Image Credit: Pinterest
Mehandipur Balaji Temple: భారతదేశంలో ఎన్నో ఆలయాలున్నాయి. గంటలతరబడి, రోజుల తరబడి ప్రయాణం చేసి మరీ ఆ ఆలయాలకు వెళతుంటారు. మొక్కులు చెల్లించుకుంటారు. కోరిన కోర్కెలు నెరవేరిన తర్వాత మరోసారి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రసాదం తీసుకుని వెళ్లిపోతారు. అయితే కొన్ని దేవాలయాలు ఇందుకు భిన్నంగా ఉంటాయి. అక్కడకు వెళ్లాలంటే వెన్నుకో వణుకు పుడుతుంది. తల్చుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఆలయాలు ఇలాకూడా ఉంటాయా అనే సందేహం వస్తుంది. అక్కడ ఆచారాలు, వారు పాటించే సంప్రదాయాలు చూసి ముక్కున వేలేసుకుంటారు. అక్కడ భక్తుల విశ్వాసం అది అంతే. అలాంటి ఆలయాల్లో ఒకటి మహేందీపూర్ బాలాజీ ఆలయం.
Also Read: ఈ 5 గుణాలు మీకుంటే మీ జీవితం ఆనందమయం
"దెయ్యాలూ, భూతాలూ, పిశాచాలూ, చేతబడుల వదిలిపోవాలంటే ఏం చెయ్యాలి" అని రాజస్థాన్ వాసుల్ని అడిగితే ముక్తకంఠంతో వాళ్లు చెప్పే సమాధానం...మహేందీపూర్ బాలాజీ ఆలయానికి వెళ్లమని. దౌసా జిల్లాలో ఉంది ఈ ఆలయం. నిత్యం వేల మంది భక్తులు అక్కడకు వెళ్తుంటారు. అక్కడ భక్తుల్ని చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది.
ఇదంతా చూస్తే...ఇది ఆధ్యాత్మిక ప్రదేశమా లేదంటే భయంకరమైన శిక్షలు అమలు చేసే నరకకూపమా అనే సందేహం మీకు రావొచ్చు. కానీ ఇదంతా దయ్యాలను వదిలించేందుకే అంటారు అక్కడి పూజారులు. రెండు కొండల మధ్య ఉన్న ఈ ఆలయంలో చాలా విచిత్రాలు కనిపిస్తాయి. దెయ్యాలు , ఆత్మల అడ్డంకులను వదిలించుకోవడానికి ఇక్కడ ప్రజలు బాలాజీ మహారాజ్ పాదాల వద్దకు చేరుకుంటారు.
Also Read: సప్త మాతృకలంటే ఎవరు - వాళ్లేం చేస్తారు!
వెనక్కు తిరిగి చూస్తే అంతే!
ఏ గుడికి వెళ్లినా దర్శనం, పూజ అనంతరం ప్రసాదం తీసుకుంటారు. వెళుతూ వెళుతూ వెనక్కు తిరిగి చూసి మళ్లీ దర్శనానికి రావాలని మొక్కుకుంటారు. కానీ మహేందీపూర్ బాలాజీ ఆలయంలో మాత్రం ప్రసాదం ఇవ్వరు. పైగా దర్శనం తర్వాత వెనక్కు తిరిగి చూడకూడదట. అలా చూస్తే దయ్యాలను తమలోకి ఆహ్వానించినట్టే అని హెచ్చరిస్తారు పూజారులు. మెహదీపూర్ బాలాజీ దేవాలయంలో బాలుడి రూపంలో ఉన్న హనుమంతుడి విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహం ఛాతి మధ్యలో ఓ ఒక రంధ్రం ఉంటుంది..దాని నుంచి నిరంతర నీరు వస్తూనే . ఈ స్వామివారిని దర్శించుకుని వెళ్లిన తర్వాత వారం పాటు గుడ్లు, మాంసం, మద్యం, వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు తీసుకోవడం మానేయాలని చెబుతారు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.
Friday Tips: శుక్రవారం రోజు ఈ పని చేస్తే లక్ష్మీదేవి కృపకు పాత్రులవుతారు, శుక్రుడి అనుగ్రహం కూడా!
Horoscope Today September 22, 2023 :ఈ రాశివారు టైమ్ వేస్ట్ చేయడంలో ముందుంటారు, సెప్టెంబరు 22 రాశిఫలాలు
Astrology : ఈ రాశివారు బాగా సంపాదిస్తారు తక్కువ ఖర్చు చేస్తారు!
Astrology : ఈ రాశివారు ఎప్పుడూ ఒకరి అధీనంలోనే ఉంటారు, ఈ రాశివారి లక్షణమే ఇది!
Vishnu Sahasranamam: విష్ణుసహస్రం పారాయణం చేయాల్సిన సందర్భాలివే!
Rajamundry Jail: రాజమండ్రి జైలులో ఖైదీ మృతిపై జైళ్ల శాఖ కీలక ప్రకటన - అసలు ఏం జరిగిందో చెప్పిన డీఐజీ
Adilabad News: అంబులెన్స్ సిబ్బందికి హ్యాట్సాఫ్ - వర్షంలో రెండు కిలో మీటర్లు కాలినడకన వెళ్లి మహిళకు డెలివరీ
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై కుస్తీ, ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ మీటింగ్
IND vs AUS: మొహాలీని మోతెక్కించేదెవరు? - నేడే భారత్, ఆసీస్ తొలి వన్డే
/body>