Syros EV వర్సెస్‌ Nexon EV వర్సెస్‌ XUV 3XO EV - A టు Z కంపారిజన్‌, ఏ ఎలక్ట్రిక్‌ SUV కొంటారు?
Jana Nayagan Collections: 150 కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... మూడో రోజు కాస్త బెటర్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
150 కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... మూడో రోజు కాస్త బెటర్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
Embed widget